'వెబ్'కు ఇరవై ఏళ్లు!
యుగయుగాలుగా, తరతరాలుగా 'మాయాబజార్' వంటి విచిత్ర లోకాల్లో 'ప్రియదర్శిని' వంటి పేటికలను వూహించుకుంటూ... మనకు ఇష్టమైన వాటన్నింటినీ లిప్తపాటులో దర్శించే అతీంద్రియాన్ని తెరలుతెరలుగా కలలుగన్న మనకు.. ఆ సాంకేతిక పరిజ్ఞానమేదో అనూహ్యంగా, అనాయాసంగా చేత చిక్కింది.. సరిగ్గా 20 ఏళ్ల క్రితం!
ఇప్పుడు చదువుల నుంచి చిరునామాల వరకూ.. పప్పూఉప్పూ నుంచి పెళ్లిళ్ల వరకూ.. వ్యాపారం నుంచి పరిశోధనల వరకూ... ఏ సేవ కావాలన్నా, ఏ సౌకర్యం కావాలన్నా కంప్యూటర్ ముందు కూర్చుని.. కళ్లు మూసుకుని www.అని టైప్ చేసేస్తున్నాం. మానవ జీవితాన్ని అన్ని రకాలుగా, అనూహ్యంగా ప్రభావితం చేసిన ఈ 'వరల్డ్ వైడ్ వెబ్' అందరికీ తేలికగా అందుబాటులోకి వచ్చింది 1993 ఏప్రిల్ 30న! కావటానికి ఈ పరిణామం చోటుచేసుకుని 2 దశాబ్దాలే అయ్యిందిగానీ..