23న పేమెంట్ సీˆట్ల స్పాట్ కౌన్సెలింగ్‌
రాజేంద్రనగర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించిన బీఎసీˆ్స అగ్రికల్చర్, బీఎసీˆ్స హార్టీకల్చర్‌ డిగ్రీ కోర్సులలో పేమెంట్ కోటా స్పాట్ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 23న నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని హాజరుకావాలని తెలిపారు. సీటు పొందిన వెంటనే రూ.36,450 డీడీతో చెల్లించాల్సి ఉటుందని వివరించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ twww.pjtsau.edu.in చూడవచ్చని ఆయన తెలిపారు.

తెలుగువర్సిటీ ప్రత్యేక విభాగాల్లో కౌన్సెలింగ్‌ 21న
నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019-20 విద్యా సంవత్సరానికి ప్రత్యేక విభాగాల్లో సీట్ల భర్తీకి సెప్టెంబరు 21న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, క్రీడలు(ఒక సీటు), దివ్యాంగ (ఒక సీటు) సీట్ల భర్తీ చేయనున్నట్లు కన్వీనర్‌ డా.కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని మొదటి అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అర్హులు ఉదయం 11 గంటల్లోపే హాజరుకావాలని కోరారు. వివిధ ప్రాంగణాల్లో బీఎఫ్‌ఏ, ఇతర పీజీ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు ఆగస్టులో ఇప్పటికే పూర్తి చేశారు.

నవోదయ ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు
గచ్చిబౌలి, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని జవహర్‌ నవోదయ విద్యాలయ పిన్సిపల్‌ ఆర్‌.డెనియల్‌ రత్నకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో సెప్టెంబరు 15 వరకు గడువు ఉండగా నెలాఖరు వరకు పొడిగించినట్లు వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రవేశ పరీక్షను జనవరి 11న నిర్వహించనున్నారు.

ఉచిత శిక్షణ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఉట్నూరు, న్యూస్‌టుడే : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకుల కోసం ఐటీడీఏ ద్వారా జీఎన్‌ఎం, డీఎంఎల్టీ, డిప్లొమా ఇన్‌ ఆప్తమిలిక్‌ టెక్నిషీయన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీఓ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌ బైపీసీ ద్వారా ఉత్తీర్ణులై ఉండాలి. 16 ఆపైన వయసు కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 21న సాయంత్రం 5 గంటల్లోపు ఉట్నూరులోని ఐటీడీఏ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, ఏటీడీఓ కార్యాలయాల్లో పూర్తిస్థాయి విద్యార్హత, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌సైజ్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం సెప్టెంబరు 29న మధ్యాహ్నం 2 గంటలకు రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు

దూరవిద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
గోల్నాక, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెంటర్‌ సమన్వయకర్త జె.వెంకటచలపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 94916 34518 నంబరులో సంప్రదించాలన్నారు.

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు
జూబ్లీహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును సెప్టెంబరు 20 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. డిగ్రీలో బీఏ/బీకాం/బీఎస్సీలతోపాటు పీజీలో ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు తదితర వివరాలను www.braouonline.in లో పరిశీలించాలన్నారు. మరిన్ని వివరాలకు 73829 29570 నెంబరులో సంప్రదింలన్నారు.

డిప్లొమా కోర్సులకు 9న స్పాట్ కౌన్సెలింగ్‌
రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులకు సెప్టెంబరు 9న స్పాట్ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు. పూర్తిస్థాయి సీట్ల భర్తీకై నాలుగు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించామని, మిగిలిన సీట్ల భర్తీకోసం స్పాట్ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వైబ్‌సైట్ చూడొచ్చని తెలిపారు. ప్రైవేటు పాలిటెక్నిక్‌లో మాత్రమే కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా హాజరుకావచ్చని పేర్కొన్నారు. సీటు పొందిన వెంటనే రూ.16,600 రుసుము చెల్లించాలన్నారు. సీట్ల కేటాయింపు పదోతరగతి గ్రేడ్‌పాయింట్ సగటు మెరిట్పై, రిజర్వేషన్ల నియమానుసారం ఉంటుందని తెలిపారు.
www.pjtsau.edu.in

నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని విస్తరణ విద్యాసంస్థ(ఈఈఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగ, యువతకు అగ్రికల్చర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌పై నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఈఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 24 నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. శిక్షణకోసం నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఇంటర్‌ బైపీసీ, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ డిప్ల్లొమా ఉత్తీర్ణులైన తెలంగాణ విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని వివరించారు. ఎంపికైన వారికి ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల వారు ఈఈఐ వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆఆఐహెచ్‌వైడీ.ఓఆర్‌జీ’ నుంచి దరఖాస్తు పత్రం తీసుకొని పోస్ట్‌ద్వారా లేదా ఈమెయిల్‌ ద్వారా గానీ పంపించవచ్చని సూచించారు. వివరాలకు 76809 37649 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫథకానికి దరఖాస్తుల ఆహ్వానం
అర్బన్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక వర్గాలవారు విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం స్ప్రింగ్‌ సీజన్‌ 2019కి గాను (జనవరి 2019 నుంచి జులై 2019 వరకు ప్రవేశం తీసుకున్న విద్యార్థులు) ముఖ్యమంత్రి ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫథకానికి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, డాక్టోరల్‌ స్టడీస్‌ విదేశాల్లో చదువుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు పత్రాలను జిల్లా మైనారిటీ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తులు సెప్టెంబరు 27 సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలన్నారు. ఎంపికైన వారికి ఉపకారవేతనం కింద రూ.20 లక్షల ఆర్థిక సహాయం రెండు విడతల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. విమాన ప్రయాణ చార్జీలకు రూ.60వేలు మించకుండా అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు అర్బన్‌ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిని సంప్రదించాలన్నారు.

27, 28న పీహెచ్‌డీ, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌
కాటేదాన్‌, న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డా.ఎస్‌.సుధీర్‌కుమార్‌ పేర్కొన్నారు. 27న పీహెచ్‌డీ, 28న పీజీ కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. సంబందిత మెరిట్‌ లిస్ట్‌ను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌ తేదీల్లో విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో హాజరుకావాలని సూచించారు.
https://pjtsau.edu.in/

అక్టోబరు 16 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ ప్రాంతంలోని 1 ఈఎంఈ సెంటర్‌లో యునిట్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోటా కింద అక్టోబరు 16 నుంచి నవంబరు 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమర వీర సైనికులు, మాజీ సైనికుద్యోగులు, సైనికుద్యోగుల పిల్లల కోసం ఈ ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. సోల్జర్‌ టెక్నీషియన్‌, సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మేన్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని, స్టాండర్డ్‌(హౌజ్‌కీపర్‌) పోస్టులకు 8వ తరగతిలో ఉత్తీర్ణులైనవారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో బొల్లారం, 1ఈఎంఈ సెంటర్‌, 1 ట్రేనింగ్‌ బెటాలియన్‌లోని మిల్కాసింగ్‌ స్టేడియానికి రావాలని వారు సూచించారు.

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్‌: నాంపల్లిలోని ప్రభుత్వ మహబూబియా జూనియర్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆగస్టు 21వ తేదీలోపు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఇ.సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. పొలిటికల్‌ సైన్స్‌, కామర్స్‌, బోటనీ, హిస్టరీ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు అర్హులు. ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ వారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారై ఉండాలని పేర్కొన్నారు.

కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ
అమీర్‌పేట, న్యూస్‌టుడే: అమీర్‌పేట కమ్మసంఘం ఆధ్వర్యంలోని ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌ ద్వారా బేసిక్‌ కంప్యూటర్స్‌లో ఉచితంగా శిక్షణ తరగతులను ఆగ‌స్టు 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కమ్మసంఘం కార్యదర్శి చలసాని శాయాజీరావు, ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ కిలారు రామారావు తెలిపారు. 26వ తేదీలోపు కమ్మసంఘం కార్యాలయంలో లేదా 91776 67891, 040-23730265 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

సెల్ట్‌లో ఇంగ్ల్లిష్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్ల్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌(సెల్ట్‌)లో రెండు నెలల వ్యవధి గల ఇంగ్ల్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అండ్‌ పర్సనాలటీ డెవలప్‌మెంట్‌ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆగ‌స్టు 13 నుంచి ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులను నిర్వహించనున్నట్లు సంచాలకులు డా.సావిత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9652856107, 7416575575 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఇన్‌స్పైర్‌ అవార్డులకు దరఖాస్తుల గడువు పెంపు
* ఆగస్టు 31వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్పైర్‌ అవార్డులు-మానక్‌ కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించినట్లు హైదరాబాద్‌ జిల్లా సైన్స్‌ అధికారి జి.ప్రభాకర్‌ తెలిపారు. ఏటా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్‌ అవార్డుల కోసం పాఠశాల స్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంటారు. ఇందుకు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుండగా.. మరో నెల పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికైన విద్యార్థుల నమూనాల తయారీకి అవసరమైన నిధులు ప్రభుత్వమే అందిస్తుంది. ఇందుకు విద్యార్థులు బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతున్న దరిమిలా గడువు పొడిగించాలని శాస్త్ర సాంకేతిక శాఖ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌ జిల్లా పరిధి నుంచి 905 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఓయూ దూరవిద్య ప్రవేశాలకు రంగం సిద్ధం
* 15 నుంచి దరఖాస్తుల ఆహ్వానం
* ఈసారి కొత్తగా మూడు కోర్సులు
ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ దూరవిద్య ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. జులై 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున ఉస్మానియా ఉపకులపతి ప్రొ.రామచంద్రం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అప్పట్నుంచి అక్టోబరు 31వరకు వివిధ కోర్సులకు దరఖాస్తులు స్వీకరించి.. ఆ తర్వాత నుంచి తరగతులు నిర్వహించనున్నారు. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లో తీసుకోనున్నారు. అభ్యర్థులు నిర్దేశిత తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ దూరవిద్య కేంద్రం సంచాలకులు ప్రొ.చింతా గణేష్‌ తెలిపారు. కోర్సుల వివరాలు, కాల పరిమితి, ఫీజు వివరాలనూ అందులో తెలుసుకోవచ్చని వివరించారు. వాస్తవానికి కాగితరహిత పాలనలో భాగంగా రెండేళ్ల నుంచి దూరవిద్య విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకుంటున్నారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌, కోర్సు, పరీక్షల ఫీజు చెల్లింపులు సైతం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. అలాగే యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీ పరిధిలోని అభ్యర్థుల నుంచే దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర పరిధి దాటకుండా కూడా దరఖాస్తులు తీసుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ పరిధిలోని జిల్లాల అభ్యర్థులకు ఎక్కువగా అవకాశం దక్కనుంది.
ఈ కోర్సులకు బయట ఉద్యోగావకాశాలు ఉండటంతో..
ఈ ఏడాది నుంచి దూరవిద్య విధానంలో మరో మూడు కోర్సులను ఉస్మానియా వర్సిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బీకామ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ డాటా సైన్స్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థుల నుంచి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వీటిని మొదలుపెట్టింది. ఈ కోర్సులకు బయట ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఎంఏ కోర్సు రెండేళ్లు, బీకాం మూడేళ్లు, డిప్లొమా కోర్సు ఏడాది వ్యవధితో ఉండనున్నాయి.
బీఈడీకి ఆదరణ
దూరవిద్య కింద ఉస్మానియా వర్సిటీ ఈ ఏడాది బీఈడీ కోర్సు అందిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రవేశాలు పూర్తయ్యాయి. జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నుంచి 500 సీట్లతో కోర్సు ప్రారంభించేందుకు అనుమతి రావడంతో దీన్ని తీసుకువచ్చింది. ఎడ్‌సెట్‌తో సంబంధం లేకుండా వర్సిటీ తరఫున ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి భర్తీ చేపట్టగా సీట్లన్నీ నిండిపోయాయి.
అందిస్తున్న కోర్సుల వివరాలు..
యూజీ, పీజీతోపాటు అయిదు రకాల డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సులను వర్సిటీ అందిస్తోంది. ఎంబీఏ(రెండేళ్లు), ఎంసీఏ(మూడేళ్లు), ఎంఏ(ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, ఎకానమిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సైకాలజీ), ఎంకాం, ఎంఎస్సీ(గణితం, స్టాటిస్టిక్స్‌), బీఏ(గణితం, స్టాటిస్టిక్స్‌), బీకాం(జనరల్‌), బీబీఏ, పీజీ డిప్లొమా(గణితం, ఆంగ్ల భాష బోధన, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌).

ఇఫ్లూలో ‘ఈడబ్ల్యూఎస్‌’ కోటా
* ఈ ఏడాది నుంచే పది శాతం అమలు
* వచ్చే సంవత్సరం నుంచి మరో 5 శాతం పెంపు
ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక కోటా అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు ప్రత్యేకంగా కొన్ని సీట్లు దక్కనున్నాయి. కేవలం హైదరాబాద్‌ క్యాంపస్‌కే పరిమితం కాకుండా దేశంలోని మరో రెండు క్యాంపస్‌లలోనూ ఈ కోటాను అమలు చేయాలని వర్సిటీ నిర్ణయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఇఫ్లూ కొనసాగుతోంది. ఆంగ్లంతోపాటు అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కొరియన్‌, పర్షియన్‌, రష్యన్‌, స్పానిష్‌ వంటి విదేశీ భాషలకు సంబంధించిన కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వర్సిటీ పరిధిలో హైదరాబాద్‌తోపాటు షిల్లాంగ్‌, లక్నో క్యాంపస్‌లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది బీఏ కోర్సులు, 14 ఎంఏ కోర్సులు, మూడు ఉపాధ్యాయ విద్య కార్యక్రమాలు, 15 పీహెచ్‌డీ కార్యక్రమాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1400 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మన దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలతోపాటు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అలాగే ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి వేర్వేరు దేశాలకు చెందిన భాషలను అభ్యసించడం, పరిశోధనలు చేయడం చేస్తుంటారు. వర్సిటీ పరిధిలో అన్ని క్యాంపస్‌లలో కలిపి 880 సీట్లు అందుబాటులో ఉండగా 824 సీట్లు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. 626 మాత్రమే భర్తీ జరిగాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 55 సీట్లు భర్తీ చేసేందుకు ప్రతిపాదించారు. విద్యార్థుల అర్హతల ఆధారంగా కేవలం 36 మందికే అవకాశం దక్కింది. పేద విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రవేశాలు దక్కడంతోపాటు ఫీజు రాయితీ లభించనుంది. హైదరాబాద్‌ క్యాంపస్‌కు వచ్చేసరికి అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) 153 సీట్లు భర్తీకి నిర్ణయించగా 125 సీట్లు భర్తీ అయ్యాయి. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం(టీటీపీ) కింద 109 సీట్లు భర్తీ చేయాలనుకున్నారు. 90 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక పీజీ కోర్సుల్లో 322 సీట్లు నింపాలనుకోగా 283 సీట్లు నిండాయి. మిగిలిన సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.
మిగిలిన సీట్లు వచ్చే ఏడాదే..!
ఈ ఏడాది 824 సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించినా.. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపలేకపోయారు. చివరికి 626 సీట్లు మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇప్పుడు మిగిలిన సీట్లను వచ్చే ఏడాది కోటాలో కలిపి భర్తీ చేస్తారు. దీనివల్ల వచ్చే ఏడాది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం.. - ప్రొ.సురేష్‌కుమార్‌, ఉపకులపతి, ఇఫ్లూ
కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం ఈ ఏడాది నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా పది శాతం అమలు చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి మరో అయిదు శాతం పెంచి అమలు చేస్తాం. దీనివల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేందుకు అవకాశం దక్కనుంది. ఇప్పటికే దీనిపై వర్సిటీ తరఫున నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల్లో భాషపరమైన జ్ఞానం పెంచడంతోపాటు నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ బోధన కొనసాగిస్తున్నాం.

ఐటీఐల్లో ప్రవేశాలకు 19వరకు గడువు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2019-20 విద్యాసంవత్సరానికి గానూ మొదటి, రెండో విడతల్లో మిగిలి ఉన్న సీట్లను మూడో విడతలో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును సెప్టెంబరు 19 వరకు పొడిగించినట్లు ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో సెప్టెంబరు 20న అన్ని ప్రభుత్వ ఐటీఐల్లో హాజరు కావాలని కోరారు.

19న రెహానా ఐటీఐలో జాబ్‌మేళా
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్, రిలయన్స్‌ ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో సెప్టెంబరు 19న ఖమ్మంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం ప్రతినిధి సీహెచ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మం నగరం పాండురంగాపురంలలోని రెహానా ఐటీఐలో ఉదయం 10గంటలకు మేళా ప్రారంభమవుతుంది. ఐటీఐలో ఏదైనా ట్రేడ్‌ ఉత్తీర్ణులైన వారు, 18నుంచి 25సంవత్సరాల లోపు వారు అరు।లు. అభ్యర్థులు రెండు ఫోటోలు, పదోతరగతి, ఐటీఐ పాస్‌ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరు కావాలని కోరారు.

సార్వత్రిక పది, ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: అక్టోబరులో నిర్వహించనున్న సార్వత్రిక పది, ఇంటర్‌ థియరీ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు తత్కాల్‌ పద్ధతిపై సెప్టెంబరు 18 నుంచి 24 వరకు సంబంధిత ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో సంప్రదించి చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.మదన్‌మోహన్‌ ఒక ప్రకటనలో కోరారు.

సార్వత్రిక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 20 తుది గడువు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు సెప్టెంబరు 20 తుది గడువని ఖమ్మం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఉప సంచాలకుడు డాక్టర్‌ డి.సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ తృతీయ సంవత్సరం ఫీజులు చెల్లించేందుకు కూడా ఇదే ఆఖరు తేదీగా ప్రకటించారు. డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందే అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి దరఖాస్తుకు సర్టిఫికెట్‌ కాపీ జతపరిచి సెప్టెంబరు 20వ తేదీ లోగా అందజేయాలని కోరారు.

కేయూ దూరవిద్య ప్రవేశాలకు 21 తుది గడువు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ద్వారా ఖమ్మం పీజీ సెంటర్‌లో బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబరు 21వ తేదీ తుదిగడువుగా నిర్ణయించినట్లు అధ్యయన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ టి.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 22 నుంచి 27 వరకు రూ.100 అపరాధ రుసుము చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ఖమ్మంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని గోపి సూచించారు.

ప్రతిభ ఆధారంగా బీఈడీ విద్యార్థుల ఎంపిక
భద్రాచలం అంబేడ్కర్‌ సెంటర్, న్యూస్‌టుడే: భద్రాచలం బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు రెండు రాష్ట్రాల్లో ఉన్న గిరిజన విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పీవో ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో డిగ్రీ మెరిట్‌ ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సెప్టెంబరు 18న కౌన్సెలింగ్‌కు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. www.itdabcm.com వెబ్‌సైట్‌లో పొందుపరిచారని అన్నారు. చరవాణి ద్వారా సమాచారం అందిన అభ్యర్థులు తమ అసలు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు.

ఐటీఐలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2019-20 విద్యాసంవత్సరానికి గానూ మొదటి, రెండో విడతల్లో మిగిలి ఉన్న సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ ఎం.ప్రభాకర్‌రెడ్డి సెప్టెంబరు 5న తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబరు 6వతేదీ నుంచి 16వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో సెప్టెంబరు 16, 17న‌ జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని కోరారు.

8న ఎన్‌డీఏ ప్రవేశ పరీక్ష మెలకువలపై ప్రత్యేక శిక్షణ
శామీర్‌పేట: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు కీన్‌ స్కూల్‌ ఫర్‌ సైనిక్, గ్రేటర్‌ బీఈడీ కళాశాల, ప్రతిభాన్వేషణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 8న ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కీన్‌ స్కూల్‌ ఫర్‌ సైనిక్‌ ప్రిన్సిపల్‌ కల్యాణి తెలిపారు. నవంబరు 17న యూపీఎస్సీ నిర్వహిస్తున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ/నాన్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలపై ముందస్తుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఫిజికల్‌ పరీక్షలో పాటించాల్సిన జాగ్రత్తలపై యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఉస్మానియా, కన్వీనర్‌ టీఎస్‌పి సెట్‌పై ఆచార్య వి.సత్యనారాయణ, ఫిజికల్‌ ట్రైనర్‌ మహేశ్‌ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు వివరించనున్నారని ప్రతిభాన్వేషణ సమితి కన్వీనర్‌ జేకబ్‌ తెలిపారు. పేర్లు నమోదు చేసుకునేందుకు 90322 52521, 040-27132813 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

ఎంఎల్‌టీ అభ్యర్థులకు ప్రభుత్వాసుపత్రిలో శిక్షణ
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఎంఎల్‌టీ వృత్తి విద్యాకోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంవత్సరం పాటు క్లినికల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కె.రవిబాబు సెప్టెంబరు 4న తెలిపారు. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థులు మాత్రమే రూ.1000 ఆసుపత్రి వారి పేరు మీద డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసుకోని, ఎంపిక కాని వారు కూడా తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థినీ, విద్యార్థులు తమ బయోడేటా ఫారంతో పాటు రూ.10ల పోస్టల్‌ స్టాంపు అతికించిన సొంత చిరునామా గల కవరును జతపర్చాలి. అదే విధంగా సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను కూడా జతపరిచి జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయం, నయాబజారు, ఖమ్మం అనే చిరునామాకు సెప్టెంబరు 12వ తేదీ సాయంత్రం 5గంటల లోగా అందజేయాలని రవిబాబు కోరారు.

