close

తాజా స‌మాచారం

ఏపీ టెట్‌ వాయిదా

* ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహ‌ణ‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వాయిదా పడింది. జనవరి 17 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో జరగాల్సిన ఈ పరీక్షను మూడు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మళ్లీ ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు దీన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఆయన వివరించారు. టెట్‌ వాయిదా ప్రభావం డీఎస్సీ నిర్వహణపై ఉండదన్నారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల జారీ తేదీల్లో మార్పులు ఉంటాయని తెలిపారు.
* ఆ వదంతుల్ని నమ్మొద్దు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ర‌ద్దు చేస్తారంటూ వస్తోన్న వదంతుల్ని అభ్యర్థులెవరూ నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశం ఉందన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఫిబ్రవరి 9న పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

Posting on 28.12.2017