ఆచరణ లేకుండా ఎన్ని ప్రణాళికలు అల్లినా ఉపయోగం సున్నా. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో రాష్ట్రం వెనకబాటుకు ఇదే కారణం. పవన విద్యుత్, సౌరశక్తి ఉపయోగంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే పురోగతి బాటపట్టినా రాష్ట్రం అడుగైనా ముందుకు వేయలేకపోతోంది. రాజకీయస్థాయిలో నిబద్ధత, పాలనపరమైన చిత్తశుద్ధి కొరవడటమే ఇందుకు కారణం. సౌరశక్తి ప్రోత్సాహానికి అవసరమైన వాతావరణ కల్పనలో రాష్ట్రసర్కారు విఫలమైంది. ఒకవైపు ఇంధన వనరులకు గిరాకీ పెరిగిపోతోంది.
|
|