District Co-operative Central Bank Ltd.

Staff Assistant/ Clerk - Assistant Manager Posts

డీసీసీబీలో పాగా!

తెలంగాణ రాష్ట్రంలో వివిధ సహకార కేంద్ర బ్యాంకుల్లోని క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. జిల్లాలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులను మాత్రమే అర్హులుగా ప్రకటించారు. వీటికెలా సంసిద్ధం కావాలో తెలుసుకుందాం!
క్లర్క్‌ లేదా అసిస్టెంట్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించినవారు లేదా 55% మార్కులు సాధించిన కామర్స్‌ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయవచ్చు.
అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు, అంగవైకల్యం ఉంటే 10 సంవత్సరాలు, అంగవైకల్యం కలిగిన ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, అంగవైకల్యం కలిగిన బీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.Read more

District Wise Notifications