close

తాజా స‌మాచారం

టెట్‌ పరీక్షా కేంద్రాల్లో మార్పులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 4,46,833 దరఖాస్తులు రాగా.. 4,15,576మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని టెట్‌ కన్వీనర్‌ సుబ్బారెడ్డి తెలిపారు. పేపర్‌ - 1, పేపర్‌ - 2లకు 8 సెషన్లు, పేపర్‌ - 3కి మూడు సెషన్లు, అన్ని పేపర్లకు కలిపి ఒక సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు శనివారం (ఫిబ్రవ‌రి 17) ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థుల అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించిన 15,605మందిలో 12,596మంది తమ ఐచ్ఛికాలను మార్చుకున్నారని, వీరిలో 11,196మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు 1345 ఫిర్యాదులు రాగా.. గర్భిణులు, వికలాంగులకు సొంత జిల్లాల్లోనే కేంద్రాలను కేటాయించామన్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసిన వారిలో 151 మందికి మార్పు చేసిన హాల్‌టిక్కెట్లు ఇస్తున్నామని, వీరికి ప్రత్యేక సెషన్స్‌లో పరీక్ష నిర్వహించనున్నామన్నారు. కృష్ణ చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్షా కేంద్రం వచ్చిన 3,190మందిలో 2,500మందికి పొన్నూరు సమీప జీవీఆర్‌ఎస్‌, చేబ్రోలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కేంద్రాన్ని కేటాయించామని, మిగతా నెల్లూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 690మందికి ప్రకాశం జిల్లాలోని కృష్ణచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో కేంద్రాన్ని ఇచ్చామన్నారు. టెట్‌ అభ్యర్థులు వినతులను ఫిబ్రవ‌రి 18వ తేదీ 12 గంట‌ల లోపు ఇవ్వాలని, ఫిబ్రవ‌రి 21 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు.

Posting on 18.02.2018