close

తాజా స‌మాచారం

మెరుగైన అభ్యర్థుల ఎంపికకే భౌతిక సామర్థ్య పరీక్షలు: మంత్రి గంటా

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో వ్యాయామ పరిజ్ఞానం సమర్థమంతంగా అందించేందేకే పీఈటీ అభ్యర్థులకు డీఎస్సీలో భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల వయసును పరిగణలోకి తీసుకుని సామర్థ్య పరీక్షలు నిర్వహించి, అత్యంత పారదర్శకంగా మార్కులు కేటాయిస్తామని జూన్ 25న ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్వాలియర్‌ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత లక్ష్మీబాయ్‌ జాతీయ వ్యాయామ విద్యా సంస్థ ఆచార్యులు జె.పి.వర్మ నేతృత్వంలో జూన్ 29న మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. పీఈటీలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకే నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థుల ప్రతిభా, అనుబంధ పత్రాలను సంబంధిత పాఠశాల క్రీడా సమాఖ్య, విశ్వవిద్యాలయాలకు పంపుతున్నామని, అవి వాస్తవమని నిర్ధారణ అయిన తర్వాత కేటగిరీల వారీగా ఆ మార్కుల్ని రాత పరీక్ష మార్కులతో జత చేస్తామని తెలిపారు.

Posting on 26.06.2018