Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దిల్లీ మెట్రో రైల్‌లో 3428 ఉద్యోగాలు
 

- ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో పోస్టులు భ‌ర్తీ
- డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ పూర్తయిన‌వారికి అవ‌కాశం!


వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి దిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (డీఎంఆర్‌సీఎల్‌) ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఇంజినీరింగ్‌, జ‌న‌ర‌ల్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హత‌ల‌తో ఈ పోస్టుల‌ను భ‌ర్తీచేస్తారు. పోస్టును బ‌ట్టి రాత ప‌రీక్ష, బృంద చ‌ర్చలు, ముఖాముఖి, సైకో టెస్టులు, వైద్య ప‌రీక్షల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. విభాగాల‌వారీ ఖాళీలు, అర్హత‌లు, ప‌రీక్షాంశాలు, ఎంపిక విధానం...త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకుందాం.

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివ‌రాలు

పోస్టు: స్టేష‌న్‌ కంట్రోల‌ర్‌/ ట్రెయిన్ ఆప‌రేట‌ర్‌
ఖాళీలు: 662
అర్హత‌: బీఎస్సీ (ఎంపీసీ) లేదా ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌లో మూడేళ్ల డిప్లొమా
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న శ్రేణి: రూ.13500-25520

పోస్టు: క‌స్టమ‌ర్ రిలేష‌న్స్ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు: 1100
అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. దీంతోపాటు క‌నీసం 6 వారాల వ్యవ‌ధితో ఏదైనా కంప్యూట‌ర్ అప్లికేష‌న్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న శ్రేణి: రూ.10170-18500

ఎంపిక విధానం: పై రెండు(స్టేష‌న్ కంట్రోల‌ర్‌/ ట్రెయిన్ ఆప‌రేట‌ర్‌, క‌స్టమ‌ర్ రిలేష‌న్స్ అసిస్టెంట్‌) పోస్టుల‌కు 4 ద‌శ‌ల్లో నిర్వహించే ప‌రీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా రాత‌ప‌రీక్ష( రెండు పేప‌ర్లు) అనంత‌రం సైకో టెస్టు (అర్హత సాధిస్తే స‌రిపోతుంది) త‌ర్వాత ఇంట‌ర్వ్యూ , మెడిక‌ల్ టెస్టులు ఉంటాయి.

పోస్టు: జూనియ‌ర్ ఇంజినీర్-ఎల‌క్ట్రిక‌ల్‌
మొత్తం ఖాళీలు: 48
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌లో మూడేళ్ల డిప్లొమా
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న‌శ్రేణి: రూ. 13500-25520

పోస్టు: జూనియ‌ర్ ఇంజినీర్-ఎల‌క్ట్రానిక్స్‌
మొత్తం ఖాళీలు: 81
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌లో ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్‌ అండ్ క‌మ్యూనికేష‌న్‌లో మూడేళ్ల డిప్లొమా
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న‌శ్రేణి: రూ. 13500-25520

పోస్టు: జూనియ‌ర్ ఇంజినీర్-మెకానిక‌ల్‌
మొత్తం ఖాళీలు: 10
అర్హత‌: మెకానిక‌ల్‌లో మూడేళ్ల డిప్లొమా
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న‌శ్రేణి: రూ. 13500-25520

పోస్టు: జూనియ‌ర్ ఇంజినీర్-సివిల్‌
మొత్తం ఖాళీలు: 66
అర్హ‌త‌: సివిల్‌లో మూడేళ్ల డిప్లొమా
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న‌శ్రేణి: రూ. 13500-25520

ఎంపిక విధానం: పైన తెలిపిన జూనియ‌ర్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, సివిల్‌) పోస్టుల‌కు ముందుగా రాత ప‌రీక్ష (రెండు పేప‌ర్లు) నిర్వహించి త‌ర్వాత ఇంట‌ర్వ్యూలు చేప‌డ‌తారు. అనంత‌రం మెడిక‌ల్ టెస్టులు ఉంటాయి.

పోస్టు: అకౌంట్ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు: 24
అర్హత‌: బీకాం
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న‌శ్రేణి: రూ. 10170-18500
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష (రెండు పేప‌ర్లు), మెడిక‌ల్ టెస్టుల ద్వారా. ఈ పోస్టుకు ఇంట‌ర్వ్యూ ఉండ‌దు.

పోస్టు: మెంట‌యిన‌ర్‌
మొత్తం ఖాళీలు: 1393 ఇందులో విభాగాల‌వారీ ఎల‌క్ట్రీషియ‌న్ 456, ఫిట్టర్ 243, ఎల‌క్ట్రానిక్ మెకానిక్ 602, రెఫ్రిజిరేట‌ర్ అండ్ ఏసీ మెకానిక్ 92 పోస్టులు ఉన్నాయి.
అర్హత‌: స‌ంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ)
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
వేత‌న‌శ్రేణి: రూ. 13500-25520
ఎంపిక విధానం: ఈ పోస్టుల‌కు రాత ప‌రీక్ష (ఒక పేప‌ర్ మాత్రమే ఉంటుంది), మెడిక‌ల్ టెస్టుల ద్వారా ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇంట‌ర్వ్యూ ఉండ‌దు.

