తాజా స‌మాచారం

ఏప్రిల్ 3న‌ గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలు

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలను సోమవారం(ఏప్రిల్ 3) ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ చెప్పారు. ఫిబ్రవరి 26న నిర్వహించిన గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్)కు 4.82 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసే సమయంలో వివరాలను తప్పుగా నమోదుచేసినందున సుమారు 12వేల మంది అభ్యర్థుల జవాబుపత్రాలు మూల్యాంకనానికి నోచుకోలేదు.

Posted on 02-04-2017