తాజా స‌మాచారం

'గ్రూప్-2' వాయిదాపై నేటితో ముగియనున్న అభిప్రాయ సేకరణ

ఈనాడు, అమరావతి: గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలా? వద్దా? అన్న విషయమై అభ్యర్థుల నుంచి మొదలైన అభిప్రాయ సేకరణ ఆదివారం( మే 7) అర్ధరాత్రితో ముగియనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 8,000 మందికిపైగా స్పందించినట్లు తెలిసింది. త్వరలో జరిగే గ్రూప్-2 ప్రధాన పరీక్షను 49,100 మంది రాయబోతున్నారు. స్క్రీనింగ్ టెస్టులో గరిష్ఠం నుంచి కనిష్ఠం వరకు మార్కులు సాధించిన అభ్యర్థుల్లో ఎంతమంది స్పందించారు? ఉత్తమ మార్కుల్ని సాధించిన వారి శాతం ఎలా ఉంది? వాయిదాకు ఏయే కారణాలు ప్రస్తావించారు? అన్న దానిపై ఎపీపీఎస్సీ మే 8, 9 తేదీల్లో విశ్లేషణ చేయనుంది. పోస్టుల సంఖ్యకు తగినట్లు ఉత్తమ మార్కుల్ని సాధించిన వారి నుంచి వచ్చిన స్పందనలకు మాత్రమే ఎపీపీఎస్సీ ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Posted on 07-05-2017