తాజా స‌మాచారం

ప్రతిభాపత్రాల జోడింపునకు 28 వరకు అవకాశం: టెట్‌ కన్వీనర్‌

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ప్రోత్సాహక (ఇన్సెంటీవ్‌) మార్కుల కోసం వ్యాయామ ఉపాధ్యాయుల ప్రతిభాపత్రాల జోడింపునకు(అప్‌లోడ్‌) జూన్ 28 అర్ధరాత్రి వరకు తుది అవకాశం ఉన్నట్లు టెట్‌ కన్వీనర్‌ ఎ.సుబ్బారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ అప్‌లోడ్‌ చేసుకోని వారిని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీటిని వాస్తవమని నిర్ధారించుకున్న తర్వాత కేటగిరీలవారీగా మార్కులను కేటాయిస్తామన్నారు.
https://aptet.apcfss.in/

Posting on 27.06.2018