close

తాజా స‌మాచారం

2న ఏపీ టెట్‌ ఫలితాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను జులై 2న‌ విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 1న‌ ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా.. అధికారులు వాయిదా వేశారు. మొత్తం 3,97,957మంది దరఖాస్తు చేయగా.. 3,70,576మంది అభ్యర్థులు టెట్‌కు హాజరయ్యారు. ఫలితాలను ‌www.eenadu.net, www.eenadupratibha.net వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Posting on 01.07.2018