31న కేజీబీవీ సీఆర్టీల ధ్రువపత్రాల పరిశీలన
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాత ఖమ్మం జిల్లా(ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలు)లోని కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో సీఆర్‌టీ, పీజీ సీఆర్‌టీ, పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 31న ఉదయం 10గంటలకు ఖమ్మంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్‌మోహన్‌ తెలిపారు. గత సంవత్సరం 2018లో కేజీబీవీ రాత పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈవిద్యాసంవత్సరం 2019-20లో తాత్కాలిక ప్రాతిపదికన దినసరి వేతనంపై పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితా డీఈవో వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఓ పాస్‌ఫోటోతో పాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాల నకళ్లతో డీఈవో కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. హాజరు కాని అభ్యర్థులు తదుపరి అభ్యర్థుల అర్హతలను నిబంధనలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని మదన్‌మోహన్‌ తెలిపారు.

20న జిల్లాస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆగస్టు 20న పాల్వంచలోని ఆశ్రమ ఉన్నతపాఠశాలలో 27వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘పరిశుభ్రత, హరిత మరియు ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర సాంకేతిక నూతన అవిష్కరణలు’ అనే అంశంపై ప్రతి పాఠశాల నుంచి అయిదు ఉప అంశాల్లో ఒక ప్రాజెక్టునైనా తప్పనిసరిగా రూపొందించి ప్రదర్శన చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారు ఆగస్టు 19లోపు వారి ప్రాజెక్టులను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని, ప్రాజెక్టులో సందేహాలు ఉంటే జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్త సంపత్‌ 9010043945, జిల్లా సైన్స్‌ అధికారి చలపతిరాజును 7036399033 చరవాణుల్లో సంప్రదించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.
నిబంధనలు:
* ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు, గ్రూపు లీడర్‌ మాత్రమే పాల్గొనాలి.
* ప్రాజెక్టు రిపోర్టు రెండు కాపీలు, లాగ్‌బుక్‌, నాలుగు ఛార్ట్‌లు, గ్రూప్‌ లీడర్‌ రెండు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుంది.
* 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలబాలికలు పాల్గొనవచ్ఛు
* ప్రతిగ్రూప్‌లో లీడర్‌తో కలుపుకొని ఇద్దరు విద్యార్థులు ఉండాలి
* జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనల్లో గ్రూప్‌ లీడర్‌ మాత్రమే పాల్గొనాలి
* ప్రాజెక్టు ప్రదర్శనకు 8నిమిషాల సమయం కేటాయిస్తారు.

దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ ప్రతిభా ఉపకారవేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 7వ తరగతిలో 55శాతం మార్కులను సాధించి, ప్రస్తుతం 8వతరగతి చదువుతూ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.5లక్షల్లోపు ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్ష రుసుము జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్‌సీ విద్యార్థులు రూ.50 ఆన్‌లైన్‌లో చెల్లించాలని, ఆగస్టు 29లోగా కుల, ఆదాయ, పీహెచ్‌సీ ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. సందేహాల నివృత్తికి జిల్లా ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

దూర విద్య డిగ్రీ ప్రవేశ పరీక్ష వాయిదా
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని దూరవిద్య(ఎస్‌డీఎల్‌సీ) బీఏ, బీకాంలో ప్రవేశానికి ఆగస్టు 4వతేదీన నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష 11వతేదీకి వాయిదా వేసినట్లు ఖమ్మం పీజీ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌.గోపి ఆగస్టు 2న తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేని వారు, పదో తరగతిచ ఇంటర్‌ పాస్‌ లేదా ఫెయిలైన విద్యార్థుల కోసం ఈపరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష తేదీ మార్పును విద్యార్థులు గమనించాలని గోపి కోరారు.

దరఖాస్తు గడువు పెంపు
మహిళా విశ్వవిద్యాలయం(తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో పలు కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువును పెంచినట్లు కేంద్రం కో-ఆర్డినేటర్‌ ఆచార్య సంత్రాణి పేర్కొన్నారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 14లోపు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇగ్నో వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇగ్నో కేంద్రంలో దరఖాస్తులు ఫారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 14లోపు పోస్టు ద్వారా లేదా నేరుగా కానీ వర్సిటీ ఇగ్నో కార్యాలయానికి చేరవేయాలని కోరారు. ఇతర వివరాలకు ఇగ్నో వెబ్‌సైట్‌ లేదా చరవాణి సంఖ్య 0877 2284593లో సంప్రదించాలని తెలిపారు.

ఉచిత శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం ద్వారా మూడు నెలల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్‌ మూలి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
* కోర్సులు...
1.అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌- 3నెలల కోర్సు- పదోతరగతి ఉత్తీర్ణత
2. డొమెస్టిక్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌- 3నెలల కోర్సు- పదో తరగతి ఉత్తీర్ణత
3. మెటల్‌ ఆర్క్‌ వెల్డింగ్, గ్యాస్‌ వెల్డింగ్‌- 3నెలలు- పదో తరగతి ఉత్తీర్ణత
ఈ కోర్సుల్లో శిక్షణ పొందిన అనంతరం ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ అందజేయబడుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 10వతేదీ లోగా ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐలో అందజేయాలని ప్రభాకర్‌రెడ్డి కోరారు.

నవోదయ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో చేరగోరే విద్యార్థుల కోసం వచ్చే 2020 జనవరి 11వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్‌మోహన్‌ జులై 31న ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబరు 9వ తేదీలోగా సంబంధిత వెబ్‌సైట్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు
* 3, 4, 5 తరగతులు ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ 2019-20 విద్యాసంవత్సరంలో 5వ తరగతి అవిభాజ్య ఖమ్మం జిల్లాలో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు.
* 2019-20 విద్యాసంవత్సరంలో 5వ తరగతి ఎన్‌ఐవోఎస్‌ బి - సర్టిఫికెట్‌ కోర్సులో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
* అభ్యర్థులు 1.5.2017కు ముందుగానీ 30.4.2011 తర్వాత గానీ జన్మించి ఉండరాదు.
* ఎట్టి పరిస్థితిల్లో ఒక అభ్యర్థి ప్రవేశపరీక్షకు రెండోసారి హాజరు కాకూడదు.
మార్గదర్శకాలు
* ఆన్‌లైన్‌ పరిచయ పత్రం (ప్రాస్‌పెక్టస్‌)ను క్షుణ్ణంగా చదవాలి.
* అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* రిజర్వేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరిస్తారు.
* దరఖాస్తు ఫారంలో గుర్తింపు చిహ్నాలను స్పష్టంగా నింపాలి
* పుట్టిన తేదీ అంకెలలోను, అక్షరాలలోనూ నింపాలి
* అభ్యర్థి తండ్రి/సంరక్షకుని సంతకాన్ని, ప్రధానోపాధ్యాయుని ధ్రువీకరణను, ఫొటోను తప్పనిసరిగా ఆన్‌లైన్‌ దరఖాస్తులో పొందుపరచాలి. ఈ అనుబంధాలను ‘జేపీజీ ఫార్మెట్‌ 10-100కేబీ’లో మాత్రమే అని లోడ్‌ చేయాలి.
రిజర్వేషన్‌
* గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75శాతం సీట్లు
* బాలికలకు 1/3వ వంతు
* దివ్యాంగులకు 3శాతం
* షెడ్యూలు కులాల వారికి, షెడ్యూలు తెగల వారికి భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ ఉంది.

26 నుంచి సార్వత్రిక డిగ్రీ పరీక్షలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సంవత్సరం (ద్వితీయ సెమిస్టర్‌) పరీక్షలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఉపసంచాలకులు డాక్టర్‌.ఏ.రమాదేవి తెలిపారు. ప్రతి రోజూ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు13వ తేదీలోగా విద్యార్థులు టీఎస్‌/ ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. ఇతర వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

3న నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలను నవంబరు 3న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్మోహన్ జులై 30న తెలిపారు. మొదటి స్థాయి పరీక్షకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. 2019-20 విద్యాసంవత్సరంలో పదో తరగతి రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. గతంలో ఎన్ఎంఎంఎస్కు ఎంపికైనవారు, ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. ఈపరీక్ష రెండు విడతల్లో నవంబరు 3 ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30గంటల నుంచి 3.30గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష రాయాలనుకుంటున్న విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాల వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

25నుంచి ఐటీఐ ప్రవేశాలకు రెండో విడత దరఖాస్తులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2019-20 విద్యాసంవత్సరానికి మొదటి విడతలో మిగిలి ఉన్న సీట్ల కోసం రెండో విడతలో జులై 25 నుంచి ఆగస్టు 14లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌/కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 10/ 8వతరగతి ఉత్తీర్ణులై ఆగస్టు 1, 2019 నాటికి± 14ఏళ్లు నిండిన వారు అర్హులు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో ఆగస్టు 13 నుంచి 16 లోపు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు.

సార్వత్రిక డిగ్రీ పరీక్షల ఫీజు తుదిగడువు 13
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజును అగస్టు 13 లోగా చెల్లించాలని ఖమ్మం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఉపసంచాలకురాలు డాక్టర్.ఏ.రమాదేవి తెలిపారు. పరీక్ష ఫీజులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి, ఇతర వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

టెక్నికల్‌ టీటీసీ ఫలితాల విడుదల
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 2019న నిర్వహించిన టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్‌ లోయర్‌ పరీక్షల ఫలితాలు వెలువడినట్లు డీఈవో పి.సరోజనిదేవి తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను ్ర్ర్ర.్జ(’.్మ’ః్చ-్ణ్చ-్చ.్ణ్న్ర.i- వెబ్‌సైట్‌లో రోల్‌నెంబర్, ట్రేడ్‌ నమోదు చేసి పరీక్ష ఫలితాలు పొందాలని కోరారు.

బీఆర్‌ఏఓయూ ప్రవేశాల గడువు 30 వరకు పొడిగింపు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ) డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ విశ్వవిద్యాలయం ఉమ్మడి జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ డా.బి.ధర్మానాయక్‌ తెలిపారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ తృతీయ సంవత్సరం; పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, ఎంబీఏ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు గుర్తింపులేని దూరవిద్య కోర్సుల్లో చేరి ఇబ్బందులకు గురికావొద్దని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రవేశాలకు ఆన్‌లైన్‌ద్వారా ఫీజు చెల్లించాలని వివరించారు. వివరాలకు నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 10 అధ్యయన కేంద్రాల్లోగాని, నల్గొండలోని రీజినల్‌ సెంటర్‌లోగాని 08682-223768లో గాని సంప్రదించాలని కోరారు.

బీఆర్‌ఏఓయూ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు 25
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) యూజీ డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం 2015-16 పాత బ్యాచ్‌ స్పెల్‌ 2 సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 25 చివరితేదీ అని విశ్వవిద్యాలయం ఉమ్మడి జిల్లా రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా.బి.ధర్మానాయక్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పది అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు తమ పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని సూచించారు. అలాగే డిగ్రీ, పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం, ఎంబీఏ ట్యూషన్‌ ఫీజు సెప్టెంబరు 20వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. యూజీ తృతీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 21 నుంచి 26 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు నవంబరు 5 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. వివరాలకు చరవాణి 73829 29610లో సంప్రదించాలని కోరారు.

బీఆర్‌ఏఓయూ ప్రవేశాల గడువు పెంపు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబరు 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ యూనివర్సిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా.బి.ధర్మానాయక్‌ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, ఎంబీఏలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందడానికి అవకాశం అని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పది అధ్యయన కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఓపెన్‌ ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు ప్రవేశాలు పొందవచ్చని స్పష్టం చేశారు.

చీఫ్‌ మినిస్టర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం దరఖాస్తుకు 27 చివరితేది
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: చీఫ్‌ మినిస్టర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా విదేశి విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సు విద్యను అభ్యసిస్తూ ఉపకారవేతనం పొందేందుకు అర్హత గల మైనారీటీ విద్యార్థులు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 27వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారీటీ సంక్షేమశాఖాధికారి గూడ వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.20లక్షల ఉపకారవేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల మైనారీటీ విద్యార్థులు www.telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అమెరికా, కెనెడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ప్రాన్స్, జర్మనీ, జపాన్, సింగపూర్, న్యూజిలాండ్‌ దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో జనవరి 2019 నుంచి జులై 2019 వరకు ప్రవేశము పొందిన వారు అర్హులని తెలిపారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రముతో పాటు ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, ఇతర పత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వివరించారు. వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వివరాలకు చరవాణి 8978900832లో సంప్రదించాలని కోరారు.

31లోగా దరఖాస్తు చేసుకోవాలి
రామన్నపేట, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న అధ్యయన కేంద్రాల్లో డిగ్రీలో ప్రవేశం కోసం ఆసక్తి గలవారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రాంతీయ సమన్వయకర్త బి.ధర్మానాయక్‌ తెలిపారు. రామన్నపేటలోని అధ్యయన కేంద్రంలో కౌన్సిలర్లతో ఆగస్టు 24న జరిగిన సమావేశంలో మాట్లాడారు. అర్హత పరీక్షతో పాటు ఐటీఐ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల్లో చేరి మోసపోవద్దని విద్యార్థులకు సూచించారు.

ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: మహాత్మాజ్యోతిరావుపూలే ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం లబ్ధి కోసం ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖాధికారి విమల కోరారు.. బీసీ, ఈబీసీ కులాలకు చెంది విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సోషల్‌సైన్స్‌, హ్యుమానిటీస్‌ తదితర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 31లోపు 35 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు ఈ పథకంకు అర్హులని తెలిపారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
https://telanganaepass.cgg.gov.in/

కొనసాగుతున్న పీజీ కౌన్సెలింగ్‌
* ఎంజీయూలో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు
నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: నల్గొండ పరిధిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న పీజీ కౌన్సెలింగ్‌ కొనసాగుతుంది. ఆగ‌స్టు 18న‌ వృక్షశాస్త్రం విభాగంలో 195 మంది, జంతుశాస్త్రంలో 175, సైకాలజీలో 8 మంది విద్యార్థులు హాజరవ్వగా అధికారులు వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంజీయూ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ఆకుల రవి మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇక్కడ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగ‌స్టు 19న‌ గణితశాస్త్రం, గణాంకశాస్త్రం విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని ఆర్‌బీఎస్‌కే విభాగంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్‌వో కొండల్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లల వైద్యుడు ఒకటి, జనరల్‌ వైద్యాధికారులు ఆరు, మానసిక వైద్యుడు ఒకటి చొప్పున ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హత ఉన్నవారు ఆగస్టు 19 నుంచి 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

దూరవిద్యతో ఉన్నత విద్య అవకాశం
* ఓపెన్‌యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు 16 వరకు గడువు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: మధ్యలో చదువు మానేసినవారు..ఉద్యోగాలు చేస్తున్నవారు, రెగ్యులర్‌గా కళాశాలలకు వెళ్లలేనివారు గృహిణులు, నిరుద్యోగులు, ఇతర పనులు చేస్తున్నవారు.. ఇలా ఎవరైనా చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి దూర విద్య ద్వారా చదువుకొనే అవకాశం కల్పిస్తుంది డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ. పీజీ, ఇతర ఉన్నత విద్య కోర్సులు అందిస్తున్న ఆ యూనివర్సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నతస్థానంలో ఉన్నారని ఆ యూనివర్సిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా.బి.ధర్మానాయక్‌ తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేని వారు సైతం చదువుకోవాలనుకుంటే అర్హత పరీక్ష ఉత్తీర్ణత పొంది డిగ్రీలో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన వారు నేరుగా డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. డిగ్రీ, పీజీలో ప్రవేశాలకు ఆగ‌స్టు 16 అని, రూ.200 అదనపు రుసుంతో ఆగ‌స్టు 31 వరకు అవకాశం ఉందని చెప్పారు.

విదేశీ విద్యతో.. భవితకు భరోసా..!
* బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఆర్థిక సహాయం
* దరఖాస్తుల సమర్పణకు గడువు ఆగస్టు 31
జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: పేద, సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినా.. ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువుకు దూరమవుతున్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉంది.
దరఖాస్తు ఇలా..
● దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల నుంచి కులం, ఆదాయం, జనన ధ్రువీకరణపత్రాలు తీసుకోవాలి.
● ఆధార్‌కార్డు, పదో తరగతి, డిగ్రీ, ఇంటర్‌, పీజీ మార్కుల జాబితాతోపాటు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌, పీటీఈ అర్హత పత్రాలు కలిగి ఉండాలి.
● విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశ అనుమతి పత్రం కావాలి.
● కళాశాల ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు అవసరం.
● ఈ పత్రాల ఆధారంగా మీ సేవ కేంద్రంలో కానీ, అంతర్జాలంలోకానీ తెలంగాణ ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవాలి.
● సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపును అతికించి రిజిస్ట్రార్‌ సంతకంతో కూడిన ధ్రువీకరణపత్రాన్ని ఆదాయ పత్రానికి జత చేసి దరఖాస్తును సమర్పించాలి.
● దరఖాస్తులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సభ్యులు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి, రూ.20 లక్షలు రెండు విడతల్లో అందజేస్తారు.
● ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజికశాస్త్ర కోర్సుల్లో ఏదైనా డిగ్రీలో 60 శాతానికిపైగా మార్కులు సాధించాలి.
అర్హతలు..
● పీహెచ్‌డీ చేసి ఉండాలి.
● టోఫెల్‌లో 60 శాతం, ఐఈఎల్‌టీఎస్‌లో 6.0 మార్కులు, జీఆర్‌ఈలో 260, జీమ్యాట్‌లో 500, పీటీఈలో 50 మార్కులు అవసరం. వీటిలో ఏదైనా ఒక దాంట్లో అర్హత సాధించి ఉండాలి.
● 35 సంవత్సరాలలోపు వారు అర్హులు.
● తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దవూర రూరల్‌, న్యూస్‌టుడే : జవహర్‌ నవోదయ చలకుర్తి నందు 2020-21 సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్‌ కె.వి.నాగరాజు కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ 01.05.2007 నుంచి 30.04.2011 తేదీ మధ్యన జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.నవోదయ.గోవ్ట్‌.ఇన్‌, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జెఎన్‌వినల్గొండ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, చివరి తేది: 15-09-2019 అని పేర్కొన్నారు.

ఓవర్‌సీస్‌ విద్యానిధి కింద దరఖాస్తుకు 31 వరకు అవకాశం
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం కింద 2019-20 సంవత్సరానికి వెనకబడిన తరగతుల కులాలకు, ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31వరకు అవకాశం ఉందని జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి విమల తెలిపారు. వెబ్‌సైట్‌ telanganaepass.cgg.gov.in నందు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విదేశాలలో విద్యనభ్యసిస్తున్న బీసీ, ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బెల్గాంలో యూనిట్‌ కోటా ఆర్మీ నియామక ర్యాలీ
మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం మరాఠా ఎల్‌ఐ రెజిమెంటల్‌ కేంద్రం పరిధిలోని శివాజీ స్టేడియంలో సెప్టెంబరు 25న మాజీ సైనికుల పిల్లల కోసం యూనిట్‌ కోటాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి వనజ ఒక ప్రకటనలో తెలిపారు.
* సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ కోసం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండి 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన మాజీ సైనికుల పిల్లలు అర్హులని పేర్కొన్నారు.
* సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ కోసం పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండి 8వ తరగతి లేదా పదోతరగతి పాసైన మాజీ సైనికుల పిల్లలు అర్హులని తెలిపారు.
* సోల్జర్‌ క్లర్క్‌ కోసం పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసుండి ఇంటర్మీడియట్‌ 50 శాతం మార్కులతో పాసైన మాజీ సైనికుల పిల్లలు ర్యాలీలో పాల్గొనాలని సూచించారు.
* ఎత్తు 168 సెం.మీ., ఛాతి 77-82 సెం.మీ., బరువు 50 కిలోలున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్‌ విద్యా ధ్రువపత్రాలు, 20 కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటోలు, నివాసం, స్థానిక, కులం, క్యారెక్టర్‌ సర్టిఫికెట్లతోపాటు ఆర్మీ రికార్డుల్లో ఉన్న బంధుత్వ రిలేషన్‌ ధ్రువపత్రం, అవివాహిత ధ్రువీకరణ పత్రం, క్రీడలు, ఎన్‌సీసీ ధ్రువపత్రాలతో నివేదించాలని సూచించారు.

