తాజా స‌మాచారం

గ్రూప్‌ - 2 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడి

ఈనాడు, అమరావతి: గ్రూప్‌ - 2 ప్రాథమిక (స్క్రీనింగ్‌) పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 3న విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి తెలిపారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపారు. 4.83 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయగా 49,100 మంది మేలో జరగనున్న ప్రధాన పరీక్ష కోసం ఎంపికయ్యారు. ఎంపిక చేసినవారిలో గరిష్ఠంగా 129.59 మార్కులు, కనిష్ఠంగా 74.49 మార్కులు సాధించిన వారు ఉన్నట్లు కార్యదర్శి వెల్లడించారు. మరో 104 మంది అర్హత పొందినవారి జవాబు పత్రాల్లో వైట్‌నర్‌ వంటి వాటితో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించడంతో ఆ పత్రాలను తిరస్కరించినట్లు తెలిపారు. పరీక్ష రాసిన వారిలో 12,573 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయలేదని, వారుజవా బుపత్రాన్ని నింపే క్రమంలో పొరపాట్లు చేయడం, హాల్‌టిక్కెట్‌ నెంబరు, ఇతర వివరాల నమోదును సరిగా చేయకపోవడమే కారణమని వివరించారు. మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ముగ్గురిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

RESULTS

Posted on 04-04-2017