close

తాజా స‌మాచారం

టెట్‌ పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం లేదు: కన్వీనర్‌

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాల సామర్థ్యం ఆధారంగానే సెంటర్లను కేటాయించామని కన్వీనర్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఒకవేళ జిల్లాల్లో పరిమితి మించితే ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాలకు అభ్యర్థులు ఆప్షన్లు పెట్టుకున్నారన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో 23వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. ఎలాంటి ఆప్షన్లు పెట్టని 14,891మందికి విద్యాశాఖే పరీక్షా కేంద్రాలను కేటాయించిందన్నారు. పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం లేదన్నారు. జూన్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్షా కేంద్రాల ఎంపికలో మొదట ఆప్షన్లు ఇచ్చినవారికి సొంత జిల్లాలు ఆ తర్వాత ఆప్షన్లు పెట్టుకున్నవారికి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అధికారులు.. అభ్యర్థులే ఇష్ట ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకున్నారని చెప్పడం విశేషం.Posting on 05.06.2018