close

తాజా స‌మాచారం

‘టెట్‌ పీఈటీ అభ్యర్థులు ధ్రువీకరణపత్రాలు అప్‌లోడ్‌ చేయాలి’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వ్యాయామ విద్యకు సంబంధించి గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో ఇన్సెంటివ్‌ మార్కుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా క్రీడల్లో వారు సాధించిన ప్రతిభా పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని టెట్‌ కన్వీనర్‌ సుబ్బారెడ్డి జూన్ 11న‌ ఓ ప్రకటనలో సూచించారు. టెట్‌ వెబ్‌సైట్‌లో జూన్ 13 నుంచి 20 వరకు అప్‌లోడ్‌కు అవకాశం కల్పించామన్నారు. ఇన్సెంటివ్‌ మార్కుల కోసం 5,216 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.


Posting on 12.06.2018