close

తాజా స‌మాచారం

అవకాశం కోల్పోయిన టెట్‌ అభ్యర్థులు

* పరీక్షా కేంద్రాల మార్పుల ఫలితం!
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కేంద్రాల మార్పుతో తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ మార్చి 5న‌ కొందరు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వచ్చారు. ఏలూరుకు చెందిన రావూరి వెంకట్‌కు గతంలో హైదరాబాద్‌లో కేంద్రాన్ని కేటాయించారు. అభ్యర్థుల అనుమతి లేకుండా కేంద్రాలను కేటాయించడంపై విమర్శలు రావడంతో ఆ తర్వాత మార్పునకు అవకాశం కల్పించారు. కేంద్రం మార్చిన వారికి మార్చి 2న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆన్‌లైన్‌లో మార్చుకునేందుకు ప్రయత్నించినా అది జరగలేదు. కమిషనరేట్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో వివరాలు ఇస్తే తామే మార్పు చేస్తామని అధికారులు హమీ ఇచ్చారని వెంకట్‌ పేర్కొన్నారు. ఇప్పుడేమో పరీక్ష ఫిబ్రవ‌రి 25నే పూర్తయినందున అవకాశం ఇవ్వలేమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడితో పాటు మరికొందరు కూడా ఇదే విషయమై కమిషనరేట్‌కు వెళ్లారు.

Posting on 02.03.2018