close

తాజా స‌మాచారం

'టెట్' నిబంధనల్లో మార్పులు!

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిబంధనల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు బీఎడ్‌తోపాటు డిగ్రీలో 45% మార్కులు సాధించి ఉండాలని తొలుత పేర్కొన్నారు. దీన్ని ఐదు శాతానికి కుదించి 40% చేశారు. బీఎడ్ పూర్తిచేసిన బీటెక్ అభ్యర్థులకు టెట్ రాసే అవకాశాన్ని కల్పిస్తారు. టెట్‌లోనే తెలుగు భాషా పండితులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నారు. 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో భాషకు సంబంధించి 60 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.

Posting on 12.01.2018