తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అతుల్‌సింగ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి వై.వి.ఎస్‌.టి.సాయిని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15న బదిలీ చేసింది. ఆయనను ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అతుల్‌సింగ్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించింది. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Posted on 16-03-2017