close

తాజా స‌మాచారం

ఏపీ టెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసినట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేయగా... 3,70,576 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. జూన్ 20 నుంచి ప్రాథమిక ‘కీ’ అందుబాటులో ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే 23వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు టెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సరైన వివరాలు, ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. తుది ‘కీ’ 26న, ఫలితాలు 30న ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులు రెస్పాన్స్‌ షీట్లను జూన్ 20 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ప్రాథమిక వివరాలు, పుట్టిన తేదీ, పేరు, కులం, లింగ, తదితరాలు కూడా సరిచేసుకోవచ్చని వివరించారు. 23వ తేదీ వరకు వెబ్‌సైట్‌లోని ఫిర్యాదు బాక్సులో అభ్యర్థనలను నమోదు చేయాలన్నారు. పీఈటీ, డాన్స్‌, మ్యూజిక్‌ మినహా డీఎస్సీ సిలబస్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Posting on 20.06.2018