తాజా స‌మాచారం

ప్రధాన పరీక్షల ఫలితాల వెల్లడి

ఈనాడు, అమరావతి: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎన్విరాన్‌మెంటల్‌) ప్రధాన పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏప్రిల్ 20న ప్రకటించింది. అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ అభ్యర్థులకు మే 23 నుంచి 25వరకు.. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ అభ్యర్థులకు మే 26న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
గుంటూరుకు రానున్న ఏపీపీఎస్సీ: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం హైదరాబాద్‌ నాంపల్లి నుంచి గుంటూరు నగరానికి రానుంది. ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Posted on 21-04-2017