20న ఎంవీఎస్‌లో ఉద్యోగమేళా
వీరన్నపేట sమహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే: సెప్టెంబరు 20న ఎంవీఎస్‌లో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సేల్స్‌ అధికారుల పోస్టుల భర్తీ కోసం ఎంపికలు ఉంటాయని అన్నారు. ఎంపికైన అభ్యర్థుల కోసం రూ.2.15 లక్షల వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 26 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అరు।లని అన్నారు. అసక్తి కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో హజరు కావాలని కోరారు.

అక్టోబరు 21 నుంచి డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు
వీరన్నపేట sమహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు అక్టోబరు 21 నుంచి నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్‌ సంయుక్త సంచాలకులు డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఆక్టోబరు 21, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆక్టోబరు 29, మొదటి సంవత్సరం విద్యార్థులకు నవంబరు 5 నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాల కోసం చదువుతున్న అధ్యాయన కేంద్రాలలో సంప్రదించాలని కోరారు.

సార్వత్రిక విద్య పరీక్ష రుసుం గడువు 24
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌)లో పదో తరగతి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షలు రుసుం తత్కాల్‌ ప్రాతిపదికన చెల్లించేందుకు సెప్టెంబరు 24వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి విద్యార్థులు రూ.500లతో పాటు ప్రతి సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌ విద్యార్థులు రూ.1000తో పాటు ప్రతి సబ్జెక్టుకు రూ.150, ప్రయోగ పరీక్షలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు రుసుం చెల్లించని విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

దరఖాస్తు పొడగింపు
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే: ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం మూడవ విడత దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఐటీఐ కళాశాలల కన్వీనర్‌ శాంతయ్య సెప్టెంబరు 16న తెలిపారు. సెప్టెంబరు 19 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 20న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు http://www.iti.telangan.gov.inను పరిశీలించాలని కోరారు.

13న డీఆర్‌డీఏ ఉద్యోగ మేళా
పాలమూరు, న్యూస్‌టుడే : డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సెప్టెంబరు 13న మహబూబ్‌నగర్‌లోని ఈజీఎంఎం కార్యాలయంలో ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ - ఐకేపీ జిల్లా అదనపు పీడీ శారద ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థలో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇంటర్, డిగ్రీ, బీటెక్‌ చదివినవారు అర్హులన్నారు. వారి అర్హతలకు అనుగుణంగా సేల్స్‌ మేనేజర్లు, కస్టమర్‌ సపోర్టర్స్, బ్రాంచి రిసెప్షనిస్టు తదితర పోస్టులకు ఎంపిక చేస్తామని చెప్పారు. 19-30 ఏళ్ల వయసున్నవారు అర్హులని, ఎంపికైనవారు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.12,500ల నుంచి రూ.18 వేల వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా మేళాకు హాజరు కావాలన్నారు. వివరాలకు 90009 37805 నంబరులో సంప్రదించాలని సూచించారు.

ఇంటర్‌ స్పాట్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మన్ననూర్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి ఆదేశాల మేరకు అమ్రాబాద్‌ మండలం మన్ననూరు పీటీజీ గురుకుల జూనియర్‌ కళాశాలలో పీటీజీ తెగలకు చెందిన చెంచులు, ఇతర గిరిజన తెగల విద్యార్థులకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం స్పాట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపపల్‌ మొగులయ్య తెలిపారు. కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సీఈసీ, హెచ్‌ఈసీ ఆంగ్ల మాధ్యమంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, 22 నుంచి ప్రక్రియ ప్రారంభమైందని, 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు నేరుగా ధ్రువీకరణ పత్రాలు తీసుకొని పీటీజీ ప్రిన్సిపల్‌ కార్యాలయంలో సమర్పిస్తే తక్షణ ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. కళాశాలలో నాణ్యమైన బోధన, మంచి భోజనం, క్రీడల్లో శిక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయని, చెంచు, లంబాడ, ఎరుకల వారితో పాటుగా ఇతర గిరిజన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే : ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఉర్మిళాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. రసాయనశాస్త్ర, జంతుశాస్త్ర సబ్జెక్టుల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీలోగా కళాశాలల్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 28న మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
● ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆంగ్ల సబ్జెక్టుతోపాటు ఎంఎల్‌టీ, పీఎస్‌టీటీ కోర్సుల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపకుల నియామకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సబ్జెక్టుల్లో అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 22లోగా నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

తపాలాలో ప్రతిభకు ప్రోత్సాహం
* ఆగస్టు 23 వరకు దరఖాస్తుకు అవకాశం
పెద్దకొత్తపల్లి: విద్యార్థుల్లో పరిశోధన, పరిశీలన సంగ్రహశక్తిని పెంపొందించేందుకు భారత తపాలాశాఖ ప్రతిభకు ప్రోత్సాహకం అందించేందుకు ఏటా అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులు దీనిలో పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగ‌స్టు 23వ తేదీ వరకు గడువు ఉంది.
* దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి తపాలా శాఖ 2017 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఈ ఏడాది కూడా ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువులోపు తపాలా డివిజనల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
పోటీలకు అర్హత ఇలా.. : తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు సులువు. గుర్తింపు పొందిన పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
పాఠశాలలో స్టాంపుల సేకరణ క్లబ్‌ ఉంటే అందులో సభ్యుడై ఉండాలి. స్టాంపుల సేకరణ క్లబ్‌ లేకుంటే పోటీలో పాల్గొనే విద్యార్థి సొంతంగా స్టాంపుల సేకరణ అభిరుచితో రూ.200 విలువ గల తపాలా స్టాంపులు సేకరించి ఉండాలి. గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ఇలా.. : ప్రతి తపాలా సర్కిల్‌కు 40 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 920 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు అర్హులను ఎంపిక చేస్తారు. దీని కోసం ఏటా రెండు స్థాయిల్లో ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి స్థాయిలో చరిత్ర, క్రీడలు, సైన్స్‌, జియోగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌, ఫిలాటరి (తపాలాస్టాంపుల సేకరణ)కి చెందిన అంశాలతో 50 మార్కులకు సెప్టెంబరు 15న పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులు అయినవారికి రెండో స్థాయి పరీక్ష ఉంటుంది. దీనిలో స్టాంపుల సేకరణ ప్రాజెక్టు అనే అంశంమీద పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం..
ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత దరఖాస్తులను నిర్ణీత పద్ధతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆయా జిల్లాల ప్రధాన తపాలా కార్యాలయాలకు ఆగ‌స్టు 23లోపు రిజిస్టర్‌ పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అందించనున్నాం.

జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షకు దరఖాస్తులు
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే: జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష మొదటి స్థాయి పరీక్ష కోసం పదో తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్‌ ఆగస్టు 5న ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ మూడో తేదిన పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్ష రుసుం రూ.100 చలాన రూపంలో చెల్లించాలని చెప్పారు. దరఖాస్తు సమయంలో కుల, వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించాలని అన్నారు. ఓబీసీ విద్యార్థులు నాన్‌ క్రిమిలేయర్‌ ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుందని చెప్పారు. ట్రైజరీలో ఆగస్టు 28లోగా చలాన్‌ చెల్లించాలని, ఆగస్టు 29వ తేదిలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 30వ తేదిన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. విద్యార్థులు http\\bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఉపకారవేతనల పరీక్షకు దరఖాస్తులు
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే: జాతీయ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ ఉపకార వేతనాల కోసం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్‌ ఆగస్టు 5న కోరారు. ఏడో తరగతిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50, ఇతర విద్యార్థులు 55 శాతం మార్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అన్నారు. దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50, ఇతర విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆగస్టు 29లోగా http\\bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఐటీఐల్లో ప్రవేశాలకు రెండవ విడత కౌన్సెలింగ్‌
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే: ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ శాంతయ్య తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు జులై 25 నుంచి అగస్టు 14లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులతో పాటు వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టు 13, 14, 16వ తేదిల్లో ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని అన్నారు. అసక్తి కలిగిన అభ్యర్థులు https:\\iti.telangana.gov.in లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణచౌక్, న్యూస్‌టుడే : 2019-20 సంవత్సరానికి పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల మంజూరుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు, కళాశాలలు తమ దరఖాస్తులను సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్‌ (https///telaganaepass.cgg.gov.in)లో రిజిస్టర్‌ చేసుకోవాలని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు బాల సురేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అక్టోబరు 21 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు
కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలను అక్టోబరు 21 నుంచి నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎస్‌.వెంకటేశ్వర్లు, డీసీఈబీ జిల్లా కార్యదర్శి చీర్ల రాజస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు వరకు సిలబస్‌ ఆధారంగా ప్రశ్నపత్రాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక ఎంఈవోలు హుజూరాబాద్‌లోని ఎంఈవో కార్యాలయం నుంచి, మిగిలిన మండలాల ఎంఈవోలు కరీంనగర్‌లోని డీసీఈబీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలను తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయులకు అందిస్తారని చెప్పారు.
పరీక్షల సమయసారిణి...
* 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిత్యం జరగనున్నాయి. అక్టోబరు 21న తెలుగు, ఉర్దూ, 22న ఆంగ్లం, 23న గణితం, 24న ఈవీఎస్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
* 6, 7వ తరగతుల విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అక్టోబరు 21న తెలుగు, హిందీ, ఉర్దూ(ప్రథమ భాష), 22న హిందీ, తెలుగు(ద్వితీయ భాష), 23న ఆంగ్లం, 24న సాంఘిక శాస్త్రం, 25న గణితం, 26న సామాన్య శాస్త్రం పరీక్షలుంటాయి.
* 8వ తరగతి విద్యార్థులకు నిత్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబరు 21న గణితం, 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు భౌతిక, రసాయన శాస్త్రం, మధ్యాహ్నం జీవశాస్త్రం, 23న సాంఘిక శాస్త్రం, 24న తెలుగు, ఉర్దూ, హిందీ(ప్రథమ భాష), 25న హిందీ, తెలుగు (ద్వితీయ భాష), 26న ఆంగ్లం పరీక్షలు జరగనున్నాయి.
* 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలుంటాయి. అక్టోబరు 21న గణితం, 22న భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, 23న సాంఘిక శాస్త్రం, 24న తెలుగు, ఉర్దూ, హిందీ(ప్రథమ భాష), 25న ఆంగ్లం, 26న ఉదయం హిందీ, తెలుగు (ద్వితీయ భాష) పరీక్షలు జరుగుతాయి.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష రుసుం గడువు 24
కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాల్లోని ఎస్సెస్సీ, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తత్కాల్‌ షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష రుసుంలను సెప్టెంబు 18 నుంచి 24 వరకు చెల్లించాలని డీఈవో ఎస్‌.వెంకటేశ్వర్లు, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ టి.రాజయ్యపటేల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్‌ షెడ్యూల్‌ ప్రకారం అపరాధ రుసుం రూ.500లతో ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్‌కు రూ.100ను చెల్లించాలని సూచించారు. ఇంటర్‌ అభ్యర్థులు అపరాధ రుసుం రూ.1000తో ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్‌కు రూ.100 రుసుంను చెల్లించాలని చెప్పారు. టీఎస్‌ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల ద్వారా వాటిని చెల్లించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయంలో దృష్టి నిలపాలని తెలిపారు.

19న ఉద్యోగ మేళా
కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే : జిల్లాలోని నిరుద్యోగ యువతకు సెప్టెంబరు 19న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.దేవేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, బి-ఫార్మసీ, పీజీ విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హత ధ్రువపత్రాలతో ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

33 జిల్లాల అభ్యర్థులకు ఆర్మీ నియామక ర్యాలీ
* సెప్టెంబరు 22 వరకు దరఖాస్తు గడువు
* అక్టోబరు 7 నుంచి 17 వరకు కరీంనగర్‌లో ఎంపికలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌: చైన్నై ప్రధాన కేంద్రంగా రిక్రూటింగ్‌ జోన్‌ ఆధ్వర్యంలో సైన్యంలో నియామక ర్యాలీ అక్టోబరు 7 నుంచి 17వ వరకు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల ఆధారంగా నియామకాలు చేపడతారు. సెసప్టెంబరు 22వ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. 23 నుంచి అడ్మిట్‌ కార్డులను పొందవచ్చు. అడ్మిట్‌ కార్డులోనే ర్యాలీకి సంబంధించిన తేదీ, సమయం ప్రకటిస్తారు.
సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ
ఎత్తు కనీసం 166 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో కనీసం 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావడంతో పాటు మొత్తంగా 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌
ఎత్తు 166 సెం.మీ., బరువు కనీసం 48 కిలోలు, ఛాతి 66 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. 10వ తరగతి పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. (ఆల్‌ఆరమ్స్‌) విభాగంలో కనీసం ఎత్తు 166 సెం.మీ., బరువు 48 కిలోలు, ఛాతి 76 సెం.మీ., గాలి పీˆల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. ఇందులో 8వ తరగతి పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధించి ఉండాలి
సోల్జర్‌ ఫార్మా
ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కేజీలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లిష్‌తో ఇంటర్‌/10+2 పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డీ ఫార్మాలో కనీసం 55 శాతం మార్కులు సాధించి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యత్వం తీసుకొని ఉండాలి. బీ ఫార్మాలో కనీసం 50 శాతం మార్కులతో అర్హత సాధించి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో నమోదు చేసుకున్న అభ్యర్థులు సైతం అర్హులు.
సోల్జర్‌ టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్, నర్సింగ్‌ అసిస్టెంట్‌ వెటర్నల్‌
ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌), రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ), బయాలజీతో కూడిన సైన్స్, ఆంగ్లంతో కూడిన ఇంటర్‌ పూర్తి చేయాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ గుమస్తా, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌
ఎత్తు 162 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. ఇంటర్‌లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించాలి. ఆంగ్లంతో పాటు గణితం, అకౌంట్స్, బుక్‌ కీపింగ్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ టెక్నికల్‌
ఎత్తు కనీసం 165 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్‌లో ఆంగ్లం, గణితం (మ్యాథ్స్‌), భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌), రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ) సబ్జెక్టులు చదివి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌ అండ్‌ ఎమ్యునిషన్‌ ఎగ్జామినర్‌)
ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. 50 శాతం మార్కులతో ఇంటర్‌ పాసై ఉండాలి. ఇంటర్‌లో గణితం (మాథ్స్‌), భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌), రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ), ఆంగ్ల సబ్జెక్టులు చదివి ఉండాలి. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టులో 40 శాతం సాధించినవారు అర్హులు.
కావాల్సిన పత్రాలు
అర్హత పరీక్షలకు సంబంధించి ఒరిజనల్‌ పత్రాలు తీసుకెళ్లాలి. కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల ప్రకారం తీసుకున్న వాటినే ర్యాలీకి అనుమతిస్తారు. ఒక జిరాక్స్‌ జతపై గెజిటెడ్‌ అధికారి సంతకం, స్టాంపు తప్పనిసరిగా ఉండాలి. 10వ తరగతి మార్కుల జాబితా, 10+2 మార్కుల జాబితా, డిగ్రీ మార్కుల జాబితా, స్థానికత, కుల ధ్రువీకరణ పత్రాలు 33 జిల్లాల ఆధారంగా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీల నుంచి ఆంగ్లంలో కంప్యూటర్‌ పత్రం తీసుకోవాలి. స్టడీ కండక్ట్‌ ధ్రువపత్రాలు ఉండాలి. 34 ఎం.ఎం.పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు ఆరునెలలోపు ఉన్న వాటిని ఉపయోగించాలి. గడ్డం లేకుండా, లేత రంగు బ్యాక్‌గ్రౌండ్‌ కలిగి, లేత రంగు చొక్కా ధరించి ఉండాలి.
ప్రత్యేక కోటా
సైన్యంలో పనిచేస్తున్న వారి కుమారుడు, మాజీ సైనికుని కుమారుడు, యుద్ధంలో మృతి చెందినవారి కుమారుడు వెంటనే సైన్యంలో చేరే అవకాశం ఉంది. సంబంధింత అధికారికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. సైన్యంలో పనిచేస్తున్న జె.పి.ఓ.ఓ.ఆర్‌. అధికారి కుమారుడు, మాజీ సైనికుని కుమారుడైతే సంబంధిత అధికారి ధ్రువపత్రంతో పాటు తండ్రితో దిగిన ఫొటో జతచేయాలి.
నిబంధనలు
అభ్యర్థులు ఆరోగ్యంగా ఉండి మోచేతి నుంచి మణికట్టు వరకు, అరచేతి వెనుక భాగంలో ఉన్న పచ్చబొట్టు, శాశ్వత టాటూకు అనుమతి ఉంటుంది. శరీరంలో ఇతర భాగంలో శాశ్వత టాటూలు ఉంటే అర్హత ఉండదు. ఒక అంశానికే దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయం ప్రకారం కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియానికి చేరుకోవాలి.
శారీరక సామర్థ్య పరీక్షలు
1.6 కి.మీ పరుగును గ్రూప్‌-1లో 5.30 నిమిషాల్లో పూర్తిచేయాలి. గ్రూప్‌-2లో 5.31- 5.45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 9 అడుగుల డిచ్‌ జంప్, పులప్స్, బస్కీలు కనీసం ఆరు చేసి బ్యాలెన్సింగ్‌ బీమ్‌లో అర్హత సాధించాలి. అర్హులకు సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు.
విభాగాల వారీగా అభ్యర్థుల వయసు
(అభ్యర్థి వయసు 2019, అక్టోబరు 1 ఆధారంగా లెక్కిస్తారు.)
సోల్జర్‌ టెక్నికల్‌
17.6-23 ఏళ్లు
సోల్జర్‌ గుమస్తా, స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌
17.6-23 ఏళ్లు
సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌
17.6-23 ఏళ్లు
సోల్జర్‌ ఫార్మా
19-29 ఏళ్లు
సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ
17.6-21 ఏళ్లు
సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌
17.6-23 ఏళ్లు
మంచి అవకాశం
దేశ రక్షణకు పని చేద్దామనే యువత కరీంనగర్‌లో అక్టోబర్‌ 7 నుంచి జరిగే ఆర్మీ నియామక ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు దేశ సేవ చేయడం గౌరవంగా భావించాలి. ర్యాలీకి రెôడు నెలల సమయం ఉన్నందున యువత సరైన శిక్షణ పొంది అర్హత సాధించాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అభ్యర్థులకు అవసరమైన ధ్రువపత్రాలు అందించాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించాం. - శ్యాంప్రసాద్‌లాల్, జేసీ, ఆర్మీ నియామక ర్యాలీ నోడల్‌ అధికారి
వెబ్‌సైట్‌
joinindianarmy.nic.in

15 వరకు నవోదయ దరఖాస్తుల గడువు
చొప్పదండి, న్యూస్‌టుడే: చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-2021 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. 2007 మే1 నుంచి 2011 ఏప్రిల్‌ 30 మధ్య జన్మించి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
https://navodaya.gov.in

28న ప్రాంగణ నియామకాలు
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎన్‌ఐఐటీ సహకారంతో ఆగస్టు 28న సీనియర్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలను చేపట్టనున్నట్లు శ్రీచైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ ముద్దసాని రమేశ్‌ రెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌.సదాశివ శర్మ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. డిగ్రీ స్థాయి వరకు 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుందన్నారు. ఆసక్తి గల వారు 28 ఉదయం 9.30గంటలకు స్థానిక శ్రీచైతన్య పీజీ కళాశాలలో హాజరు కావాలని సూచించారు.

కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్‌(గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా సబార్డినేట్‌ కోర్టులో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడిందని జిల్లా ఉపాధి అధికారి కె.దేవేందర్‌ రావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో 200 ఉద్యోగాలున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 4తో ముగుస్తుందని తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో స్టెనోగ్రాఫర్‌ 10, జూనియర్‌ అసిస్టెంట్‌ 30, టైపిస్టు 11, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 4, ఎగ్జామినర్‌ 7, కాపిస్ట్‌ 19, ప్రాసెస్‌ సర్వర్స్‌ 23, ఆఫీసు సబార్డినేట్‌ 96 ఖాళీలు ఉన్నాయన్నారు. ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత, స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్‌ టైప్‌ రైటింగ్‌ ఉత్తీర్ణత కావాలన్నారు.

