తాజా స‌మాచారం

వెబ్‌సైట్‌లో వ్యవసాయ పోస్టుల హాల్‌ టికెట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న వివిధ పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్‌లో వ్యవసాయ అధికారుల పోస్టులు, అసిస్టెంట్‌ కెమిస్ట్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌లో అసిస్టెంట్‌ డైరక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ గతంలో ప్రకటనలు జారీ చేసింది.
అందుబాటులో రెస్పాన్స్ షీట్లు: ఏపీపీఎస్సీ ఇంతకు ముందు జారీ చేసిన వివిధ విభాగాల్లోని అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల పరీక్షల ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం ఫైనల్‌ కీని ఖరారు చేసింది. దీని ఆధారంగా ఆయా అభ్యర్థుల వారీగా రెస్పాన్స్‌ షీట్లను రూపొందించింది. వీటిని అభ్యర్థులు పరిశీలించుకోవచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది.
https://goo.gl/ISn2Gi

Posted on 30-03-2017