తాజా స‌మాచారం

ఆన్‌లైన్‌లో టెట్ హాల్‌టిక్కెట్లు

ముసునూరు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్‌టిక్కెట్లు ఆదివారం(ఫిబ్రవరి 11) నుంచి డౌన్‌లోడ్ అవుతుండటంతో ఇప్పటివరకు అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు తొలగిపోయాయి. పేపరు-3 హాల్‌టిక్కెట్లు శనివారం(ఫిబ్రవరి 10) రాత్రి ఎనిమిదింటి నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీ టెట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నా.. సైట్ తెరుచుకోలేదు. ఆదివారం ఉదయం పదింటి నుంచి అన్ని పేపర్ల హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో సర్వర్ సమస్యల వల్ల సైట్ తెరచుకోలేదని అభ్యర్థులు వాపోయారు. తెలంగాణలో డీఎస్సీ నేపథ్యంలో ఏపీ టెట్ మరోమారు వాయిదా పడుతుందేమోనని కొద్ది రోజులుగా అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ అవుతుండటంతో ఆ అనుమానాలకు తెరపడినట్లయింది. విద్యాశాఖ ప్రకటించినట్టుగానే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు.
Download HallTicket

Posting on 12.02.2018