close

తాజా స‌మాచారం

2 పేపర్ల ద్వారా టెట్‌!

* ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు
ఈనాడు అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణలో మార్పులు రానున్నాయి. ఇటీవల జరిగిన టెట్‌ను మూడు పేపర్ల ద్వారా నిర్వహించారు. ఇకపై రెండు పేపర్ల ద్వారానే నిర్వహించేందుకు వీలుగా విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పేపరు-1లో ఎలాంటి మార్పులేదు. పేపరు-2లో మాత్రం భాషా పండితులకు 60 మార్కులకు ఆయా భాషల అర్హతలను అనుసరించి ప్రశ్నలు ఇవ్వనున్నారు. మిగిలిన ప్రశ్నల్లో ఎలాంటి మార్పులేదు. భాషా పండితులకు 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తే అదే సంఖ్యలో గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల వారికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
పీఈటీలకూ టెట్‌!
తొలిసారిగా పీఈటీలకు టెట్‌ను నిర్వహించనున్నారు. దీనిని పేపరు-2బీగా పేర్కొంటున్నారు. దీన్ని 120 మార్కులకు నిర్వహిస్తామంటూ విద్యా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవికాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు 30 మార్కుల వరకు లబ్ధి కల్పిస్తారు. మొత్తమ్మీద 150 మార్కులకు ఈ పరీక్ష ఉన్నట్లు లెక్క. 120 మార్కుల్లో లాంగ్వేజీ, పెడగాజీకి సంబంధించి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాయామ విద్యకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.


Posting on 27.04.2018