close

తాజా స‌మాచారం

టెట్‌ జవాబుపత్రాలకు 30వేల దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో మార్కులు తక్కువ వచ్చాయని పేర్కొంటూ జవాబు పత్రాల కోసం రూ.200 చెల్లించి, మొత్తం 30,591మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇప్పటి వరకు 23,103మంది ఆన్‌లైన్‌లో జవాబు పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు టెట్‌ కన్వీనర్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు మరోసారి టెట్‌ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన వెల్లడించారు.


Posting on 30.03.2018