ఎడ్‌సెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయంలో బీఈడీ, పీజీసెట్‌ 2019 ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఆగ‌స్టు 18న ఎడ్‌సెట్‌లో 340, పీజీ సెట్‌లో 500 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.ఉషారాణి తెలిపారు. ఆగ్టు 19న‌ ఎడ్‌సెట్‌లో బయలాజికల్‌ సైన్స్‌లో 1 నుంచి 6000వ ర్యాంకు వరకు పీజీ సెట్‌లో ఎమ్మెస్సీ గణితం 1 నుంచి 6000వ ర్యాంకు వరకు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ 1 నుంచి 1500 వరకు గల ర్యాంకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ
కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం బొమ్మకల్‌ మండలంలోని డ్రీమ్‌ డిఫెన్స్‌ అకాడమీలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆగ‌స్టు 22న అకాడమీ ప్రాంగణంలో 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

8 నుంచి ఐసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : ఐసెట్‌-2019 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో రెండు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో (8 నుంచి 11 వరకు), రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ అగ్రహారంలో (8, 9వ తేదీల్లో) ధ్రువ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని సహాయ కేంద్రాల సమన్వయకర్తలు అప్పారావు, డాక్టర్‌ బి.రాజగోపాల్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదు, ధ్రువపత్రాల పరిశీలనకు టైం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 8 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 12 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు కొనసాగుతుంది. 14న సీట్ల కేటాయింపు జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం స్లాట్‌ బుక్‌ చేసుకుని నిర్ణీత సమయానికి సహాయ కేంద్రం చేరుకోవాలి. తమ వెంట టీఎస్‌ ఐసెట్‌-2019 ర్యాంకు కార్డు, హాల్‌టికెట్‌, ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ మార్కుల జాబితా, టీసీ, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు రెండు జతల నకలు కాపీలను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు https:///tsicet.nic.in ను సందర్శించాలన్నారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్యాప్‌, ఆంగ్లో ఇండియన్‌ వంటి ప్రత్యేక కోటా గల అభ్యర్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, మసాబ్‌ ట్యాంకు, హైదరాబాద్‌లో హాజరుకావాల్సి ఉంటుంది.

ఆగ‌స్టు 10 డిగ్రీ పరీక్షల‌ రుసుం చెల్లింపున‌కు ఆఖ‌రు గ‌డువు
కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 2018వ బ్యాచ్‌కు సంబంధించిన రెండో సెమిస్టర్‌ పరీక్ష రుసుం గడువు ఆగస్టు 10 వరకు ఉందని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఆగస్టు 26 నుంచి పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు ఆగస్టు 16వ తేదీతో ముగియనుందన్నారు. ఈ తేదీలోగా డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు బోధన రుసుం చెల్లించాలని సూచించారు.

దూరవిద్య ప్రవేశాలకు గడువు పెంపు
సుభాష్‌నగర్, (నిజామాబాద్‌)న్యూస్‌టుడే: గిరిరాజ్‌ కళాశాలలోని అంబేడ్కర్‌ వర్సిటి దూరవిద్య అధ్యయన కేంద్రంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు 30 వరకు గడువు పెంచినట్లు ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐసీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉందన్నారు. విద్యార్హతలు, రుసుము వంటి వివరాలకు చరవాణి 73829 29612కు సంప్రదించాలన్నారు.

గిరిరాజ్‌ డిగ్రీ కళాశాలలో దూరవిద్య ప్రవేశాలు
నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: గిరిరాజ్‌ డిగ్రీ కళాశాలలోని ఆచార్య రామ్‌రెడ్డి దూరవిద్య కేంద్రంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ దుబ్బరాజం, సమన్వయకర్త డాక్టర్‌ జ్యోతి ప్రకటనలో తెలిపారు. పీజీలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ డిగ్రీలో బీఏ, బీకాం, బీబీఏ, డిప్లొమా కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. అక్టోబరు 31 వరకు ప్రవేశాలు పొందొచ్చని వెల్లడించారు. ఐసెట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత పొందినవారికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు ఉంటాయన్నారు. ఐసెట్‌ రాయనివారు కోసం పీజీఆర్‌ఆర్‌సీడీఈ నిర్వహించే పరీక్ష రాయల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, అపరాధ రుసుము (రూ.500)తో సెప్టెంబరు 10 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
http://www.ouadmissions.com/
https://www.osmania.ac.in/

నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం
సదాశివనగర్‌, న్యూస్‌టుడే : నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో యూసెఫ్‌ ఆగ‌స్టు 19న‌ తెలిపారు. ఐదో తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబరు 15 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.

డిగ్రీలో తక్షణ ప్రవేశాలు
* 16 నుంచి 18 వరకు అవకాశం
* తెవివి పరిధిలో సగం సీట్లు ఖాళీ
న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌ (డిచ్‌పల్లి): ‘దోస్త్‌’(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిగ్రీ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్ల (తక్షణ ప్రవేశాలు) భర్తీ లేకుండా పోయింది. మూడేళ్లుగా స్పాట్‌కు అవకాశం ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాల సంఘం కోరుతూ రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం సమ్మతించింది. ఈ నిర్ణయం ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలలకు వరమనే చెప్పొచ్చు. మిగిలిపోయిన సీట్లకు ఆగ‌స్టు 16 నుంచి 18 వరకు తక్షణ ప్రవేశాలు కల్పించుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వారు కోరుకునే కళాశాలల్లోని మిగిలిపోయిన స్థానాల్లో చేరేందుకు వెసులుబాటు దొరికింది.
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 11 ప్రభుత్వ, 2 ఎయిడెడ్‌, 53 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మొత్తం కలిపి 27,960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగు విడతల్లో కలిపి కేవలం 13,621 సీట్లే భర్తీ అయ్యాయి. అంటే ఇంకా సగం ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం స్పాట్‌ కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వడంతో ప్రైవేటు కళాశాలలు సీట్ల భర్తీపై ఆశలు పెట్టుకున్నాయి.
16 నుంచే ప్రారంభం
తక్షణ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ఆగ‌స్టు 18 తేదీ వరకే అవకాశం కల్పించింది. ఇది వరకు నాలుగు విడతల్లో సీట్లు భర్తీ చేశారు. ప్రవేశాలు దక్కని విద్యార్థులు మాత్రమే మిగిలిన సీట్లను ఎంపిక చేసుకొనేందుకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ ఉపయోగపడనుంది. విద్యార్థులు
డిగ్రీలో తక్షణ ప్రవేశాలు
తమకు నచ్చిన కళాశాలకు వెళ్తే సంబంధిత యాజమాన్యం దోస్త్‌ వెబ్‌సైట్లో వారి(కళాశాల) లాగిన్‌లో వారి పేరు, వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో మిగిలిపోయిన అడ్మిషన్లు భర్తీ చేసుకోవచ్చు. అయితే పేరున్న ప్రైవేటు కళాశాలల్లో దాదాపుగా సీట్లన్నీ నిండాయి.
ఖర్చు భరిస్తారా..?
స్పాట్‌ కౌన్సెలింగ్‌లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ వర్తించదని తెలుస్తోంది. ఓ విద్యార్థి ప్రైవేటులో మూడేళ్ల డిగ్రీ పూర్తి చేయాలంటే సుమారు రూ.70-80 వేలు ఖర్చు అవుతుంది. ఇంత భారం భరించే వారు చాలా తక్కువ. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు వేరే కోర్సుల్లో చేరడంతోనే డిగ్రీలో భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో తక్షణ ప్రవేశాల్లో పెద్దగా అడ్మిషన్లు నిండకపోవచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు.
స్పాట్‌కు అనుమతి
ప్రైవేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రభుత్వం స్పాట్‌ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఆగ‌స్టు 18 తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇలా భర్తీ చేసిన వివరాలను సంబంధిత కళాశాలలు దోస్త్‌ సైట్లో నమోదు చేసి పంపాల్సి ఉంటుంది.
- రవీందర్‌రెడ్డి, తెవివి దోస్త్‌ సమన్వయకర్త

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రవేశాలకు చివరి తేదీ 16
నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2019-20 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ అంబర్‌సింగ్‌ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ(తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌) ఎంకాం, ఎంఎస్సీ(గణితం, సైకాలజీ), ఎంబీఏ సబ్జెక్టులు ఉన్నాయని తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకున్నవారు అంతర్జాలం www.braouonline.in లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు.

పరీక్షల రుసుము చెల్లించాలి
కంఠేశ్వర్, న్యూస్టుడే: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 2019-20 విద్యాసంవత్సరానికి పరీక్షల రుసుమును జులై 31లోగా చెల్లించాలని ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం అధ్యక్షడు, డీఈవో దుర్గాప్రసాద్, కార్యదర్శి నాహేద్ తన్వీర్ తెలిపారు. రుసుము వివరాలను అన్ని పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. అందనివారు అంతర్జాలం http://www.deonizamabad.in/ లో పొందవచ్చునని తెలిపారు.ఈ రుసుమును డీడీ రూపంలో చెల్లించి దానికి సంబంధించిన ప్రతులను ఉమ్మడి పరీక్షల విభాగం కార్యాలయంలో అందజేయాలని సూచించారు. గతేడాది ప్రత్యేక కార్యచరణతో పదోతరగతిలో మెరుగైన ఫలితాలను సాధించామని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలోనూ ప్రత్యేక ప్రణాళికతో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. నవంబర్ 14లోపు పాఠ్యాంశాలను పూర్తిచేసుకోవాలని డీఈవో ఆదేశించారు.

యూజీ, పీజీ దరఖాస్తులకు ఆహ్వానం
కంఠేశ్వర్(నిజామబాద్), న్యూస్టుడే: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ప్రొఫెసర్ జీ రామ్రెడ్డి దూరవిద్య కేంద్రంలో 2019-20 విద్యాసంవత్సరానికి ప్రవేశాలను దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ దుబ్బరాజం, దూరవిద్య కేంద్రం సమన్వయకర్త డాక్టర్ జ్యోతి జులై 19న తెలిపారు. పీజీలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, డిగ్రీలో బీఏ, బీకాం, బీబీఏ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 లోగా కళాశాలలో లేదా అంతర్జాలం http://www.oucde.net/ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని పీజీ బ్లాక్లో సంప్రదించాలని సూచించారు.

నవోదయ ప్రవేశాల గడువు పొడగింపు
మెదక్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: నవోదయలో ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే గడువును సెప్టెంబరు 30 వరకు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి డా.రవికాంత్‌రావు తెలిపారు. 15తో గడువు ముగియగా, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 78935-09094, 99519-38677, 94903-56731 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం
మెదక్‌ అర్బన్‌ న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం, అకౌంటెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాకాధికారి రవికాంత్‌రావు తెలిపారు. ఏఎన్‌ఎం పోస్టుకు ఇంటర్మీడియట్, ఏఎన్‌ఎం శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు, అకౌంటెంట్‌ పోస్టుకు డిగ్రీలో కామర్స్, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగినవారు, కంపూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు బీకాం కంప్యూటర్‌తో పాటు పీజీడీసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు పూర్తి వివరాలతో సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీలోపు సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని వివరించారు.

ఒలింపియాడ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఒలింపియాడ్‌ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ అమరేశ్‌ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేటలో జిల్లా పరీక్షల విభాగం సహాయ సంచాలకులు శ్యాంప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా ఒలింపియాడ్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలుగా విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణితం, సామాన్య, ఆంగ్ల, అబ్దుల్‌ కలాం అంశాలపై నవంబరులో ఒలింపియాడ్‌ ఉంటుందన్నారు. మూడు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు రెండు స్థాయిల్లో పరీక్షకు ఆగస్టు 30వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 20 మంది విద్యార్థులకు ఉచితంగా అవకాశం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99083 13951 చరవాణిలో సంప్రదించాలన్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు శంకర్‌, రమేశ్‌ గౌడ్‌, రఘుపతి, బిక్షపతి తదితరులు ఉన్నారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
శాంతినగర్, న్యూస్‌టుడే: సమీకృత గిరిజనాభావృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం గిరిజన యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌Âవైపరీ (జీఎన్‌ఎం), డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ (డీఎంఎల్‌టీ), డిప్లొమా ఇన్‌ ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌ కోర్సుల్లో శిక్షణ అందిస్తారన్నారు. ఉట్నూరులోని ఐటీడీఏ డీటీడీఓ, ఏటీడీఓ కార్యాలయాల్లో సెప్టెంబరు 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అభ్యర్థులకు 29న రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో పాటు కుల, ఆదాయ, నివాస, ఆధార్‌ కార్డు పత్రాలతో పాటు మూడు పాస్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్‌లో కోర్సుల కాలపరిమితికి అనుగుణంగా వసతితో కూడిన ఉచితశిక్షణ అందిస్తారన్నారు.

కస్తూర్బాల్లో బోధనేతర సిబ్బంది నియామకాలు
ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డా.రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్, ఏఏన్‌ఎం పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 20వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అకౌంటెంట్‌ పోస్టుల్లో మైదాన ప్రాంతంలో రెండు, ఏజెన్సీ ప్రాంతంలో రెండు పోస్టులు, ఏఏన్‌ఎం మైదాన ప్రాంతంలో ఒక పోస్టు ఖాళీగా ఉందని వివరించారు. ఏఏన్‌ఎంకు ఇంటర్‌తో పాటు ఏఏన్‌ఎం శిక్షణ ధ్రువపత్రం, అకౌంటెంట్‌ పోస్టు కోసం డిగ్రీలో కామర్స్, కంప్యూటర్‌ స్కిల్స్, లేదా బీకాం కంప్యూటర్‌ అర్హతలు ఉండాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

19న డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జాబ్‌మేళా
ఆదిలాబాద్‌ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిమెంట్‌ జనరేషన్, మార్కెటింగ్‌ మిషన్‌ ద్వారా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు సెప్టెంబరు 19న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి రాఠోడ్‌ రాజేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్, సెక్యూరిటీ సర్వీసెస్, రిటైల్, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్, హాస్పిటాలిటీ సర్వీస్, ఆటోమొబైల్‌ రంగాలకు సంబంధించిన 15 కంపెనీలు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో జరిగే ముఖాముఖిలకు హాజరుకావాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఫెయిల్‌ అయిన అభ్యర్థులతో పాటు డిగ్రీ, బీ.టెక్, ఎం.టెక్, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీతో పాటు 35ఏళ్ల వయసు దాటకుండా ఉండాలని సూచించారు. చిరునామా, నిజధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌ఫోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు.

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం
ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆలిండియా సైనిక్‌ స్కూల్‌లో 2020-21 ఏడాది విద్యా సంవత్సరంలో 6, 9వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డా.రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం మార్చి 2020 సంవత్సరం నాటికి 12 ఏళ్లు నిండి ఉండాలని, 9వ తరగతిలో 2020 మార్చి 31 నాటికి 15 ఏళ్లు ఉండాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 2020 జనవరి 5న ఉంటుందని, ఇందుకు అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకునేందుకు సెప్టెంబరు 23వ తేదీ వరకు అవకాశం ఉందని వివరించారు.

5 నుంచి ఆర్మీ ఉచిత శిక్షణ
ఇచ్చోడ, న్యూస్‌టుడే : ఇచ్చోడ మండలంలోని యువశిక్షణ కేంద్రంలో సెప్టెంబరు 5 నుంచి నిరుద్యోగ యువతకు ఆర్మీ ఉద్యోగాల భర్తీ ర్యాలీలో పాల్గొనడానికి ఐటీడీఏ తరఫున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య, జేడీఎం నాగభూషణంసెప్టెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 7న జరగనున్న ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణత, కుల, ఆదాయ ధ్రువపత్రం, రెండు పాస్‌ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు. 17.5 నుంచి 21 ఏళ్ల వయసుండాలన్నారు. వివరాలకు 78936 16392, 97035 65987, 80080 87088కు సంప్రదించాలని సూచించారు.

యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
ఉట్నూరు, న్యూస్‌టుడే : గిరిజన యువత కోసం జగిత్యాల, హైదరాబాద్‌లలో న్యాక్‌ ద్వారా అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్‌ వర్క్‌ సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ సర్వేయర్, సీలింగ్, డ్రైవాల్‌ ఇన్స్‌స్ట్రాలర్‌ వంటి ఉపాధి కోర్సులలోÅ ఉచితంగా శిక్షణ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన గిరిజన అభ్యర్థులు సెప్టెంబరు 5న బెల్లంపల్లిలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో, సెప్టెంబరు 6న ఉట్నూరులోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్హత, ఇతరత్ర వివరాల కోసం 7893616392, 9493535052 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
శాంతినగర్‌, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాఫులే విదేశీ విద్యానిధి పథకానికి అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీబీసీడీఓ జి.ఆశన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ఆగ‌స్టు 31వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు అర్హత కోర్సుల్లో 60 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌ సైన్సు, మెడిసిన్‌, నర్సింగ్‌, సోషల్‌సైన్స్‌, హ్యుమనిటీస్‌ కోర్సులను విదేశాల్లో చదివేందుకు విద్యానిధి పథకంలో ఆర్థికసాయం అందజేస్తారన్నారు. దరఖాస్తు దారులు జులై 1, 2019 నాటికి 35 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులన్నారు. కుల, స్థానికత, ఆదాయ, పుట్టినతేదీ, ఆధార్‌కార్డు, ఈపాస్‌ ఐడీ నంబరు, పాస్‌పోర్టు కాపీలతో పాటు ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, జాతీయ బ్యాంకు పాస్‌ పుస్తకాలను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ శిక్షణ
* ఉచిత భోజనం, వసతి, శిక్షణ
ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: అక్టోబర్‌ 7 నుంచి 17 వరకు కరీంనగర్‌ వేదికగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆర్మీ శిక్షణకు ఎస్సీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు మాజీ సైనికుల సమక్షంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి అత్యుత్తమంగా నిలిచిన వారికి ఎంపిక చేస్తామని వివరించారు. ఈ శిక్షణ సెప్టెంబరు 1 నుంచి 30 వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువకులు సద్వినియోగించుకోవాలని కోరారు.
నిర్వహించే అర్హత పరీక్షలు ఇవే
● 1.6 కి.మీ.ల పరుగును 5 నిమిషాల 30 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్లలోపు పూర్తి చేయాలి.
● 6 నుంచి 10 పుల్‌ అప్స్‌ తీయాలి.
● 9 అడుగుల డిచ్‌ జంప్‌ చేయాలి.
● జిగ్‌జాగ్‌బార్‌పైన నడవాలి.
23వ తేదీలోగా దరఖాస్తు..
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగ‌స్టు 23వ తేదీలోగా ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలోని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. సందేహాలు ఉంటే చరవాణి 91828 59341, 93813 03380లో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
ఎంపిక అర్హత పరీక్షలు, వేదిక..
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఈనెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఎంపిక అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణకు అర్హులు వీరే..
ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన ఎస్సీ, బీసీ యువకులు మాత్రమే ఉచిత శిక్షణకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందినవారికి రూ.2 లక్షలు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి.

నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
* సెప్టెంబరు 15 వరకు గడువు
కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే : కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ జవహర్‌ నవోదయ విద్యాలయం 2020-21 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విద్యాలయం ప్రిన్సిపల్‌ చక్రపాణి తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబరు 15 తేదీలోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించనున్నారు. 2020 జనవరి 11వ తేదీ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ పరిధిలోని పలు పంచాయతీలను పురపాలికల్లో విలీనం చేశారు. నిర్మల్‌ జిల్లా పరిధిలోని ఖానాపూర్‌, తిమ్మాపూర్‌, సుభాష్‌నగర్‌, మంజులపూర్‌, వెంకటపూర్‌, మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌, తీగల్‌పహాడ్‌, తాళ్లపల్లి, సింగపల్లి, క్యాతన్‌పల్లి, తిమ్మాపూర్‌, చెన్నూరులోని 11 వార్డులు, లక్షేటిపేట, ఇటిక్యాల, మోజల, ఆదిలాబాద్‌లోని అనుకుంట, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌, రాంపూర్‌(ఆ), ఎన్‌హెచ్‌బీ కాలనీ, టైలర్స్‌ కాలనీ, పోలీస్‌కాలనీ, వివేకానంద కాలనీ, ఆగ్రజ టౌన్‌ షిప్‌, ఆదర్శకాలనీ, భగవత్‌సింగ్‌ కాలనీ, దస్సానాపూర్‌, దుర్గానగర్‌, కె.కె.కె.కాలనీ, దివ్యాంగుల కాలనీ, అటెండర్స్‌ కాలనీ, కృష్ణానగర్‌, ఇందిరమ్మ కాలనీలు మున్సిపాలిటీల్లో కలిశాయి. ఈ ప్రాంతాల్లోని విద్యార్థులందరూ అర్బన్‌ కేటగిరి కిందకు వస్తారు. విద్యార్థులు దరఖాస్తులు అర్బన్‌ కేటగిరి కింద నమోదు చేసుకోవాలి. ఒక వేళ రూరల్‌ కేటగిరి అని నమోదు చేస్తే, ఆ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సీటు లభించినప్పటికీ, తిరస్కరిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే సందర్భంగా ఈ నియమావళిని పాటించాలని ప్రిన్సిపల్‌ కోరారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనందున ఆ ప్రాంత విద్యార్థులు మాత్రం రూరల్‌ కేటగిరి కిందనే నమోదు చేసుకోవాలన్నారు. నివాస ధ్రువీకరణ, వయసు, ఒక ఫొటో ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

ఆర్ట్స్‌కళాశాల ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలు విడుదల
సుబేదారి, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇటీవల నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్‌ ఆచార్య బన్న అయిలయ్య విడుదల చేశారు. 51 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 30 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత పొందని విద్యార్థులు సెప్టెంబరు 25 తేదీలోగా పునః ముల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

17న ప్రాంగణ ఎంపికలు
వడ్డేపల్లి, న్యూస్‌టుడే: పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబరు 17న ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ఆవరణలో 17న ఉదయం 9 గంటల నుంచి ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకొని హాజరు కావాలని కోరారు.

