close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఏపీపీఎస్సీ- 405 పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్ పోస్టులు

ఏపీ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీస్‌లో ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీల లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 405
స‌బ్జెక్టులు/ బ్రాంచీలు: ఆర్కిటెక్చ‌ర‌ల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బ‌యో-మెడిక‌ల్ ఇంజినీరింగ్, క‌మ‌ర్షియ‌ల్ అండ్ కంప్యూట‌ర్ ప్రాక్టీస్, సిరామిక్ టెక్నాల‌జీ, కెమిక‌ల్ టెక్నాల‌జీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్,గార్మెంట్ టెక్నాల‌జీ, జియాల‌జీ, మెరైన్ ఇంజినీరింగ్, మ్యాథ‌మేటిక్స్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మ‌సీ, ఫిజిక్స్, టెక్స్‌టైల్ టెక్నాల‌జీ.
అర్హ‌త‌: సంబంధిత బ్రాంచీలు/ స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణ‌త‌. క‌మ‌ర్షియ‌ల్ అండ్ కంప్యూట‌ర్ ప్రాక్టీస్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు కామ‌ర్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ, ఇంగ్లిష్‌లో టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ హ‌య్య‌ర్ గ్రేడ్ ఉండాలి.
వ‌యఃప‌రిమితి: 01.07.2018 నాటికి 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌/ మెయిన్ ఎగ్జామినేష‌న్, ఓర‌ల్ టెస్ట్ (ఇంట‌ర్వ్యూ) ఆధారంగా.
మెయిన్ ఎగ్జామినేష‌న్ తేది: 2019 జులైలో.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.120.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 06.02.2019.
ఫీజు చెల్లింపు చివ‌రితేది: 26.02.2019.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 27.02.2019.

నోటిఫికేషన్ వెబ్‌సైట్‌‌

Posted on 31.12.2018