చిన్న రైతులు సతమతం
దేశంలో వ్యవసాయ కమతాలు నానాటికీ చిక్కిపోతున్నాయి. సాగు రంగానికి ఆలంబనగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అన్ని విధాలుగా చితికిపోతున్నారు. వ్యవసాయాన్ని ఏకంగా బడాసంస్థల పాలుచేసే ప్రభుత్వ ప్రయత్నాలు వారిని మరింత కుంగదీసేవే. కష్టనష్టాల కడలిలో చిక్కిన చిన్న రైతులను ఒడ్డున పడేసేందుకు సర్కారు సమగ్ర చర్యలు చేపడితేనే ప్రణాళిక లక్ష్యాలను చేరుకోగలం.