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల ఎంపికకు 13న పరీక్ష
రూరల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆరు తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ చేయడానికి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగ నియామకం కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. అర్హులైన అభ్యర్థుల జాబితా జిల్లా ఉపాధి కార్యాలయం నోటీస్‌బోర్డులో ప్రదర్శించినట్లు చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 13న హన్మకొండలోని సుబేదారిలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు 11, 12వ తేదీల్లో ములుగు రోడ్డులోని జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 ఫొటోలు సమర్పించి హాల్‌టికెట్‌ పొందాలని ఆమె వివరించారు.

దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాల గడువు 6
కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం వారు అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో 2019-2020 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల కోసం సెప్టెంబరు 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చునని దూరవిద్యాకేంద్రం సంచాలకులు ఆచార్య జి.వీరన్న సెప్టెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, ఎంఏ, ఎంకాంలలోని అన్ని కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. ఈ విద్యాసంవత్సరంలో మాత్రమే ఇయర్‌వైజ్‌ విధానం ఉంటుందని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 154 కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తున్న తెలిపారు. పూర్తి వివరాలు కేయూ దూరవిద్యాకేంద్రం వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చునని వివరించారు.

ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫథకానికి దరఖాస్తుల ఆహ్వానం
అర్బన్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక వర్గాలవారు విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం స్ప్రింగ్‌ సీజన్‌ 2019కి గాను (జనవరి 2019 నుంచి జులై 2019 వరకు ప్రవేశం తీసుకున్న విద్యార్థులు) ముఖ్యమంత్రి ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫథకానికి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, డాక్టోరల్‌ స్టడీస్‌ విదేశాల్లో చదువుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు పత్రాలను జిల్లా మైనారిటీ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తులు సెప్టెంబరు 27 సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలన్నారు. ఎంపికైన వారికి ఉపకారవేతనం కింద రూ.20 లక్షల ఆర్థిక సహాయం రెండు విడతల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. విమాన ప్రయాణ చార్జీలకు రూ.60వేలు మించకుండా అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు అర్బన్‌ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిని సంప్రదించాలన్నారు.

సెప్టెంబ‌రు 16న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష
కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష సెప్టెంబ‌రు 16న నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌ రెడ్డి, అదనపు అధికారులు డాక్టర్‌ పి.సదానందం, డాక్టర్‌ వై.వెంకయ్య ఆగ‌స్టు 26న‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 1,226 మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఎన్‌టీఎస్‌ఈకి దరఖాస్తుల ఆహ్వానం
నర్సంపేట రూరల్‌,న్యూస్‌టుడే: నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ)కి వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాజీవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, కేంద్రియ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వికలాంగులైతే అంగవైకల్య పత్రం అందులో పొందుపర్చాలన్నారు. రుసుము చెల్లించేందుకు ఆగ‌స్టు 28న చివరి తేదీ కాగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు 29 ఆఖరు తేదీ అన్నారు.

నవోదయ ప్ర‌వేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం
మామునూరు, న్యూస్‌టుడే: మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జులై 12న‌ ప్రిన్సిపల్‌ పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబరు 15 లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు. ఇతర వివరాలకు 86881-75144లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఆర్ట్స్‌కళాశాల ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలు విడుదల
సుబేదారి, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇటీవల నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్‌ ఆచార్య బన్న అయిలయ్య విడుదల చేశారు. 51 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 30 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత పొందని విద్యార్థులు సెప్టెంబరు 25 తేదీలోగా పునః ముల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

కేజీవీబీల్లో అకౌంటెంట్‌ పోస్టులకు దరఖాస్తులు
ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధి ఐనవోలు, వేలేరులోని కేజీవీబీ పాఠశాలలో ఒప్పంద విధానంలో అకౌంటెంట్‌గా పనిచేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి తెలిపారు. అభ్యర్థులు బీకామ్‌ (కంప్యూటర్స్‌) లేదా, బీకామ్‌తో పాటు (సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌) అర్హులని చెప్పారు. జులై 1, 2019 వరకు 44 ఏళ్లు మించకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ అభ్యర్థులకు ఐదు ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. అర్బన్‌ జిల్లాకు చెంది అర్హులైన మహిళ అభ్యర్థులు తమ అర్హత గల సర్టిఫికెట్లు (అటెస్టెడ్‌ కాపీలు)తో సెప్టెంబరు 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని నారాయణరెడ్డి కోరారు.

17న ప్రాంగణ ఎంపికలు
వడ్డేపల్లి, న్యూస్‌టుడే: పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబరు 17న ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ఆవరణలో 17న ఉదయం 9 గంటల నుంచి ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకొని హాజరు కావాలని కోరారు.

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల ఎంపికకు 13న పరీక్ష
రూరల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆరు తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ చేయడానికి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగ నియామకం కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. అర్హులైన అభ్యర్థుల జాబితా జిల్లా ఉపాధి కార్యాలయం నోటీస్‌బోర్డులో ప్రదర్శించినట్లు చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 13న హన్మకొండలోని సుబేదారిలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు 11, 12వ తేదీల్లో ములుగు రోడ్డులోని జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 ఫొటోలు సమర్పించి హాల్‌టికెట్‌ పొందాలని ఆమె వివరించారు.

దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాల గడువు 6
కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం వారు అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో 2019-2020 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల కోసం సెప్టెంబరు 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చునని దూరవిద్యాకేంద్రం సంచాలకులు ఆచార్య జి.వీరన్న సెప్టెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, ఎంఏ, ఎంకాంలలోని అన్ని కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. ఈ విద్యాసంవత్సరంలో మాత్రమే ఇయర్‌వైజ్‌ విధానం ఉంటుందని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 154 కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తున్న తెలిపారు. పూర్తి వివరాలు కేయూ దూరవిద్యాకేంద్రం వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చునని వివరించారు.

సెప్టెంబ‌రు 16న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష
కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష సెప్టెంబ‌రు 16న నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌ రెడ్డి, అదనపు అధికారులు డాక్టర్‌ పి.సదానందం, డాక్టర్‌ వై.వెంకయ్య ఆగ‌స్టు 26న‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 1,226 మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
అర్బన్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థినీ, విద్యార్థుల నుంచి 2019-20 సంవత్సరానికి ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి సబిత ఒక ప్రకటనలో తెలిపారు. కుల, ఆదాయ, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, ఫొటో జతపరిచి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం ద్వారా ఆగస్టు 31లోగా జిల్లా సంక్షేమ కార్యాలయం రాంనగర్‌లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 8639040488 నంబరును సంప్రదించాలని ఆమె కోరారు.

నవోదయ ప్ర‌వేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం
మామునూరు, న్యూస్‌టుడే: మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జులై 12న‌ ప్రిన్సిపల్‌ పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబరు 15 లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు. ఇతర వివరాలకు 86881-75144లో సంప్రదించాలని పేర్కొన్నారు.

26న ఉపాధి శిక్షణకు ముఖాముఖీలు
కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన నిరుద్యోగ బీటెక్‌ (సీఎస్‌ఈ, ఐటీ) యువతకు ‘నిర్మాణ్‌’ సంస్థ సౌజన్యంతో ఉపాధితో కూడిన శిక్షణ కల్పించేందుకు సెప్టెంబరు 26న ముఖాముఖీలు నిర్వహించనున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, బూట్‌సార్ప్, కోర్‌ జావా, ఆన్‌రైడ్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌ తదితర సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ ఇస్తారన్నారు. 2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరాలలో బీటెక్‌ (సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆసక్తి ఉంటే డీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగే ముఖాముఖీలకు హాజరుకావాలని సూచించారు.

నర్సింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణి మహిళా నర్సింగ్‌ కళాశాలలో 2019-20 విద్యాసంవత్సరానికి నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల కాల వ్యవధిగల ఈ కోర్సులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రతిని అక్టోబరు 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమర్పించాలి. అక్టోబరు 25వ తేదీలోగా సీట్ల కేటాయింపు పూర్తవుతుందని యాజమాన్యం పేర్కొంది. నవంబరు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది.

సైనిక్‌ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కోరుకొండ (విజయనగరం జిల్లా) సైనిక్‌ స్కూల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు విద్యార్థులు సెప్టెంబరు 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ శైనీ ఓ ప్రకటనలో తెలిపారు. 2020 జనవరి 5న అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. 6వ తరగతి ప్రవేశానికి 2020 మార్చి 31 నాటికి 10 నుంచి 12 సంవత్సరాలు, 9వ తరగతి ప్రవేశానికి 2020 మార్చి 31 నాటికి 13 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలురు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. రాత, వైద్య పరీక్షల ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, హైదరాబాద్, కరీంనగర్‌ ప్రాంతాల్లో ఉంటాయని వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. www.sainikschoolkorukonda.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 08922 - 246168, 246119 సంప్రదించాలని సూచించారు.

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు న్యాక్‌ సహాయ సంచాలకులు జి.రమేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు, 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు, ఐటీఐ తదితర అర్హతలు, ఆసక్తిని కలిగిన ఉన్న అభ్యర్థులకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) మూడు నెలల పాటు అసిస్టెంట్‌ సర్వేయర్, ఎలక్ట్రిషన్‌ ట్రేడుల్లో శిక్షణను అందిస్తుందన్నారు. అభ్యర్థులు ఆరు పాస్‌పోర్టు ఫొటోలు, ఆధార్, రేషన్‌ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సెప్టెంబరు 21లోగా కొత్తగూడెం రామాటాకీస్‌ ఏరియా, ప్రగతి మైదానంలోని కొత్తగూడెం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(కేఎస్‌డీసీ)లో నేరుగా సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9704280412కు సంప్రదించాలన్నారు.

ఐటీఐల్లో ప్రవేశాలకు గడువు పెంపు
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మూడో దశ ప్రవేశాలకు గడువు తేదీని పెంచినట్లు రుద్రంపూర్‌ ఐటీఐ ప్రిన్సిపల్‌ ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిని కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 19వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుదారులకు 20న నిజ ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశీలనకు అభ్యర్థులు వారికి సమీపంలోని ప్రభుత్వ ఐటీఐకి వెళ్లవచ్చని వివరించారు.

సార్వత్రిక పరీక్షలకు తత్కాల్‌లో ఫీజు చెల్లింపునకు అవకాశం
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: అక్టోబర్‌లో నిర్వహించే సార్వత్రిక పది, ఇంటర్‌ సప్లిమెంటరీ రాత పరీక్షలకు తత్కాల్‌ పద్ధతిలో పరీక్ష ఫీజులను చెల్లించడానికి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు డీఈవో వాసంతి ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 18నుంచి 24 వరకు సంబంధిత ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో సంప్రదించి, టీఎస్‌ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో ఫీజులను చెల్లించాలని సూచించారు.

నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు
భద్రాచలం అంబేడ్కర్‌ సెంటర్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల్లో ఉన్న గిరిజన యువతీ, యువకులు నైపుణ్య శిక్షణలకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఐటీహెచ్‌ఎం హైదరాబాద్‌ వారిచే నిర్వహించే ఈ ఎంపికలకు గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పించేందుకు ఎన్‌ఐటీహెచ్‌ఎం హైదరాబాద్‌ వారు ముందుకు వచ్చారన్నారు. ఎయిర్‌ హోస్టెస్‌ మూడు నెలల వ్యవధి కోర్సు అని డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నారు. పురుషులు, స్త్రీలు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల గిరిజన యువత తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సెప్టెంబరు 18న స్థానిక ఐటీడీఏలో ఉన్న వైటీసీ భవనంలో హాజరు కావాలని ఎంపికైన వారు శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్మీ ఎంపికలకు ఉచిత శిక్షణ
భద్రాచలం, న్యూస్‌టుడే: ఆర్మీ ఎంపికలకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 20 రోజుల పాటు నిపుణులు అందించే శిక్షణతో పాటు ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబరు 13న పత్రాలతో స్థానిక వైటీసీకి రావాలని సూచించారు.

8న ఎన్‌డీఏ ప్రవేశ పరీక్ష మెలకువలపై ప్రత్యేక శిక్షణ
శామీర్‌పేట: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు కీన్‌ స్కూల్‌ ఫర్‌ సైనిక్, గ్రేటర్‌ బీఈడీ కళాశాల, ప్రతిభాన్వేషణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 8న ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కీన్‌ స్కూల్‌ ఫర్‌ సైనిక్‌ ప్రిన్సిపల్‌ కల్యాణి తెలిపారు. నవంబరు 17న యూపీఎస్సీ నిర్వహిస్తున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ/నాన్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలపై ముందస్తుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఫిజికల్‌ పరీక్షలో పాటించాల్సిన జాగ్రత్తలపై యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఉస్మానియా, కన్వీనర్‌ టీఎస్‌పి సెట్‌పై ఆచార్య వి.సత్యనారాయణ, ఫిజికల్‌ ట్రైనర్‌ మహేశ్‌ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు వివరించనున్నారని ప్రతిభాన్వేషణ సమితి కన్వీనర్‌ జేకబ్‌ తెలిపారు. పేర్లు నమోదు చేసుకునేందుకు 90322 52521, 040-27132813 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

20న జిల్లాస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆగస్టు 20న పాల్వంచలోని ఆశ్రమ ఉన్నతపాఠశాలలో 27వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘పరిశుభ్రత, హరిత మరియు ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర సాంకేతిక నూతన అవిష్కరణలు’ అనే అంశంపై ప్రతి పాఠశాల నుంచి అయిదు ఉప అంశాల్లో ఒక ప్రాజెక్టునైనా తప్పనిసరిగా రూపొందించి ప్రదర్శన చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారు ఆగస్టు 19లోపు వారి ప్రాజెక్టులను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని, ప్రాజెక్టులో సందేహాలు ఉంటే జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్త సంపత్‌ 9010043945, జిల్లా సైన్స్‌ అధికారి చలపతిరాజును 7036399033 చరవాణుల్లో సంప్రదించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.
నిబంధనలు:
* ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు, గ్రూపు లీడర్‌ మాత్రమే పాల్గొనాలి.
* ప్రాజెక్టు రిపోర్టు రెండు కాపీలు, లాగ్‌బుక్‌, నాలుగు ఛార్ట్‌లు, గ్రూప్‌ లీడర్‌ రెండు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుంది.
* 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలబాలికలు పాల్గొనవచ్ఛు
* ప్రతిగ్రూప్‌లో లీడర్‌తో కలుపుకొని ఇద్దరు విద్యార్థులు ఉండాలి
* జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనల్లో గ్రూప్‌ లీడర్‌ మాత్రమే పాల్గొనాలి
* ప్రాజెక్టు ప్రదర్శనకు 8నిమిషాల సమయం కేటాయిస్తారు.

దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ ప్రతిభా ఉపకారవేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 7వ తరగతిలో 55శాతం మార్కులను సాధించి, ప్రస్తుతం 8వతరగతి చదువుతూ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.5లక్షల్లోపు ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్ష రుసుము జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్‌సీ విద్యార్థులు రూ.50 ఆన్‌లైన్‌లో చెల్లించాలని, ఆగస్టు 29లోగా కుల, ఆదాయ, పీహెచ్‌సీ ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. సందేహాల నివృత్తికి జిల్లా ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

నవోదయ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో చేరగోరే విద్యార్థుల కోసం వచ్చే 2020 జనవరి 11వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్‌మోహన్‌ జులై 31న ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబరు 9వ తేదీలోగా సంబంధిత వెబ్‌సైట్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు
* 3, 4, 5 తరగతులు ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ 2019-20 విద్యాసంవత్సరంలో 5వ తరగతి అవిభాజ్య ఖమ్మం జిల్లాలో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు.
* 2019-20 విద్యాసంవత్సరంలో 5వ తరగతి ఎన్‌ఐవోఎస్‌ బి - సర్టిఫికెట్‌ కోర్సులో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
* అభ్యర్థులు 1.5.2017కు ముందుగానీ 30.4.2011 తర్వాత గానీ జన్మించి ఉండరాదు.
* ఎట్టి పరిస్థితిల్లో ఒక అభ్యర్థి ప్రవేశపరీక్షకు రెండోసారి హాజరు కాకూడదు.
మార్గదర్శకాలు
* ఆన్‌లైన్‌ పరిచయ పత్రం (ప్రాస్‌పెక్టస్‌)ను క్షుణ్ణంగా చదవాలి.
* అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* రిజర్వేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరిస్తారు.
* దరఖాస్తు ఫారంలో గుర్తింపు చిహ్నాలను స్పష్టంగా నింపాలి
* పుట్టిన తేదీ అంకెలలోను, అక్షరాలలోనూ నింపాలి
* అభ్యర్థి తండ్రి/సంరక్షకుని సంతకాన్ని, ప్రధానోపాధ్యాయుని ధ్రువీకరణను, ఫొటోను తప్పనిసరిగా ఆన్‌లైన్‌ దరఖాస్తులో పొందుపరచాలి. ఈ అనుబంధాలను ‘జేపీజీ ఫార్మెట్‌ 10-100కేబీ’లో మాత్రమే అని లోడ్‌ చేయాలి.
రిజర్వేషన్‌
* గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75శాతం సీట్లు
* బాలికలకు 1/3వ వంతు
* దివ్యాంగులకు 3శాతం
* షెడ్యూలు కులాల వారికి, షెడ్యూలు తెగల వారికి భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ ఉంది.

డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను సెప్టెంబరు 20న పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్‌ విడుదల చేశారు. 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్స్, ఇంప్రూవ్‌మెంటు) విద్యార్థులకు నవంబరు, డిసెంబరు 2019లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రుసుం అక్టోబరు 15 వరకు చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుంతో అక్టోబరు
22 వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైటు www.satavahana.in లో చూడాలని సూచించారు.

దూరవిద్యలో ప్రవేశాలకు ఆహ్వానం
జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే: పద్మావతి, గీతం విశ్వవిద్యాలయంలో దూరవిద్య, ఓపెన్‌ డిగ్రీలో బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 25లోపు దరఖాస్తు చేసుకోవాలని కల్కి అకాడమీ సమన్వయకర్త రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం స్థానిక కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ నర్సింగ్‌ స్కూళ్లలో దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణచౌక్, న్యూస్‌టుడే: ప్రభుత్వ నర్సింగ్‌ స్కూళ్లలో 2019-20 సంవత్సరంలో జనరల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన వైద్యశాల పర్యవేక్షకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌లో సైన్స్‌ గ్రూపులో ఉత్తీర్ణులై ఉండాలని, అర్హత, ఆసక్తి గలవారు సెప్టెంబరు 30 లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని సూచించారు.

ఉచిత శిక్షణను దరఖాస్తులు
రాయికల్‌ పట్టణం, న్యూస్‌టుడే: జీ.ఎం.ఆర్‌ వరలక్ష్మి పౌండేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని చినజీయర్‌స్వామి ట్రస్ట్‌ భవనంలో నిరుద్యోగులకు మూడు నెలల పాటు వృత్తి విద్యపై ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధి రమేష్‌ కుమార్‌ తెలిపారు. మూడు నెలల పాటు ఆటోమొబైల్‌ టెక్నీషియన్, టైలరింÞ్ వృత్తులపై శిక్షణ ప్రారంభించనున్నట్లు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగి పదో తరగతి పాస్, ఫెయిలైన యువతీ యువకులు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం అందించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99499 77811 చరవాణి నంబర్‌లో జీఎంఆర్‌ ప్రతినిధులను సంప్రదించాలన్నారు.

