తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు

* గ్రూప్-2 ప్రిలిమినరీ పై 400 అభ్యంతరాలు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రకటించిన వివిధ ఉద్యోగాల రాత పరీక్ష తేదీలు మారాయి. శ్రీరామ నవమి, జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. అసిస్టెంట్ కెమిస్ట్, సహాయ సంచాలకుడు, నగర ప్రణాళిక సహాయకుడు, వ్యవసాయ అధికారి, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల రాత పరీక్షలు వచ్చేనెల 4 నుంచి 6వ తేదీ మధ్య జరగాల్సి ఉంది. వీటిని 6 నుంచి 8వ తేదీ మధ్య నిర్వహించేలా సర్దుబాటుచేశారు. వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి వెల్లడించారు.
గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై 400 అభ్యంతరాలు
ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల నుంచి 400 వరకు అభ్యంతరాలు వచ్చాయి. నిపుణుల కమిటీ వీటిని వచ్చే వారం పరిశీలించనుంది. మరోవైపు ఏఈఈ ప్రశ్నపత్రాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన వేలాది అభ్యంతరాలను కమిటీ పరిశీలించింది. త్వరలో తుది 'కీను ఖరారు చేయనున్నారు. 2011 గ్రూపు-1 ప్రధాన పరీక్షల ఫలితాల వెల్లడికి అవసరమైన చర్యలు పూర్తి కావొచ్చాయి. త్వరలో జరిగే కమిషన్ సమావేశంలో ఈ రెండు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Posted on 09-03-2017