BANK OF INDIA

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 670 ఆఫీస‌ర్‌, మేనేజ‌ర్ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా 270 ఆఫీస‌ర్ (క్రెడిట్‌), 400 మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. పీజీ అర్హత‌తో ఆఫీస‌ర్ పోస్టుల‌కు పోటీ ప‌డ‌వ‌చ్చు. మేనేజ‌ర్ పోస్టుల‌కు మాత్రం పీజీతోపాటు ప‌ని అనుభ‌వం త‌ప్పనిస‌రి. ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
పోస్టులవారీ ఖాళీల‌ వివ‌రాలు, అర్హత‌లు
పోస్టు: ఆఫీస‌ర్ (క్రెడిట్‌)
మొత్తం ఖాళీలు - 270
విభాగాల‌వారీ: జ‌న‌ర‌ల్‌ -113, ఓబీసీ -75, ఎస్సీ -45, ఎస్టీ -37
అర్హత‌: జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 60శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 55 శాతం మార్కుల‌తో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీబీఎం లేదా సీఏ/ ఐసీడ‌బ్ల్యుఏ/ సీఎస్‌ లేదా కామ‌ర్స్‌/ సైన్స్‌/ ఎక‌నామిక్స్‌లో పీజీ ఉత్తీర్ణత‌. ప్రస్తుతం పీజీ చివ‌రి సంవ‌త్సరం కోర్సు చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే ఫ‌లితాలు జూన్‌ 30లోగా వెలువ‌డాలి. అలాగే డిగ్రీ లేదా పీజీలో ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ సంబంధిత విభాగంలో క‌నీసం ఒక పేప‌ర్ చ‌దివి ఉండాలి. లేనివాళ్లు కంప్యూట‌ర్ కోర్సులో క‌నీసం 3 నెల‌ల వ్యవ‌ధితో ఉండే స‌ర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
వ‌యోప‌రిమితి: ఏప్రిల్ 10, 2017 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి.
వేత‌న శ్రేణి: రూ. 23700-980/7-30560-1145/2-32850-1310/7-42020

పోస్టు: మేనేజ‌ర్‌
మొత్తం ఖాళీలు: 400
విభాగాల వారీ: జ‌న‌ర‌ల్‌-188, ఓబీసీ-111, ఎస్సీ-68, ఎస్టీ-33
అర్హత‌: డిగ్రీలో జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీబీఎం లేదా సీఏ/ ఐసీడ‌బ్ల్యుఏ/ సీఎస్‌ లేదా కామ‌ర్స్‌/ సైన్స్‌/ ఎక‌నామిక్స్‌లో పీజీ ఉత్తీర్ణత‌. ప్రస్తుతం పీజీ చివ‌రి సంవ‌త్సరం కోర్సు చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే ఫ‌లితాలు జూన్‌ 30లోగా వెలువ‌డాలి. అలాగే డిగ్రీ లేదా పీజీలో ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ సంబంధిత విభాగంలో క‌నీసం ఒక పేప‌ర్ చ‌దివి ఉండాలి. లేనివాళ్లు కంప్యూట‌ర్ కోర్సులో క‌నీసం 3 నెల‌ల వ్యవ‌ధితో ఉండే స‌ర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. మేనేజ‌ర్‌ ప‌ని అనుభ‌వం త‌ప్పనిస‌రి. ఏదైనా ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకు లేదా ప్రైవేటు బ్యాంకులో క‌నీసం రెండేళ్లు ప‌నిచేసి ఉండాలి.
వ‌యోప‌రిమితి: ఏప్రిల్ 10, 2017 నాటికి 23-35 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి.
వేత‌న శ్రేణి: రూ. 31705-1145/1- 32850-1310/10 – 45950

పై రెండు పోస్టుల‌కు ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం:
ఏ పోస్టుకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.

ప‌రీక్షలో:
ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం), ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ ఒక్కో విభాగం నుంచి 50 మార్కుల‌కు ప్రశ్నలు అడుగుతారు. మొత్తం ప‌రీక్షకు 150 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో పావు వంతు చొప్పున కోత విధిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో అర్హత సాధిస్తే స‌రిపోతుంది. అందులో సాధించిన మార్కుల‌ను తుది నియామ‌కానికి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

ఇంట‌ర్వ్యూకు అర్హత సాధించాలంటే...
ఇంగ్లిష్‌లో క‌నీస అర్హత మార్కులు సాధించి, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ రెండు పేప‌ర్లలోనూ క‌నీస క‌టాఫ్ మార్కులు పొందాలి. ఈ రెండు విభాగాల్లోనూ క‌లిపి అభ్యర్థి సాధించిన మార్కుల మెరిట్‌, ఆయా విభాగాల్లో ఖాళీల‌కు అనుగుణంగా ఇంట‌ర్వ్యూకు ఎంపిక చేస్తారు.

తుది నియామ‌కాలు:
ఆన్‌లైన్ టెస్టు మార్కులు (జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ + ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌), ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం తుదినియామ‌కాలు చేప‌డ‌తారు. ఆన్‌లైన్ టెస్టు, ఇంట‌ర్వ్యూల వెయిటేజీ 80: 20గా నిర్ణయించారు. ఒక‌వేళ ఆన్‌లైన్ టెస్టు నిర్వహించ‌కుండా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తే ముఖాముఖిలో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం తుదినియామ‌కాలు చేప‌డ‌తారు. ఇంట‌ర్వ్యూకు వంద మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 40 శాతం మిగిలిన‌వాళ్లు 35 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి.

ఆన్‌లైన్ ద‌రఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 5, 2017
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.వంద‌; జ‌న‌ర‌ల్‌, ఇత‌ర అభ్యర్థుల‌కు రూ.600
ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ తేదీలు: త‌ర్వాత ప్రక‌టిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌

Posted on 20-04-2017

BANK OF INDIA Info.

  • Notification
  • Apply Online
  • Website