33 జిల్లాల అభ్యర్థులకు ఆర్మీ నియామక ర్యాలీ
* సెప్టెంబరు 22 వరకు దరఖాస్తు గడువు
* అక్టోబరు 7 నుంచి 17 వరకు కరీంనగర్‌లో ఎంపికలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌: చైన్నై ప్రధాన కేంద్రంగా రిక్రూటింగ్‌ జోన్‌ ఆధ్వర్యంలో సైన్యంలో నియామక ర్యాలీ అక్టోబరు 7 నుంచి 17వ వరకు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల ఆధారంగా నియామకాలు చేపడతారు. సెసప్టెంబరు 22వ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. 23 నుంచి అడ్మిట్‌ కార్డులను పొందవచ్చు. అడ్మిట్‌ కార్డులోనే ర్యాలీకి సంబంధించిన తేదీ, సమయం ప్రకటిస్తారు.
సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ
ఎత్తు కనీసం 166 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో కనీసం 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావడంతో పాటు మొత్తంగా 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌
ఎత్తు 166 సెం.మీ., బరువు కనీసం 48 కిలోలు, ఛాతి 66 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. 10వ తరగతి పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. (ఆల్‌ఆరమ్స్‌) విభాగంలో కనీసం ఎత్తు 166 సెం.మీ., బరువు 48 కిలోలు, ఛాతి 76 సెం.మీ., గాలి పీˆల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. ఇందులో 8వ తరగతి పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధించి ఉండాలి
సోల్జర్‌ ఫార్మా
ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కేజీలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లిష్‌తో ఇంటర్‌/10+2 పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డీ ఫార్మాలో కనీసం 55 శాతం మార్కులు సాధించి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యత్వం తీసుకొని ఉండాలి. బీ ఫార్మాలో కనీసం 50 శాతం మార్కులతో అర్హత సాధించి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో నమోదు చేసుకున్న అభ్యర్థులు సైతం అర్హులు.
సోల్జర్‌ టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్, నర్సింగ్‌ అసిస్టెంట్‌ వెటర్నల్‌
ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌), రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ), బయాలజీతో కూడిన సైన్స్, ఆంగ్లంతో కూడిన ఇంటర్‌ పూర్తి చేయాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ గుమస్తా, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌
ఎత్తు 162 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరగాలి. ఇంటర్‌లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించాలి. ఆంగ్లంతో పాటు గణితం, అకౌంట్స్, బుక్‌ కీపింగ్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ టెక్నికల్‌
ఎత్తు కనీసం 165 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్‌లో ఆంగ్లం, గణితం (మ్యాథ్స్‌), భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌), రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ) సబ్జెక్టులు చదివి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌ అండ్‌ ఎమ్యునిషన్‌ ఎగ్జామినర్‌)
ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కిలోలు, ఛాతి 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. 50 శాతం మార్కులతో ఇంటర్‌ పాసై ఉండాలి. ఇంటర్‌లో గణితం (మాథ్స్‌), భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌), రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ), ఆంగ్ల సబ్జెక్టులు చదివి ఉండాలి. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టులో 40 శాతం సాధించినవారు అర్హులు.
కావాల్సిన పత్రాలు
అర్హత పరీక్షలకు సంబంధించి ఒరిజనల్‌ పత్రాలు తీసుకెళ్లాలి. కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల ప్రకారం తీసుకున్న వాటినే ర్యాలీకి అనుమతిస్తారు. ఒక జిరాక్స్‌ జతపై గెజిటెడ్‌ అధికారి సంతకం, స్టాంపు తప్పనిసరిగా ఉండాలి. 10వ తరగతి మార్కుల జాబితా, 10+2 మార్కుల జాబితా, డిగ్రీ మార్కుల జాబితా, స్థానికత, కుల ధ్రువీకరణ పత్రాలు 33 జిల్లాల ఆధారంగా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీల నుంచి ఆంగ్లంలో కంప్యూటర్‌ పత్రం తీసుకోవాలి. స్టడీ కండక్ట్‌ ధ్రువపత్రాలు ఉండాలి. 34 ఎం.ఎం.పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు ఆరునెలలోపు ఉన్న వాటిని ఉపయోగించాలి. గడ్డం లేకుండా, లేత రంగు బ్యాక్‌గ్రౌండ్‌ కలిగి, లేత రంగు చొక్కా ధరించి ఉండాలి.
ప్రత్యేక కోటా
సైన్యంలో పనిచేస్తున్న వారి కుమారుడు, మాజీ సైనికుని కుమారుడు, యుద్ధంలో మృతి చెందినవారి కుమారుడు వెంటనే సైన్యంలో చేరే అవకాశం ఉంది. సంబంధింత అధికారికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. సైన్యంలో పనిచేస్తున్న జె.పి.ఓ.ఓ.ఆర్‌. అధికారి కుమారుడు, మాజీ సైనికుని కుమారుడైతే సంబంధిత అధికారి ధ్రువపత్రంతో పాటు తండ్రితో దిగిన ఫొటో జతచేయాలి.
నిబంధనలు
అభ్యర్థులు ఆరోగ్యంగా ఉండి మోచేతి నుంచి మణికట్టు వరకు, అరచేతి వెనుక భాగంలో ఉన్న పచ్చబొట్టు, శాశ్వత టాటూకు అనుమతి ఉంటుంది. శరీరంలో ఇతర భాగంలో శాశ్వత టాటూలు ఉంటే అర్హత ఉండదు. ఒక అంశానికే దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయం ప్రకారం కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియానికి చేరుకోవాలి.
శారీరక సామర్థ్య పరీక్షలు
1.6 కి.మీ పరుగును గ్రూప్‌-1లో 5.30 నిమిషాల్లో పూర్తిచేయాలి. గ్రూప్‌-2లో 5.31- 5.45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 9 అడుగుల డిచ్‌ జంప్, పులప్స్, బస్కీలు కనీసం ఆరు చేసి బ్యాలెన్సింగ్‌ బీమ్‌లో అర్హత సాధించాలి. అర్హులకు సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు.
విభాగాల వారీగా అభ్యర్థుల వయసు
(అభ్యర్థి వయసు 2019, అక్టోబరు 1 ఆధారంగా లెక్కిస్తారు.)
సోల్జర్‌ టెక్నికల్‌
17.6-23 ఏళ్లు
సోల్జర్‌ గుమస్తా, స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌
17.6-23 ఏళ్లు
సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌
17.6-23 ఏళ్లు
సోల్జర్‌ ఫార్మా
19-29 ఏళ్లు
సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ
17.6-21 ఏళ్లు
సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌
17.6-23 ఏళ్లు
మంచి అవకాశం
దేశ రక్షణకు పని చేద్దామనే యువత కరీంనగర్‌లో అక్టోబర్‌ 7 నుంచి జరిగే ఆర్మీ నియామక ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు దేశ సేవ చేయడం గౌరవంగా భావించాలి. ర్యాలీకి రెôడు నెలల సమయం ఉన్నందున యువత సరైన శిక్షణ పొంది అర్హత సాధించాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అభ్యర్థులకు అవసరమైన ధ్రువపత్రాలు అందించాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించాం. - శ్యాంప్రసాద్‌లాల్, జేసీ, ఆర్మీ నియామక ర్యాలీ నోడల్‌ అధికారి
వెబ్‌సైట్‌
joinindianarmy.nic.in

13న ప్రత్యేక కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : పీజీ సెట్‌-2019 ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కోటా గల అభ్యర్థులకు సెప్టెంబరు 13న ధ్రువపత్రాల పరిశీలన హైదరాబాద్‌లో జరగనుంది. ఎన్‌సీసీ, ఎన్‌ఐక్యూ, క్యాప్‌ వంటి ప్రత్యేక కోటా గల అభ్యర్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకుల విభాగంలో హాజరు కావాలని శ్రీచైతన్య పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.సదాశివ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని దివ్యాంగులకు సెప్టెంబరు 19, 20 తేదీల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారని పేర్కొన్నారు.

15 వరకు నవోదయ దరఖాస్తుల గడువు
చొప్పదండి, న్యూస్‌టుడే: చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-2021 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. 2007 మే1 నుంచి 2011 ఏప్రిల్‌ 30 మధ్య జన్మించి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
https://navodaya.gov.in

ఎడ్‌సెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయంలో బీఈడీ, పీజీసెట్‌ 2019 ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఆగ‌స్టు 18న ఎడ్‌సెట్‌లో 340, పీజీ సెట్‌లో 500 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.ఉషారాణి తెలిపారు. ఆగ్టు 19న‌ ఎడ్‌సెట్‌లో బయలాజికల్‌ సైన్స్‌లో 1 నుంచి 6000వ ర్యాంకు వరకు పీజీ సెట్‌లో ఎమ్మెస్సీ గణితం 1 నుంచి 6000వ ర్యాంకు వరకు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ 1 నుంచి 1500 వరకు గల ర్యాంకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ
కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం బొమ్మకల్‌ మండలంలోని డ్రీమ్‌ డిఫెన్స్‌ అకాడమీలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆగ‌స్టు 22న అకాడమీ ప్రాంగణంలో 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

డిగ్రీలో 23,196 సీట్లు ఖాళీ
* తొమ్మిది కళాశాలల్లో సున్నా ప్రవేశాలు
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: డిగ్రీ ప్రవేశాల కీలక విడతలు ముగిశాయి. మొదట మూడు విడతలతోపాటు ప్రత్యేక విడతలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టారు. ఇందులో సీటు పొందిన విద్యార్థులు ఆగ‌స్టు 17 వరకు ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో 47.59 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 106 కళాశాలలు ఉండగా ఇందులో 15 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్‌ కళాశాలలున్నాయి. మిగతావి ప్రయివేటు యాజమాన్యంలో కొనసాగుతున్నాయి. వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో మొత్తం 43,300 సీట్లున్నాయి. ప్రత్యేక విడత ముగిసే సమయానికి అన్ని కళాశాలల్లో కలుపుకొని 20,608 ప్రవేశాలు ఖరారయ్యాయి. తొలి మూడు విడతల్లో 14,401 సీట్లు మాత్రమే నిండాయి. ప్రత్యేకంగా ఇచ్చిన అవకాశంతో 6,207 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు చూస్తే కొన్ని కళాశాలల్లోనే భారీగా ప్రవేశాలు తీసుకోగా ఎక్కువ కళాశాలల్లో తక్కువ మంది చేరారు. ఆదరణ పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకునేందుకు విద్యార్థులు మొగ్గు చూపారని తెలుస్తోంది. 106 కళాశాలలకు గాను తొమ్మిదింటిలో ఒక్కరు కూడా చేరలేదు. ఒక కళాశాలలో ఒక సీటు మాత్రమే నిర్ధారణ అయింది. 100 లోపు ప్రవేశాలతో సరి పెట్టుకున్న కళాశాలలు 30 వరకు ఉండటం విశేషం. మే మాసం నుంచి ఆగస్టు వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగినా భర్తీ అయినా సీట్ల కంటే ఖాళీగా ఉన్నవే ఎక్కువ ఉండటం విశేషం. ఇక మిగిలింది స్పాట్‌ అడ్మిషన్లు. ఇందుకు ఆగ‌స్టు 18 వరకు గడువు ఉంది. ‘దోస్త్‌’లో దరఖాస్తు చేసుకోని విద్యార్థులతో పాటు సీటు పొందని వారికి ఇదొక అవకాశం. దీంతో ఆసక్తి గల కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంది.

8 నుంచి ఐసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : ఐసెట్‌-2019 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో రెండు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో (8 నుంచి 11 వరకు), రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ అగ్రహారంలో (8, 9వ తేదీల్లో) ధ్రువ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని సహాయ కేంద్రాల సమన్వయకర్తలు అప్పారావు, డాక్టర్‌ బి.రాజగోపాల్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదు, ధ్రువపత్రాల పరిశీలనకు టైం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 8 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 12 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు కొనసాగుతుంది. 14న సీట్ల కేటాయింపు జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం స్లాట్‌ బుక్‌ చేసుకుని నిర్ణీత సమయానికి సహాయ కేంద్రం చేరుకోవాలి. తమ వెంట టీఎస్‌ ఐసెట్‌-2019 ర్యాంకు కార్డు, హాల్‌టికెట్‌, ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ మార్కుల జాబితా, టీసీ, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు రెండు జతల నకలు కాపీలను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు https:///tsicet.nic.in ను సందర్శించాలన్నారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్యాప్‌, ఆంగ్లో ఇండియన్‌ వంటి ప్రత్యేక కోటా గల అభ్యర్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, మసాబ్‌ ట్యాంకు, హైదరాబాద్‌లో హాజరుకావాల్సి ఉంటుంది.

ఆర్ట్స్‌కళాశాల ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలు విడుదల
సుబేదారి, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇటీవల నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 18న ప్రిన్సిపల్‌ ఆచార్య బన్న అయిలయ్య విడుదల చేశారు. 51 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 30 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత పొందని విద్యార్థులు 25తేదీ లోగా పునః ముల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశాలకు గడువు 20
జనగామ అర్బన్, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులలో ప్రవేశం పొందేందుకు సెప్టెంబరు 20న తుది గడువు అని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ డా.కె.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్‌ జి.శ్రీనివాస్‌ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ పూర్తి చేసినవారు, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు నేరుగా ప్రవేశం పొందేందుకు అర్హులన్నారు. 2015-16 యూజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యాసంవత్సరానికి చెందిన నాన్‌ సీబీసీఎస్‌ విద్యార్థులు తమ సప్లిమెంటరీ పరీక్ష రుసుం చెల్లించేందుకు సెప్టెంబరు 25న చివరి తేదీ అని తెలిపారు. వివరాలకు 73829 29687 నంబర్‌ను సంప్రదించాలని కోరారు

సార్వత్రిక పరీక్షల ఫీజులు చెల్లించండి
జనగామ అర్బన్, న్యూస్‌టుడే: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొంది ఇప్పటివరకు పరీక్ష ఫీజులను చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అక్టోబరులో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు తత్కాల్‌ స్కీంలో ఫీజులను సెప్టెంబరు 18 నుంచి 24 వరకు మీసేవ, టీఎస్‌ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో చెల్లించాలని తెలిపారు. పదో తరగతి తత్కాల్‌ ఫీజు రూ.500, పరీక్ష ఫీజు సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్‌ తత్కాల్‌ ఫీజు రూ.1000, పరీక్ష ఫీజు సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్‌ ఫీజు సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలని చెప్పారు. వివరాలకు 80084 03631 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోండి
చేర్యాల, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన’ పథకం కింద ఉపాధి అవకాశ శిక్షణను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆ పథకం ప్రాజెక్టు అధికారి బి.రవీందర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుమతి కార్పొరేట్‌ సర్వీసెస్, ఈజీఎంఎం సంయుక్తాధ్వర్యంలో అనుభవజ్ఞులైన ఆయా రంగ నిపుణులతో ఆంగ్లం, కంప్యూటర్, లైఫ్‌ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి, వేర్‌హౌజ్‌ సూపర్‌వైజర్, ఇన్వెంటరీ క్లర్క్, ఫైబర్‌ టెక్నీషియన్‌లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న 18 నుంచి 28 ఏళ్లలోపు వారు 9849677453, 8074684582 నంబర్లకు ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకోచ్చుని అన్నారు.

17న ప్రాంగణ ఎంపికలు
వడ్డేపల్లి, న్యూస్‌టుడే: పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబరు 17న ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ఆవరణలో 17న ఉదయం 9 గంటల నుంచి ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 26 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకొని హాజరు కావాలని కోరారు.

తగ్గిన డిగ్రీ ప్రవేశాలు
* కేయూ పరిధిలోని కళాశాలలు 278
* ప్రవేశాలు లేనివి 21

న్యూస్‌టుడే, కేయూ క్యాంపస్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలంటే విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, జీవితానికి భరోసా లభించకపోవడం, పాత కోర్సులనే ఏళ్లుగా కొనసాగించడం లాంటివి ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఏటా ప్రవేశాలు తగ్గుతుండడంతో కళాశాలలు మూతపడుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌-2019) ద్వారా ప్రవేశాల ప్రక్రియ కొనసాగింది. ఇది జూన్‌ నుంచి ఆగస్టు నెల ఆఖరు వరకు నడిచింది. సీట్లు భర్తీ కాకపోవడంతో ‘స్పాట్‌’ నిర్వహించారు. అయినా 50 శాతానికి పైగా మిగిలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కళాశాలలను మూసివేస్తామని యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుంటున్నాయి.
మూసివేత దిశగా...
దోస్త్‌ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అన్ని కళాశాలల్లో 2017లో 59000, 2018లో 54000, ఈ ఏడాది 50728 మంది ప్రవేశాలు పొందారు. 2017లో 317 కళాశాలలు ఉండగా 2018లో వాటి సంఖ్య 290కి పడిపోయింది. ఈ సారి మరో 12 మూతపడగా.. 21 విద్యా సంస్థల్లో శూన్య ప్రవేశాలు ఉన్నాయి. త్వరలో ఇవీ కనుమరుగవుతాయని విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి.
అక్కడ ఒక్కరూ లేరు...
కేయూ పరిధిలో 278 కళాశాలలున్నాయి. ఇందులో గిరిజన, సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. అసలు ప్రవేశాలు పొందని కళాశాలలు 21 ఉన్నాయి. వీటిలో ఒక్కరంటే ఒక్కరూ చేరలేదు. మరో రెండేళ్లలో ఇవి మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఫస్టియర్‌లో ప్రవేశాలు లేకపోవడం వల్ల రెండో, మూడో సంవత్సరాల్లో మాత్రమే తరగతుల బోధనుంటుంది. మొత్తం కళాశాలల్లో 1 నుంచి 100 మంది ఉన్న కళాశాలలు 87, 101 నుంచి 200 మంది ఉన్నవి 80, 201 నుంచి 300 మంది ఉన్నవి 50, 301 నుంచి 400 మంది ప్రవేశాలు పొందినవి 14, 401 నుంచి 500 మంది ఉన్నవి 11, 501 నుంచి 600 మంది ఉన్నవి 7, 601 నుంచి 1400 మందికి వరకు ఉన్నవి 8 ఉన్నాయి.

సెప్టెంబ‌రు 16న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష
కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష సెప్టెంబ‌రు 16న నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌ రెడ్డి, అదనపు అధికారులు డాక్టర్‌ పి.సదానందం, డాక్టర్‌ వై.వెంకయ్య ఆగ‌స్టు 26న‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 1,226 మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పదో తరగతి విద్యార్థులకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జనగామ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల (నర్మెట్ట)లో 2019-20 విద్యాసంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులలో ఖాళీలు ఉన్నందున ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ దయాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీలో 11, బైపీసీలో 3 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని ఇందుకుగాను ఆగస్టు 23న సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు చరవాణి ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. వివరాలకు 83094 05881 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

పదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జనగామ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల(నర్మెట్ట)లో 2019-20 విద్యాసంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులలో ఖాళీలు ఉన్నందున ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ దయాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీలో 11, బైపీసీలో 3 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని ఇందుకుగాను ఆగస్టు 23న సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు చరవాణి ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. వివరాలకు 83094 05881 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ఎడ్‌సెట్‌-2019 ప్ర‌వేశాలు
కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో 2019-2020 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆగ‌స్టు 16న‌ ప్రారంభమైంది. క్యాంపస్‌లోని కేయూ ప్రవేశాల కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య టి.మనోహర్‌ పరిశీలనను ప్రారంభించారు. ఎడ్‌సెట్‌-2019 లో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరై పత్రాలను సమర్పించారు. వీరికి పాస్‌వర్డ్‌ను కేటాయించారు. ఆగ‌స్టు 17వ తేదీ నుంచి అభ్యర్థులు కళాశాలల ఎంపిక కోసం వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఎడ్‌సెట్‌ సహాయ కేంద్రం నిర్వాహకులు మనోహర్‌, ఇ.సురేష్‌బాబు తెలిపారు. ఆగ‌స్టు 22వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందన్నారు. ఆంగ్లంలో రెండో ర్యాంకు సాధించిన టి.వినయ్‌కుమార్‌కు పాస్‌వర్డ్‌కు సంబంధించిన పత్రాన్ని మనోహర్‌ అందజేశారు.

ఐటీఐ దరఖాస్తులకు గడువు పొడిగింపు
భూపాలపల్లి రూరల్, న్యూస్‌టుడే: ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబరు 19 వరకు పొడిగించినట్లు భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ సూరం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మొదటి, రెండో విడతలో భర్తీకాకుండా మిగిలిన సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. ప్రవేశాలు, అభ్యర్థుల ఎంపికలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల చరవాణికి సందేశం వస్తుందని తెలిపారు.

ఉచిత కంప్యూటర్‌ శిక్షణ
గోదావరిఖని, న్యూస్‌టుడే: గోదావరిఖని హెచ్‌ఎంఎస్‌ కార్యాలయంలో సింగరేణి మైనర్స్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు శిక్షకులు ఆజంబేగ్‌ తెలిపారు. జాడి దుర్గయ్య మెమోరియల్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కంప్యూటర్‌ బేసిక్స్, ఎం.ఎస్‌.విండోస్, ఎం.ఎస్‌.ఆఫీస్, డీటీపీ, ఇంటర్నెట్, టైమింగ్, హార్డ్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నామని వివరించారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సెప్టెంబరు 20 నుంచి తరగతులు ప్రారంభించనున్నామని వివరించారు.

