లడక్ ఘటన నేర్పుతున్న పాఠాలు
లడక్‌లోకి 19 కిలోమీటర్ల మేరకు చొచ్చుకొని వచ్చిన చైనా, 20 రోజుల తరవాత వెనక్కి వెళ్లింది. అప్పటిదాకా పెరిగిన ఉద్రిక్తతలు దాంతో కొంత తగ్గాయి. ఆ వెంటనే దౌత్యపరమైన సంప్రతింపుల హడావుడి మొదలైంది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చైనాలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. అనుకొన్న ప్రకారమే ఆయన బీజింగ్ వెళ్లొచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లడక్‌లోకి చొరబడటానికిగల కారణాలపై తనకు ఇంకా స్పష్టత రాలేదని బీజింగ్‌నుంచి వచ్చాక ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఘటనపై చైనా నుంచి తాను ఎలాంటి వివరణా కోరలేదన్నారు.