తాజా స‌మాచారం

టెట్‌ ప్రాథమిక ‘కీ’పై 19,314 అభ్యంతరాలు

ఈనాడు, అమరావతి: టెట్‌ ప్రాథమిక ‘కీ’పై మార్చి 9 వరకు 19,314 అభ్యంతరాలు వచ్చినట్లు కన్వీనర్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు. పేపర్‌-1కు 12,070, పేపర్‌-2కు 5,018, పేపర్‌-3కి 2,226 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం తుది ‘కీ’ని మార్చి 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభ్యంతరాలు తెలిపే అభ్యర్థులు తాము సూచించే జవాబు సరైనదని చెప్పేందుకు ఆధారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులు సూచించారు. ఆధారాలను అప్‌లోడ్‌ చేయని వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు. మరోవైపు గుంటూరులోని చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 24న నిర్వహించిన టెట్‌ పరీక్షలో ఆన్‌లైన్‌లో ఐదు ప్రశ్నలు కనిపించలేదు. అభ్యర్థులు ఇన్విజిలేటర్లకు ఫిర్యాదు చేయడంతో వారి నుంచి సంతకాలు సైతం స్వీకరించారు.

Posting on 10.03.2018