close

తాజా స‌మాచారం

టెట్‌ అభ్యర్థులకు 16 మార్కులు

* తుది ‘కీ’ విడుదల
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో పేపర్‌-1, పేపర్‌-2 గణితం, సాంఘికశాస్త్రం అభ్యర్థులకు 16మార్కులు కలపనున్నారు. ప్రశ్నలు, ఐచ్ఛికంగా ఇచ్చిన నాలుగు జవాబుల్లో తప్పులు దొర్లడంతో మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. మార్చి 12న‌ పాఠశాల విద్యాశాఖ టెట్‌ తుది ‘కీ’ని విడుదల చేసింది. 54 ప్రశ్నాపత్రాల్లోని 12,960 ప్రశ్నలకు సంబంధించి మొత్తం 19,264 అభ్యంతరాలు వచ్చాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం తుది ‘కీ’ ప్రకటించారు.


Posting on 13.03.2018