close

తాజా స‌మాచారం

టెట్‌ అభ్యర్థులు క్రీడా ప్రతిభా పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: టెట్‌ వ్యాయామ విద్య అభ్యర్థులు క్రీడల్లో తాము సాధించిన ప్రతిభా పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన ఫార్మాట్‌ను టెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని టెట్‌ కన్వీనర్‌ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. అనుబంధ పత్రం 1, 2, 3 గా ఉంటుందని, ఒకటో పత్రానికి 30, రెండో ఫార్మట్‌కు 25, మూడో ఫార్మాట్‌కు 20 మార్కులు ఉంటాయని వివరించారు. వీటిని సంబంధిత సమాఖ్యలు, యూనివర్సిటీల వద్ద ధ్రువీకరణ చేయించుకొని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని ఆయన జూన్ 12న‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Posting on 13.06.2018