జవహర్‌ నవోదయకు 15 లో ప్రవేశాలు
భూపాలపల్లి, న్యూస్‌టుడే: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 15 వరకు గడువు ఉందని ఇన్‌ఛార్జి డీఈవో నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 01-05- 2007 నుంచి 30-04-2011 మధ్య జన్మించిన వారే అర్హులని వివరించారు. ప్రవేశపరీక్ష వచ్చే సంవత్సరం జనవరి 11వ తేదీన జరుగుతుందని తెలిపారు.

సైనిక్‌ స్కూలు దరఖాస్తుల గడువు 23
భూపాలపల్లి, న్యూస్‌టుడే: సైనిక్‌ స్కూల్‌ కోరుకొండ (విజయనగరం జిల్లాలో) 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 23 వరకు గడువు ఉందని ఇన్‌ఛార్జి డీఈవో నారాయణరెడ్డి తెలిపారు. 6వ తరగతిలో చేరేవారికి 10 నుంచి 12 సంవత్సరాలు, 9వ తరగతిలో చేరే వారికి 13 నుంచి 15 సంవత్సరాల వయసువారు అర్హులని, ప్రవేశపరీక్ష వచ్చే సంవత్సరం జనవరి 5న ఉంటుందని వివరించారు.

సెప్టెంబ‌రు 16న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష
కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష సెప్టెంబ‌రు 16న నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌ రెడ్డి, అదనపు అధికారులు డాక్టర్‌ పి.సదానందం, డాక్టర్‌ వై.వెంకయ్య ఆగ‌స్టు 26న‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 1,226 మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇంటర్‌ స్పాట్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మన్ననూర్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి ఆదేశాల మేరకు అమ్రాబాద్‌ మండలం మన్ననూరు పీటీజీ గురుకుల జూనియర్‌ కళాశాలలో పీటీజీ తెగలకు చెందిన చెంచులు, ఇతర గిరిజన తెగల విద్యార్థులకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం స్పాట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపపల్‌ మొగులయ్య తెలిపారు. కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సీఈసీ, హెచ్‌ఈసీ ఆంగ్ల మాధ్యమంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, 22 నుంచి ప్రక్రియ ప్రారంభమైందని, 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు నేరుగా ధ్రువీకరణ పత్రాలు తీసుకొని పీటీజీ ప్రిన్సిపల్‌ కార్యాలయంలో సమర్పిస్తే తక్షణ ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. కళాశాలలో నాణ్యమైన బోధన, మంచి భోజనం, క్రీడల్లో శిక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయని, చెంచు, లంబాడ, ఎరుకల వారితో పాటుగా ఇతర గిరిజన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తపాలాలో ప్రతిభకు ప్రోత్సాహం
* ఆగస్టు 23 వరకు దరఖాస్తుకు అవకాశం
పెద్దకొత్తపల్లి: విద్యార్థుల్లో పరిశోధన, పరిశీలన సంగ్రహశక్తిని పెంపొందించేందుకు భారత తపాలాశాఖ ప్రతిభకు ప్రోత్సాహకం అందించేందుకు ఏటా అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులు దీనిలో పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగ‌స్టు 23వ తేదీ వరకు గడువు ఉంది.
* దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి తపాలా శాఖ 2017 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఈ ఏడాది కూడా ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువులోపు తపాలా డివిజనల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
పోటీలకు అర్హత ఇలా.. : తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు సులువు. గుర్తింపు పొందిన పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
పాఠశాలలో స్టాంపుల సేకరణ క్లబ్‌ ఉంటే అందులో సభ్యుడై ఉండాలి. స్టాంపుల సేకరణ క్లబ్‌ లేకుంటే పోటీలో పాల్గొనే విద్యార్థి సొంతంగా స్టాంపుల సేకరణ అభిరుచితో రూ.200 విలువ గల తపాలా స్టాంపులు సేకరించి ఉండాలి. గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ఇలా.. : ప్రతి తపాలా సర్కిల్‌కు 40 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 920 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు అర్హులను ఎంపిక చేస్తారు. దీని కోసం ఏటా రెండు స్థాయిల్లో ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి స్థాయిలో చరిత్ర, క్రీడలు, సైన్స్‌, జియోగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌, ఫిలాటరి (తపాలాస్టాంపుల సేకరణ)కి చెందిన అంశాలతో 50 మార్కులకు సెప్టెంబరు 15న పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులు అయినవారికి రెండో స్థాయి పరీక్ష ఉంటుంది. దీనిలో స్టాంపుల సేకరణ ప్రాజెక్టు అనే అంశంమీద పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం..
ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత దరఖాస్తులను నిర్ణీత పద్ధతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆయా జిల్లాల ప్రధాన తపాలా కార్యాలయాలకు ఆగ‌స్టు 23లోపు రిజిస్టర్‌ పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అందించనున్నాం.

13 వరకు డిగ్రీలో ప్రవేశాలకు అవకాశం
గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 13 వరకు అవకాశముందని జిల్లా కన్వీనర్‌ రాజేందర్‌ తెలిపారు. గద్వాల ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో దోస్త్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు చేశామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెలవు రోజుల్లోనూ కేంద్రం పనిచేస్తుందని, రిజిస్ట్రేషన్లు, వెబ్‌ఆప్షన్ల విషయంలో ఏమైనా సందేహాలుంటే కేంద్రం ప్రతినిధులు నివృత్తి చేస్తారని పేర్కొన్నారు.

ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు శిక్షణ
గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలను అక్టోబర్‌లో భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆసక్తిగల యువతకు ముందస్తుగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శశాంక ప్రకటనలో తెలిపారు. శారీరక దృఢత్వం, రాత పరీక్షకు సంబంధించి నైపుణ్యాలు పెంపొందించుకునేలా వరంగల్‌లోని త్రిదళ్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 6 వరకు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. 17 నుంచి 23 ఏళ్లలోపు నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 91218 84304 నంబరులో సంప్రదించాలని సూచించారు.

ఓయూ దూరవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ఓయూ దూరవిద్యలో వివిధ కోర్సుల అభ్యసనకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, యూజీ డిప్లొమా కోర్సులకు అక్టోబర్‌ 31 లోగా ్ర్ర్ర.్న్య‘్ట’.-’్మ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమగ్ర వివరాలకు కళాశాలలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని కోరారు.

దూరవిద్య ప్రవేశాలకు 20 వరకు గడువు
కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ దూరవిద్యలో ప్రవేశాలకు సెప్టెంబరు 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం సమన్వయకర్త రాజ్‌కుమార్, కార్యాలయ బాధ్యుడు బాపురావు ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశం పొందే ప్రథమ, ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ప్రవేశాలు పొందే అవకాశం ఉందని, పూర్తి వివరాలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

29న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా
కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగ‌స్టు 29న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ చంద్రకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బ్లూ ఓసియన్‌ స్టాపింగ్‌ సొల్యూషన్స్‌, మొబైల్‌ అసెంబ్లింగ్‌ టెక్నీషియన్స్‌, పేరం గ్రూప్‌లో హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, మేనేజర్స్‌, టెలీకాలర్స్‌ తదితర ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన యువత అర్హులని,ఎంపికైన వారికి రూ.10,000 - రూ.20,000 వేతనాలు ఉంటాయని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

17న ఉద్యోగ మేళా
బీబీపేట, న్యూస్‌టుడే: ఆగ‌స్టు 17న మండల కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఎం గార్డెన్‌లో నిరుద్యోగ దళిత యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీబీఆర్‌సీ జిల్లా సమన్వయ కర్త తలారి ప్రభాకర్‌ తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, సంయుక్త పాలనాధికారి యాదిరెడ్డి, వివిధ అధికారులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రవేశాలకు చివరి తేదీ 16
నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2019-20 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ అంబర్‌సింగ్‌ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ(తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌) ఎంకాం, ఎంఎస్సీ(గణితం, సైకాలజీ), ఎంబీఏ సబ్జెక్టులు ఉన్నాయని తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకున్నవారు అంతర్జాలం www.braouonline.in లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు.

5 నుంచి ఆర్మీ ఉచిత శిక్షణ
ఇచ్చోడ, న్యూస్‌టుడే : ఇచ్చోడ మండలంలోని యువశిక్షణ కేంద్రంలో సెప్టెంబరు 5 నుంచి నిరుద్యోగ యువతకు ఆర్మీ ఉద్యోగాల భర్తీ ర్యాలీలో పాల్గొనడానికి ఐటీడీఏ తరఫున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య, జేడీఎం నాగభూషణంసెప్టెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 7న జరగనున్న ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణత, కుల, ఆదాయ ధ్రువపత్రం, రెండు పాస్‌ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు. 17.5 నుంచి 21 ఏళ్ల వయసుండాలన్నారు. వివరాలకు 78936 16392, 97035 65987, 80080 87088కు సంప్రదించాలని సూచించారు.

యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
ఉట్నూరు, న్యూస్‌టుడే : గిరిజన యువత కోసం జగిత్యాల, హైదరాబాద్‌లలో న్యాక్‌ ద్వారా అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్‌ వర్క్‌ సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ సర్వేయర్, సీలింగ్, డ్రైవాల్‌ ఇన్స్‌స్ట్రాలర్‌ వంటి ఉపాధి కోర్సులలోÅ ఉచితంగా శిక్షణ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన గిరిజన అభ్యర్థులు సెప్టెంబరు 5న బెల్లంపల్లిలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో, సెప్టెంబరు 6న ఉట్నూరులోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్హత, ఇతరత్ర వివరాల కోసం 7893616392, 9493535052 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

24న సీఈఓ పోస్టు భర్తీకి రాత పరీక్ష
ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ధనలక్ష్మి రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్‌ రెబ్బెన మండల ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈవో) పోస్టు భర్తీకోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 24న ఉదయం 8.30గంటల రాత పరీక్ష, సాయంత్రం 4గంటలకు మౌఖిక పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆగ‌స్టు 22న‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్ష జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉంటుందని తెలిపారు. కుమురం భీం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు అర్హులని పేర్కొన్నారు.

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
ఆసిఫాబాద్‌ అర్బన్‌: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేరేందుకు ఉత్సాహవంతులైన జిల్లా యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. దరఖాస్తు చేయదలచిన వారు 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలని సూచించారు. గ్రూప్‌ x ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, గ్రూప్‌ y ట్రేడ్‌ నుంచి మెడికల్‌ అసిస్టెంట్‌ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. శారీరక దారుఢ్య పరీక్షలు, రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు www.airmenselection.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ శిక్షణ
* ఉచిత భోజనం, వసతి, శిక్షణ
ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: అక్టోబర్‌ 7 నుంచి 17 వరకు కరీంనగర్‌ వేదికగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆర్మీ శిక్షణకు ఎస్సీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు మాజీ సైనికుల సమక్షంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి అత్యుత్తమంగా నిలిచిన వారికి ఎంపిక చేస్తామని వివరించారు. ఈ శిక్షణ సెప్టెంబరు 1 నుంచి 30 వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువకులు సద్వినియోగించుకోవాలని కోరారు.
నిర్వహించే అర్హత పరీక్షలు ఇవే
● 1.6 కి.మీ.ల పరుగును 5 నిమిషాల 30 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్లలోపు పూర్తి చేయాలి.
● 6 నుంచి 10 పుల్‌ అప్స్‌ తీయాలి.
● 9 అడుగుల డిచ్‌ జంప్‌ చేయాలి.
● జిగ్‌జాగ్‌బార్‌పైన నడవాలి.
23వ తేదీలోగా దరఖాస్తు..
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగ‌స్టు 23వ తేదీలోగా ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలోని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. సందేహాలు ఉంటే చరవాణి 91828 59341, 93813 03380లో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
ఎంపిక అర్హత పరీక్షలు, వేదిక..
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఈనెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఎంపిక అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణకు అర్హులు వీరే..
ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన ఎస్సీ, బీసీ యువకులు మాత్రమే ఉచిత శిక్షణకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందినవారికి రూ.2 లక్షలు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి.

సాంకేతిక సహాయకుల ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
చిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధిహామీ పథకంలో పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనకు ఐదుగురు సాంకేతిక సహాయకులను నియమించాలని నిర్ణయించినట్లు డీఆర్డీఓ శేషాద్రి బుధవారం తెలిపారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమో, బీటెక్‌ అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 20 ఉదయం 10 నుంచి 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.

5 నుంచి ఆర్మీ ఉచిత శిక్షణ
ఇచ్చోడ, న్యూస్‌టుడే : ఇచ్చోడ మండలంలోని యువశిక్షణ కేంద్రంలో సెప్టెంబరు 5 నుంచి నిరుద్యోగ యువతకు ఆర్మీ ఉద్యోగాల భర్తీ ర్యాలీలో పాల్గొనడానికి ఐటీడీఏ తరఫున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య, జేడీఎం నాగభూషణంసెప్టెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 7న జరగనున్న ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణత, కుల, ఆదాయ ధ్రువపత్రం, రెండు పాస్‌ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు. 17.5 నుంచి 21 ఏళ్ల వయసుండాలన్నారు. వివరాలకు 78936 16392, 97035 65987, 80080 87088కు సంప్రదించాలని సూచించారు.

యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
ఉట్నూరు, న్యూస్‌టుడే : గిరిజన యువత కోసం జగిత్యాల, హైదరాబాద్‌లలో న్యాక్‌ ద్వారా అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్‌ వర్క్‌ సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ సర్వేయర్, సీలింగ్, డ్రైవాల్‌ ఇన్స్‌స్ట్రాలర్‌ వంటి ఉపాధి కోర్సులలోÅ ఉచితంగా శిక్షణ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన గిరిజన అభ్యర్థులు సెప్టెంబరు 5న బెల్లంపల్లిలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో, సెప్టెంబరు 6న ఉట్నూరులోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్హత, ఇతరత్ర వివరాల కోసం 7893616392, 9493535052 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాల విద్యావిభాగం: విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించడానికి అర్హులైన మైనార్టీ విద్యార్థులు ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కె.శ్యామలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ పథకం కింద రూ.20 లక్షలు రెండు విడతలుగా అందజేయనున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలతో పాటు విమానయాన టికెట్టు ఖర్చు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. అర్హత, ఇతర వివరాలకు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్తీ చేయనున్నట్టు జిల్లా మాధ్యమిక విద్యాధికారి వి.ఇంద్రాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయా కళాశాలల్లో అతిథి(గెస్ట్‌) అధ్యాపకులుగా బోధించేందుకు అర్హత గలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని మంచిర్యాల కళాశాలలో ఒకేషనల్‌ సీజీటీలో-1, మందమర్రిలో భౌతికశాస్త్రం-1, చెన్నూరులో జంతుశాస్త్రం-1, బెల్లంపల్లి(బాలుర కళాశాలలో) ఒకేషనల్‌ ఎంఎల్‌టీ-1, సీఎస్‌-1 ఖాళీలు ఉన్నట్టు ఆమె చెప్పారు. సంబంధిత సబ్జెక్టుల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21 లోపు ఆయా కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ శిక్షణ
* ఉచిత భోజనం, వసతి, శిక్షణ
ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: అక్టోబర్‌ 7 నుంచి 17 వరకు కరీంనగర్‌ వేదికగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆర్మీ శిక్షణకు ఎస్సీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు మాజీ సైనికుల సమక్షంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి అత్యుత్తమంగా నిలిచిన వారికి ఎంపిక చేస్తామని వివరించారు. ఈ శిక్షణ సెప్టెంబరు 1 నుంచి 30 వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువకులు సద్వినియోగించుకోవాలని కోరారు.
నిర్వహించే అర్హత పరీక్షలు ఇవే
● 1.6 కి.మీ.ల పరుగును 5 నిమిషాల 30 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్లలోపు పూర్తి చేయాలి.
● 6 నుంచి 10 పుల్‌ అప్స్‌ తీయాలి.
● 9 అడుగుల డిచ్‌ జంప్‌ చేయాలి.
● జిగ్‌జాగ్‌బార్‌పైన నడవాలి.
23వ తేదీలోగా దరఖాస్తు..
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగ‌స్టు 23వ తేదీలోగా ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలోని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. సందేహాలు ఉంటే చరవాణి 91828 59341, 93813 03380లో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
ఎంపిక అర్హత పరీక్షలు, వేదిక..
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఈనెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఎంపిక అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణకు అర్హులు వీరే..
ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన ఎస్సీ, బీసీ యువకులు మాత్రమే ఉచిత శిక్షణకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందినవారికి రూ.2 లక్షలు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి.

కళాశాల స్థాయిలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ
* టాస్క్‌లో అభ్యర్థుల నమోదుకు నెలాఖరు తుదిగడువు
న్యూస్‌టుడే, దేవరకద్ర గ్రామీణం: పోటీ ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో పట్టాలు చేతిలో ఉన్నా.. అభ్యర్థులు కొలువుల సాధనలో వెనుకబడుతున్నారు. నైపుణ్యాలు లేక మెలకువలు కొరవడి ఉద్యోగ వేటలో చతికిలపడుతున్నారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన వారు కూడా ఉద్యోగ పోటీ పరీక్ష ఎదుర్కొనే సత్తా లేక నిరాశకు గురవుతున్నారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను చేర్పించడం తప్ప వారికి ఉపాధి మార్గాలు చూపడం లేదు. కళాశాల విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య అవకాశాలు కోల్పోతున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టాస్క్‌ (తెలంగాణ అకాడమి ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) బాసటగా నిలుస్తోంది. నైపుణ్యం, విజ్ఞానం పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపకల్పన చేసిన ఈ పథకం నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఒక వైపు చదువు.. మరోవైపు జీవితంలో అవసరమైన నైపుణ్యాలకు పదునుపెడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 28 కళాశాలల్లో 1,658 మంది విద్యార్థులు నమోదయ్యారు. 2019 - 20 విద్యా సంవత్సరానికి విద్యార్థులు నమోదు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆగ‌స్టు 31వ తేదీ గడువుగా విధించారు.
శిక్షణ భవితకు నిచ్చెన: ఇంజినీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఎంబీఏ, ఫార్మసీ చదివే విద్యార్థులకు అతి తక్కువ రుసుముతో అత్యున్నత ప్రమాణాలున్న శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలు ఎలా ఉన్నాయి.. ఉద్యోగుల నుంచి సంస్థల యాజమాన్యాలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిన్నాస్తుయనే అంశాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంలో మెరుగుపడేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేక కార్యశాల (వర్క్‌షాప్‌) నిర్వహించి నిపుణుల ద్వారా శిక్షణ అందజేస్తున్నారు. కళాశాలలో బోధకులతో పాటు ప్రత్యేకంగా టాస్క్‌ బృందం సభ్యులు కళాశాలకు వచ్చి బోధిస్తున్నారు. దాదాపు 18 రకాల అంశాలలో శిక్షణ ఇచ్చి టాస్క్‌ ధ్రువపత్రాలను అందజేస్తున్నారు.
* ఉద్యోగాలే కాకుండా విద్యార్థులను విభిన్న లక్ష్యాలు ఎంచుకొని విజయం సాధించే దిశగా చేయూతనిస్తున్నారు.
* పరిశ్రమలు నెలకొల్పడంతో మెలకువలు, అవసరమైన శిక్షణ ఇస్తున్నారు.
* ఆలోచనలకు సాంకేతికతను జోడించి అవకాశాలు ఎలా సృష్టించాలనే అంశాలపై బృంద చర్చలను ప్రోత్సహిస్తున్నారు.
* వ్యక్తిగత సామర్థ్యాలు, బృందాన్ని నడిపించగల నైపుణ్యం, సాంకేతిక, విజ్ఞాన అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు.
సంస్థల భాగస్వామ్యం ఇలా.. : నిరుద్యోగ యువత ఉపాధి కోసం చేపట్టిన టాస్క్‌ బహుళ సంస్థలను భాగస్వాములను చేసింది. నైపుణ్యాలున్న అభ్యర్థులను కోరుకుంటున్న పరిశ్రమలకు టాస్క్‌ వేదికగా నిలుస్తోంది. టాస్క్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులకు పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఐటీతో పాటు ఇతర రంగాల పరిశ్రమలతో టాస్క్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కళాశాలల్లో చదువు పూర్తి చేసుకున్న వారికి భాగస్వామ్య సంస్థల్లో ప్రవేశాలు ఉంటే సమాచారం అందిస్తారు. టాస్క్‌ ద్వారా పొందిన వారికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి.
సామర్థ్యాలు పెంచుకునేందుకు : చదువుకుంటూ నైపుణ్యాలను పెంచుకునేందుకు అంతర్జాలంలో నమోదు చేసుకున్నా.. మా కళాశాలలో టాస్క్‌ శిక్షణ అమలు చేస్తున్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) లేకనే చాలా మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదని మేమంతా ఇప్పటి నుంచే దృష్టి సారించాం. ఆంగ్ల భాషా ప్రావీణ్యం మెరుగుకోసం, ఉద్యోగ సాధనలో అవసరమైన విజ్ఞానాన్ని సాధించేలా శిక్షణ కొనసాగుతోంది.
- శిరీష, అప్పాయపల్లి ఇంజినీరింగ్‌ విద్యార్థి
అదనపు నైపుణ్యాలు తప్పనిసరి : చదువుతో పాటు వ్యక్తిత్వ నైపుణ్యాలు విద్యార్థులకు తప్పనిసరి. టాస్క్‌ ద్వారా ఉద్యోగ సాధనలో అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. విద్యార్థులకు టాస్క్‌లో శిక్షణ పొందేందుకు ఈనెల ఆఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ తదితర విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలి. - సిరాజొద్దీన్‌, టాస్క్‌ ప్రతినిధి

తపాలాలో ప్రతిభకు ప్రోత్సాహం
* ఆగస్టు 23 వరకు దరఖాస్తుకు అవకాశం
పెద్దకొత్తపల్లి: విద్యార్థుల్లో పరిశోధన, పరిశీలన సంగ్రహశక్తిని పెంపొందించేందుకు భారత తపాలాశాఖ ప్రతిభకు ప్రోత్సాహకం అందించేందుకు ఏటా అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులు దీనిలో పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగ‌స్టు 23వ తేదీ వరకు గడువు ఉంది.
* దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి తపాలా శాఖ 2017 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఈ ఏడాది కూడా ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువులోపు తపాలా డివిజనల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
పోటీలకు అర్హత ఇలా.. : తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు సులువు. గుర్తింపు పొందిన పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
పాఠశాలలో స్టాంపుల సేకరణ క్లబ్‌ ఉంటే అందులో సభ్యుడై ఉండాలి. స్టాంపుల సేకరణ క్లబ్‌ లేకుంటే పోటీలో పాల్గొనే విద్యార్థి సొంతంగా స్టాంపుల సేకరణ అభిరుచితో రూ.200 విలువ గల తపాలా స్టాంపులు సేకరించి ఉండాలి. గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ఇలా.. : ప్రతి తపాలా సర్కిల్‌కు 40 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 920 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు అర్హులను ఎంపిక చేస్తారు. దీని కోసం ఏటా రెండు స్థాయిల్లో ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి స్థాయిలో చరిత్ర, క్రీడలు, సైన్స్‌, జియోగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌, ఫిలాటరి (తపాలాస్టాంపుల సేకరణ)కి చెందిన అంశాలతో 50 మార్కులకు సెప్టెంబరు 15న పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులు అయినవారికి రెండో స్థాయి పరీక్ష ఉంటుంది. దీనిలో స్టాంపుల సేకరణ ప్రాజెక్టు అనే అంశంమీద పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం..
ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత దరఖాస్తులను నిర్ణీత పద్ధతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆయా జిల్లాల ప్రధాన తపాలా కార్యాలయాలకు ఆగ‌స్టు 23లోపు రిజిస్టర్‌ పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అందించనున్నాం.

