close

కథనాలు

ఏపీ టెట్ మే-2018

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్ మే-2018) ప్రకటనను విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్ష‌లో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్య‌ర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1; 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అర్హ‌త‌లు: పేప‌ర్‌ను బ‌ట్టి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్‌/ యూజీడీపీఈడీ/ డీపీఈడీ/ బీపీఈడీ లేదా త‌త్స‌మానం. 2017-18 విద్యా సంవ‌త్స‌రం చివ‌రి ఏడాది చ‌దివే అభ్య‌ర్థులూ అర్హులే.
క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణ‌తా మార్కులు
1. ఓసీ- 60% మార్కులు ఆపైన‌
2. బీసీ- 50% మార్కులు ఆపైన‌
3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌- 40% మార్కులు ఆపైన‌
ప‌రీక్ష కేంద్రాలు: ఏపీకి చెందిన 13 జిల్లాల‌తో పాటు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ముఖ్య‌మైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: మే 04న
దరఖాస్తు రుసుములు చెల్లింపులు: మే 05 నుంచి 22 వరకు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ: 05 నుంచి మే 23 వరకు.
హెల్ప్ డెస్క్ సేవలు: మే 04 నుంచి జూన్ 30 వరకు.
దరఖాస్తులు, ఇతరాత్ర అంశాలపై ఫిర్యాదులు స్వీకరణ: మే 05 నుంచి జూన్‌ 30 వరకు.
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: మే 25 నుంచి
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: జూన్‌ 03 నుంచి
పరీక్షలు నిర్వహణ
పేపర్-1: 10.06.2018, 11.06.2018 & 12.06.2018.
పేపర్-2(ఎ): 13.06.2018 to 15.06.2018 & 17.06.2018 to 19.06.2018.
పేపర్-2(బి): 21.06.2018.
సమయం:
సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు
సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు
ప్రాథమిక 'కీ' విడుదల: జూన్ 22న‌
అభ్యంతరాల స్వీకరణ: జూన్ 26న‌
తుది 'కీ' విడుదల: జూన్ 28న‌
తుది ఫలితాలు: జూన్ 30న‌

Posting on 04.05.2018