ఎగ్జిక్యూటివ్ విభాగంలో...
ఈ విభాగంలో అసిస్టెంట్ మేనేజ‌ర్‌(ఎల‌క్ట్రిక‌ల్‌-14, ఎస్అండ్‌టీ-7, సివిల్-5) పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్‌లో క‌నీసం 60 శాతం మార్కులు పొంది, గేట్‌-2016లో అర్హత సాధించిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
అసిస్టెంట్ మేనేజ‌ర్ (ఆప‌రేష‌న్స్‌-5, హెచ్ఆర్‌-3, ఫైనాన్స్ -10) ఖాళీలు ఉన్నాయి. బీటెక్ లేదా ఎంబీఏలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించిన‌వాళ్లు ఆప‌రేష‌న్స్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. హెచ్ఆర్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల ఎంబీఏలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు హెచ్ఆర్ పోస్టుల‌కు అర్హులు. సీఏ లేదా ఐసీడ‌బ్ల్యుఏ పూర్తిచేసిన‌వాళ్లు ఫైనాన్స్ ఖాళీల‌కు పోటీప‌డొచ్చు.
పైన తెలిపిన ఎగ్జిక్యూటివ్ విభాగంలోని అన్ని పోస్టుల‌కు వేత‌న శ్రేణి రూ.20600-46500
వ‌యోప‌రిమితి: పై అన్ని పోస్టుల‌కూ జులై 1, 2016 నాటికి 18-28 ఏళ్లు అంటే జులై 2, 1988 కంటే ముందు జులై 1, 1998 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
ఎంపిక విధానం: పైన తెలిపిన ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను రాత ప‌రీక్ష( రెండు పేప‌ర్లు), బృంద చ‌ర్చలు, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ప‌రీక్ష ద్వారా భ‌ర్తీ చేస్తారు.

ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌న్నింటికీ ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ప‌రీక్షలో...
పేప‌ర్‌-1 ఇలా...
ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, లాజిక‌ల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల‌తోపాటు ఆ విభాగం లేదా ట్రేడ్‌కు సంబంధించిన అంశాల్లో ప్రశ్నలు వ‌స్తాయి. మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 90 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. త‌ప్పు స‌మాధానాల‌కు మూడో వంతు మార్కులు త‌గ్గిస్తారు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్రశ్నలు అడుగుతారు.

పేప‌ర్‌-2...
ఒక్క మెంట‌యిన‌ర్ పోస్టుల‌కు త‌ప్ప మిగిలిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ పేప‌ర్ ఉంటుంది. అభ్యర్థి ఆంగ్ల ప్రావీణ్యాన్ని ప‌రిశీలించ‌డానికి ఇంగ్లిష్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 45 నిమిషాల వ్యవ‌ధిలో పూర్తిచేయాలి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ మార్కులో మూడో వంతు కోత విధిస్తారు.

ప‌రీక్షలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉండ‌వ‌చ్చు. పేప‌ర్‌-1, పేప‌ర్‌-2ల‌కు విడిగా అర్హత సాధించాలి. వీటిలో ఎంపికైన‌వారికి పోస్టును బ‌ట్టి త‌ర్వాత ద‌శ ప‌రీక్షలు (బృంద చ‌ర్చలు, సైకో టెస్టు, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టు) నిర్వహిస్తారు.

ఎంపికైతే:
రెండేళ్లు ప్రొబేష‌న్‌లో కొన‌సాగుతారు. ఈ వ్యవ‌ధిలో నిర్వహించే ప‌రీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉద్యోగంలో కొన‌సాగ‌నిస్తారు. క‌నీసం మూడేళ్లపాటు ప‌నిచేయ‌డం త‌ప్పనిస‌రి. ఇందుకోసం ముందుగానే ఒప్పంద ప‌త్రం స‌మ‌ర్పించాలి. పోస్టును బ‌ట్టి రూ.1,50,000 లేదా రూ.75,000 హామీగా చెల్లించాలి. దీంతోపాటు శిక్షణ ఖ‌ర్చుల నిమిత్తం పోస్టును బ‌ట్టి రూ.29,000 లేదా రూ.20 వేలు జ‌మ‌చేయాలి. గ‌డువులోగా వైదొలిగితే ఈ డ‌బ్బులు తిరిగి చెల్లించ‌రు. ఉద్యోగంలో చేరిన‌వారికి వేత‌నంతోపాటు ప‌లు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి.

నోటిఫికేష‌న్ వివ‌రాలు...
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 15
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.150. మిగిలిన అంద‌రికీ రూ.400

వెబ్‌సైట్‌: www.delhimetrorail.com/career.aspx

నోటిఫికేష‌న్‌

posted on 16-09-2016