తాజా స‌మాచారం

గ్రూప్‌ - 3 మరోసారి వాయిదా

ఈనాడు, అమరావతి: పంచాయతీ కార్యదర్శుల నియామకం కోసం చేపట్టే గ్రూప్‌-3 పరీక్షల్ని ఏపీపీఎస్సీ మరోసారి వాయిదా వేసింది. జులై 30వ తేదీన ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అదే రోజు డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అర్హత పరీక్ష ఏపీసెట్‌ ఉన్నందున అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో గ్రూప్‌-3 వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో ప్రకటిస్తారు. గ్రూప్‌-3 పరీక్ష వాయిదా వేయడం ఇది రెండోసారి.

Posted on 11-05-2017