నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ మ‌హ‌రాష్ట్రలో 500 పీవో ఉద్యోగాలు

* ఎంపికైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఏడాది పీజీ డిప్లొమా కోర్సు
* అనంత‌రం పీవోగా విధుల్లోకి
* ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల‌ ద్వారా నియామ‌కాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు పీవో పోస్టుల భ‌ర్తీకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా కోర్సుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ విధానం ద్వారా నెల రోజుల వ్యవ‌ధిలోనే యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద పీవోలు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 400 పీవోలు భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేశాయి. ఇదే త‌ర‌హాలో బ్యాంక్ ఆఫ్ మ‌హ‌రాష్ట్ర 500 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో) ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఆన్‌లైన్ ప‌రీక్ష ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. ఎంపికైన‌వారు ముందుగా ఏడాది వ్యవ‌ధి ఉండే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తిచేయాలి. అనంత‌రం పీవోగా విధుల్లో చేరుతారు.

మొత్తం ఖాళీలు: 500
విభాగాల‌వారీ ఇలా: ఎస్సీ-75, ఎస్టీ-37, ఓబీసీ-135, జ‌న‌ర‌ల్‌-253. వీటిలో 3 శాతం అంటే 15 ఖాళీల‌ను దివ్యాంగుల‌కు కేటాయించారు.
అర్హత: ఏదైనా జులై 1, 2016 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: క‌నిష్ఠంగా 18 ఏళ్లు, గ‌రిష్ఠంగా 28 ఏళ్లు. అంటే జులై 2, 1988 - జులై 1, 1998 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థుల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్‌ల‌ ద్వారా

ఆన్‌లైన్ ప‌రీక్ష స్వరూపం
రీజ‌నింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ ఇండ‌స్ట్రీకి ప్రాధాన్యం) విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 200 మార్కుల ప్రశ్నప‌త్రంలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

అర్హత సాధించాలంటే
ప్రతి విభాగం నుంచి క‌నీస క‌టాఫ్ మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి. ఈ క‌టాఫ్ మార్కుల‌ను ప‌రీక్ష రాసిన అభ్యర్థులంద‌రి జ‌వాబుల‌ను మూల్యాంక‌నం చేసిన త‌ర్వాత నిర్ణయిస్తారు. సెక్షన‌ల్ క‌టాఫ్‌ల‌తోపాటు ఆయా కేట‌గిరీల‌వారీ ఓవ‌రాల్ క‌టాఫ్ మార్కులు వ‌చ్చిన‌వారే త‌ర్వాత ద‌శ గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూకు అర్హత సాధిస్తారు. వాటిలోనూ ప్రతిభ చూపిన‌వారిని పీజీ డిప్లొమా కోర్సుకు ఎంపిక‌చేస్తారు.

కోర్సు...శిక్షణ‌
తుది అర్హత సాధించిన అభ్యర్థులు మ‌ణిపాల్ గ్లోబ‌ల్ లేదా ఎన్ఐఐటీ(నిట్‌) కేంద్రాల్లో ఏడాది వ్యవ‌ధి ఉండే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తిచేయాలి. 9 నెల‌లు విద్యాభ్యాసం, 3 నెల‌ల పాటు బ్యాంక్ ఆఫ్ మ‌హ‌రాష్ట్ర కార్యాల‌యాల్లో ఏదోఒక చోట‌ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంట‌ర్న్‌షిప్‌లో ఉన్నప్పుడు నెల‌కు రూ.20 వేలు చొప్పున చెల్లిస్తారు. కోర్సు నిమిత్తం ఫీజు రూపంలో అన్నీ క‌లుపుకుని (బోధ‌న‌, వ‌స‌తి, భోజ‌నం) రూ.3.5 ల‌క్షల వ‌ర‌కు చెల్లించాలి. ఈ మొత్తానికి మ‌హ‌రాష్ట్ర బ్యాంకు త‌క్కువ వ‌డ్డీకి రుణంగా మంజూరుచేస్తుంది. విధుల్లోకి చేరిన త‌ర్వాత నెల‌స‌రి వాయిదాల్లో 60 నెల‌ల్లో ఫీజు చెల్లించ‌వ‌చ్చు. కోర్సు మ‌ధ్యలో వైదొలిగితే వ‌డ్డీతో స‌హా ఫీజు మొత్తం + 2 ల‌క్షలు చెల్లించ‌డం త‌ప్పనిస‌రి. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసిన‌వారిని పీవోగా విధుల్లోకి తీసుకుంటారు.

వేత‌నాలు...నిబంధ‌న‌లు...
పీవోగా విధుల్లోకి చేరిన‌వారికి నెల‌కు రూ.23700 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. హెచ్ఆర్ఏ, డీఏ, ఇత‌ర అన్ని ర‌కాల ప్రోత్సాహ‌కాలూ క‌లుపుకుంటే నెల‌కు రూ.70 వేల వ‌ర‌కు వేత‌న రూపంలో పొంద‌వ‌చ్చు. ఒక్కో పీవోకు అన్ని ప్రయోజ‌నాలు క‌లుపుకుని ఏడాదికి 8.5 ల‌క్షల వ‌ర‌కు బ్యాంక్ ఆఫ్ మ‌హ‌రాష్ట్ర వెచ్చిస్తుంది. విధుల్లో చేరిన‌వాళ్లు క‌నీసం రెండేళ్లపాటు కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. ఇందుకోసం ఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాలి. గ‌డువులోగా వైదొలిగితే వ‌డ్డీతో స‌హా కోర్సు ఫీజు, స్టైపెండ్‌, శిక్షణ ఖ‌ర్చుల నిమిత్తం రూ.2 ల‌క్షలు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం: ఆగ‌స్టు 12
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 6
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు రూ. వంద‌; మిగిలిన అంద‌రికీ రూ.600
ప‌రీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైద‌రాబాద్‌లో మాత్రమే ప‌రీక్ష కేంద్రం ఉంది. భువ‌నేశ్వర్‌, ముంబై, నాగ్‌పూర్‌, పుణె, బెంగ‌ళూరు, చెన్నై తదిత‌ర చోట్ల ప‌రీక్ష రాసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: www.bankofmaharashtra.in

Posted on 10-08-2016

Bank of Maharashtra POs Info.

  • Notification
  • Website