close

తాజా స‌మాచారం

ఆన్‌లైన్‌లో టెట్‌ జవాబు పత్రాలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. మార్చి 23, 24 తేదీల్లోనే 10,994మంది ఆన్‌లైన్‌లో పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. ప్రశ్నాపత్రంలో ఐదు ప్రశ్నలు కనిపించలేదని 467 మంది పేర్కొన్నారు. ప్రశ్నాపత్రంతోపాటు జవాబు పత్రం (అడిట్‌ ట్రైయల్‌ రిపోర్టు) కోసం మొత్తం 8,114మంది దరఖాస్తు చేయగా ఇందులో 3,398మందికి సంబంధించిన వివరాలను మాత్రమే అందుబాటులో ఉంచారు. మిగతా వారి సమాచారాన్నిమార్చి 26 తర్వాత ఆన్‌లైన్‌లో పెట్టనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఫిర్యాదులు ఇలా..
* పుట్టిన తేదీ, కులం, తదితర మార్పులకు వచ్చినవి: 5,771
* పరిష్కరించినవి: 800
* మార్కులు తక్కువ వచ్చాయంటూ వచ్చినవి: 2,880
* పరిష్కారం: 2,450
* ప్రశ్నాపత్రంతోపాటు జవాబు పత్రం(అడిట్‌ ట్రైయల్‌ రిపోర్టు) కోసం రుసుములు చెల్లించినవారు: 8,114 మంది
* డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నవి: 3,398


Posting on 25.03.2018