సార్వత్రిక విద్య పరీక్ష రుసుం చెల్లించండి
వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : జిల్లాలో సార్వత్రిక విద్య (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు పరీక్ష రుసుం చెల్లించాలని డీఈవో రాజేశ్‌ ఒక ప్రకటనలో సూచించారు. ఆగ‌స్టు 26వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు అవకాశం ఉందని చెపన్పారు. పదో తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.100, ప్రయోగ పరీక్షకు రూ.50, టీఓసీ ఫీజు రూ.100, ఇంప్రూవ్‌మెంట్‌ ప్రతి సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.150, ప్రయోగ పరీక్షలకు రూ.100, టీవోసీ ఫీజు రూ.150, ప్రతి సబ్జెక్టు ఇంప్రూవ్‌మెంట్‌కు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. సమీప మీ సేవ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని చెప్పారు.

కస్తూర్బా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నిర్మల్‌ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో టామ్నె ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్‌ఎం పోస్టులు మొత్తం ఎనిమిది ఉన్నాయని, ఇందులో ఓసీ- 3, ఎస్సీ- 2, ఎస్టీ- 1, బీసీ(ఏ)- 1, దివ్యాంగులు- 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అకౌంటెంట్‌ పోస్టులు మొత్తం అయిదుకు గాను ఇందులో ఓసీ- 3, ఎస్సీ- 1, బీసీ(ఏ)- 1 కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏఎన్‌ఎం పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు ఏఎన్‌ఎం శిక్షణ (ప్రభుత్వ గుర్తింపు) పొంది ఉండాలని, అకౌంటెంట్‌కు బీకాం, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలని (ఎం.ఎస్‌.ఆఫీస్, బేసిక్స్‌) లేదా, బీకాం కంప్యూటర్స్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకునేవారు జూన్‌ 1 నాటికి 25 ఏళ్లు నిండి 44 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో, కేజీబీవీలలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 20న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

నిర్మల్‌లో జాబ్‌మేళా
నిర్మల్‌: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాళాల కాంప్లెక్స్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.ఎ.గప్ఫార్‌ తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేటు కంపెనీల్లో 734 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని, ఆసక్తి గల నిరుద్యోగ యువత విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకుని జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 91825 90222 నెంబరులో సంప్రదించాలని కోరారు.

ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ శిక్షణ
* ఉచిత భోజనం, వసతి, శిక్షణ
ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: అక్టోబర్‌ 7 నుంచి 17 వరకు కరీంనగర్‌ వేదికగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆర్మీ శిక్షణకు ఎస్సీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు మాజీ సైనికుల సమక్షంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి అత్యుత్తమంగా నిలిచిన వారికి ఎంపిక చేస్తామని వివరించారు. ఈ శిక్షణ సెప్టెంబరు 1 నుంచి 30 వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువకులు సద్వినియోగించుకోవాలని కోరారు.
నిర్వహించే అర్హత పరీక్షలు ఇవే
● 1.6 కి.మీ.ల పరుగును 5 నిమిషాల 30 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్లలోపు పూర్తి చేయాలి.
● 6 నుంచి 10 పుల్‌ అప్స్‌ తీయాలి.
● 9 అడుగుల డిచ్‌ జంప్‌ చేయాలి.
● జిగ్‌జాగ్‌బార్‌పైన నడవాలి.
23వ తేదీలోగా దరఖాస్తు..
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగ‌స్టు 23వ తేదీలోగా ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలోని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. సందేహాలు ఉంటే చరవాణి 91828 59341, 93813 03380లో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
ఎంపిక అర్హత పరీక్షలు, వేదిక..
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఈనెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఎంపిక అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
శిక్షణకు అర్హులు వీరే..
ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన ఎస్సీ, బీసీ యువకులు మాత్రమే ఉచిత శిక్షణకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందినవారికి రూ.2 లక్షలు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి.

15 వరకు నవోదయ దరఖాస్తుల గడువు
చొప్పదండి, న్యూస్‌టుడే: చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-2021 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. 2007 మే1 నుంచి 2011 ఏప్రిల్‌ 30 మధ్య జన్మించి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
https://navodaya.gov.in

ఎడ్‌సెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయంలో బీఈడీ, పీజీసెట్‌ 2019 ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఆగ‌స్టు 18న ఎడ్‌సెట్‌లో 340, పీజీ సెట్‌లో 500 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.ఉషారాణి తెలిపారు. ఆగ్టు 19న‌ ఎడ్‌సెట్‌లో బయలాజికల్‌ సైన్స్‌లో 1 నుంచి 6000వ ర్యాంకు వరకు పీజీ సెట్‌లో ఎమ్మెస్సీ గణితం 1 నుంచి 6000వ ర్యాంకు వరకు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ 1 నుంచి 1500 వరకు గల ర్యాంకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ
కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం బొమ్మకల్‌ మండలంలోని డ్రీమ్‌ డిఫెన్స్‌ అకాడమీలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆగ‌స్టు 22న అకాడమీ ప్రాంగణంలో 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

15 వరకు నవోదయ దరఖాస్తుల గడువు
చొప్పదండి, న్యూస్‌టుడే: చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-2021 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. 2007 మే1 నుంచి 2011 ఏప్రిల్‌ 30 మధ్య జన్మించి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
https://navodaya.gov.in

ఎడ్‌సెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయంలో బీఈడీ, పీజీసెట్‌ 2019 ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఆగ‌స్టు 18న ఎడ్‌సెట్‌లో 340, పీజీ సెట్‌లో 500 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.ఉషారాణి తెలిపారు. ఆగ్టు 19న‌ ఎడ్‌సెట్‌లో బయలాజికల్‌ సైన్స్‌లో 1 నుంచి 6000వ ర్యాంకు వరకు పీజీ సెట్‌లో ఎమ్మెస్సీ గణితం 1 నుంచి 6000వ ర్యాంకు వరకు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ 1 నుంచి 1500 వరకు గల ర్యాంకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ
కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం బొమ్మకల్‌ మండలంలోని డ్రీమ్‌ డిఫెన్స్‌ అకాడమీలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆగ‌స్టు 22న అకాడమీ ప్రాంగణంలో 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

నవోదయ ప్రవేశాల్లో గడువు పొడిగింపు
వర్గల్, న్యూస్‌టుడే: నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నేటితో గడువు ముగియనుండగా సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించామని వర్గల్‌ జవహర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్‌ వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే 78935 09094, 99519 38677, 94903 56731 నంబర్లలో సంప్రదించాలని అన్నారు.

తత్కాల్‌ ద్వారా సార్వత్రిక పరీక్ష ఫీజు చెల్లించండి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: సార్వత్రిక పది, ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్ష రుసుం తత్కాల్‌ ద్వారా సెప్టెంబరు 24వ తేదీ వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారిణి విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అభ్యాసకులు ప్రతి పాఠ్యంశంకు రూ.వందతో పాటు రూ.500 అదనంగా, ఇంటర్మీడియట్‌ అభ్యాసకులు ప్రతి పాఠ్యంశానికి రూ.150తో పాటు రూ.500 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రుసుం మీ-సేవా, ఏపీ ఆల్‌లైన్‌ కేంద్రాలలో మాత్రమే చెల్లించాలని సూచించారు.

నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
వర్గల్‌, న్యూస్‌టుడే: నవోదయ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని వర్గల్‌ జవహర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్‌ వెంకటరమణ జులై 31న తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి మెదక్‌ జిల్లా విద్యార్థులు 15 సెప్టెంబరు 2019 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ అర్హతలుండాలని వివరించారు.
* 01-05-2007 నుంచి 30-04-2011 లోపు జన్మించిన వారై ఉండాలి.
* ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
* అభ్యర్థి 3, 4 తరగతులు పూర్తి విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలోనే చదివి ఉత్తీర్ణులై ఉండాలి.
* ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న నిర్ధారిత ధ్రువపత్రం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించాలి.
* పాస్‌పోర్ట్‌ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
* ఆధార్‌ నంబర్‌, సంబంధికుల ఫోన్‌ నంబర్‌తో దరఖాస్తు చేయాలి.
* దరఖాస్తులో పొందుపరిచిన భాషలోనే ప్రశ్నపత్రం ఇస్తారు.
* నిర్దేశించిన ధ్రువపత్రాలను ‌www.navodaya.gov.in లో అప్‌లోడ్‌ చేయాలి.ః పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దరఖాస్తును ప్రింట్‌తీసి భద్రపరచుకోవాలి
* దరఖాస్తు చేసే విద్యార్థులు ఏవైనా సందేహాలు ఉంటే నివృతికి 78935 09094, 99519 38677, 94903 56731, 76758 89250 నంబర్లతో సంప్రదించాలి.

దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట టౌన్, న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లలో 2019-20 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్యాధికారిణి విజయారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీఏఎన్‌ఎస్, డీసీఏఆర్‌డీఐఓ, డీఆర్‌జీఏ, డీఈసీజీ, డీఏఎం, డీఆర్‌ఈఎస్‌టీ, డీఎంపీహెచ్‌ఏ (ఎం) కోర్సుల్లో రెండేళ్ల శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాలోని మూడు కళాశాలల్లో మొత్తం 230 సీట్లు ఉన్నాయన్నారు. ములుగులోని ఆర్‌వీఎం పారా మెడికల్‌ కళాశాలలో 150, సిద్దిపేట శ్రీసాయి ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎం) ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో 40, గజ్వేల్‌లోని శ్రీనిధి ఎంపీహెచ్‌ఏ(ఎం) ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని, వయసు 16 ఏళ్లు ఉండాలన్నారు. దరఖాస్తులు సెప్టెంబరు 25వ తేదీలోపు సిద్దిపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు ప్రతికి గజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన విద్యార్హత, తదితర ధ్రువపత్రాల ప్రతులను జత చేయాలని సూచించారు.

24 వరకు సార్వత్రిక రుసుం చెల్లించాలి..
సిద్దిపేట, న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక విద్యా విధానంలో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం పొంది అనుత్తీర్ణులైన, పరీక్ష రాయని వారికి అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి డాక్టరు రవికాంతరావు తెలిపారు. సిద్దిపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దీనికి హాజరు అయ్యే అభ్యాసకులు తత్కాల్‌ పథకం ద్వారా ఈ నెల 18 నుంచి 24వరకు మీ-సేవ/ టీఎస్‌ ఆన్‌లైన్‌/ ఏపీ ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల్లో రుసుం చెల్లించాలని సూచించారు. పదో తరగతిలో సబ్జెక్టుకు రూ.100 (థియరీ), రూ.50 (ప్రాక్టికల్‌), ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.150 (థియరీ), రూ.100 (ప్రాక్టికల్‌)కు చెల్లించాలన్నారు. తత్కాల్‌ పథకంలో భాగంగా పదోతరగతి వారు రూ.500, ఇంటర్‌ వారు రూ.1,000 అదనంగా ఫీజు చెల్లించాలన్నారు.

డీఎంఎల్‌టీ కోర్సులో ప్రవేశాలు
సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 2019-20 విద్యాసంవత్సరంలో డిప్లమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర పారామెడికల్‌ బోర్డు ప్రకటన జారీ చేసింది. సిద్దిపేటలో ఈ కోర్సులో 20 సీట్లున్నాయి. ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసినవారికి సీట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నిర్దేశిత వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకొని పూరించి సెప్టెంబరు 23లోగా కళాశాలలో అందించాల్సి ఉంటుంది.

ఒలింపియాడ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఒలింపియాడ్‌ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ అమరేశ్‌ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేటలో జిల్లా పరీక్షల విభాగం సహాయ సంచాలకులు శ్యాంప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా ఒలింపియాడ్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలుగా విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణితం, సామాన్య, ఆంగ్ల, అబ్దుల్‌ కలాం అంశాలపై నవంబరులో ఒలింపియాడ్‌ ఉంటుందన్నారు. మూడు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు రెండు స్థాయిల్లో పరీక్షకు ఆగస్టు 30వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 20 మంది విద్యార్థులకు ఉచితంగా అవకాశం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99083 13951 చరవాణిలో సంప్రదించాలన్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు శంకర్‌, రమేశ్‌ గౌడ్‌, రఘుపతి, బిక్షపతి తదితరులు ఉన్నారు.

18న మెగా ఉద్యోగ మేళా
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 18-35 ఏళ్ల వయస్సు కలిగిన నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేటు రంగ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగ మేళాను బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవరెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. అదనపు సమాచారం కోసం చరవాణి నంబర్లు 880123 7310, 94419 93390 ను సంప్రదించాలని సూచించారు.

26న విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు
సూర్యాపేట విద్యావిభాగం, న్యూస్‌టుడే: దేశంలోని కళలు, సంస్కృతి, వారసత్వ సంపదపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 26న మధ్యాహ్నం సూర్యాపేటలో శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో జిల్లాస్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు దిల్లీకి చెందిన భారత జాతీయ కళలు, సాంస్కృతిక, వారసత్వ సంపద(ఐఎన్‌టీఏసీహెచ్‌) సంస్థ తెలంగాణ విభాగం కో-కన్వీనర్‌ అనురాధరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. పాల్గొనడానికి ఎలాంటి రుసుము లేదని వెల్లడించారు. ప్రతి పాఠశాల నుంచి జట్టుకు ఇద్దరు సభ్యుల చొప్పున పది జట్ల వరకు పాల్గొనవచ్చని చెప్పారు. క్విజ్‌ ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు ఇస్తారు. జిల్లా స్థాయిలో విజేత జట్టును రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. విద్యార్థులు పెన్ను, ప్యాడ్‌తో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9246 5757 45, 95533 26147 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.

ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: మహాత్మాజ్యోతిరావుపూలే ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం లబ్ధి కోసం ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖాధికారి విమల కోరారు.. బీసీ, ఈబీసీ కులాలకు చెంది విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సోషల్‌సైన్స్‌, హ్యుమానిటీస్‌ తదితర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 31లోపు 35 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు ఈ పథకంకు అర్హులని తెలిపారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
https://telanganaepass.cgg.gov.in/

నూరు శాతం ఫలితాలు సాధించాలి: డీఈవో
కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా చదివితే ఉత్తీర్ణత సాధించడం సులువుగా ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ అన్నారు. కోదాడలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆగ‌స్టు 17న‌ సందర్శించారు. ఈసందర్భంగా పదోతరగతి విద్యార్థులకు చదువుపై అవగాహన కల్పించారు. విద్య ఒక విలువైన సంపద అని, చదువుకుంటే ఉన్నత లక్ష్యాలను చేరవచ్చని సూచించారు. విద్యార్థులు సమయపాలన పాటింలన్నారు. ఆత్మ విశ్వాసంతో చదివితే దేనినైనా సాధించవచ్చన్నారు. ప్రస్తుతం ఆగస్టు నెల హాజరు మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మూలాలకు వెళుదాం అనే అంశంపై పాఠశాలలో అవగాహన కల్పించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ.35లక్షలు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బయోమెట్రిక్‌ లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందకు కృషి చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించి, బిల్లులు సకాలంలో వస్తున్నాయని ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గోపతి గోపయ్య, ప్రధానోపాధ్యాయులు పి.కృష్ణయ్య, పీడీ రాంరెడ్డి పాల్గొన్నారు.

విదేశీ విద్యతో.. భవితకు భరోసా..!
* బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఆర్థిక సహాయం
* దరఖాస్తుల సమర్పణకు గడువు ఆగస్టు 31
జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: పేద, సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినా.. ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువుకు దూరమవుతున్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉంది.
దరఖాస్తు ఇలా..
● దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల నుంచి కులం, ఆదాయం, జనన ధ్రువీకరణపత్రాలు తీసుకోవాలి.
● ఆధార్‌కార్డు, పదో తరగతి, డిగ్రీ, ఇంటర్‌, పీజీ మార్కుల జాబితాతోపాటు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌, పీటీఈ అర్హత పత్రాలు కలిగి ఉండాలి.
● విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశ అనుమతి పత్రం కావాలి.
● కళాశాల ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు అవసరం.
● ఈ పత్రాల ఆధారంగా మీ సేవ కేంద్రంలో కానీ, అంతర్జాలంలోకానీ తెలంగాణ ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవాలి.
● సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపును అతికించి రిజిస్ట్రార్‌ సంతకంతో కూడిన ధ్రువీకరణపత్రాన్ని ఆదాయ పత్రానికి జత చేసి దరఖాస్తును సమర్పించాలి.
● దరఖాస్తులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సభ్యులు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి, రూ.20 లక్షలు రెండు విడతల్లో అందజేస్తారు.
● ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజికశాస్త్ర కోర్సుల్లో ఏదైనా డిగ్రీలో 60 శాతానికిపైగా మార్కులు సాధించాలి.
అర్హతలు..
● పీహెచ్‌డీ చేసి ఉండాలి.
● టోఫెల్‌లో 60 శాతం, ఐఈఎల్‌టీఎస్‌లో 6.0 మార్కులు, జీఆర్‌ఈలో 260, జీమ్యాట్‌లో 500, పీటీఈలో 50 మార్కులు అవసరం. వీటిలో ఏదైనా ఒక దాంట్లో అర్హత సాధించి ఉండాలి.
● 35 సంవత్సరాలలోపు వారు అర్హులు.
● తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దవూర రూరల్‌, న్యూస్‌టుడే : జవహర్‌ నవోదయ చలకుర్తి నందు 2020-21 సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్‌ కె.వి.నాగరాజు కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ 01.05.2007 నుంచి 30.04.2011 తేదీ మధ్యన జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.నవోదయ.గోవ్ట్‌.ఇన్‌, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జెఎన్‌వినల్గొండ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, చివరి తేది: 15-09-2019 అని పేర్కొన్నారు.

వైద్యం చౌకగా.. విద్య చేరువగా..
* ఉమ్మడి జిల్లాలో ఒకే ఏడాది మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు
* బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 27 నుంచి తరగతులు
బీబీనగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే విద్యా సంవత్సరంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కావడం విశేషమే. తద్వారా ఏడాదికి 350 మంది వైద్యులను అందించే అవకాశం ఏర్పడింది. జిల్లా ప్రజలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఏర్పాటు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఆస్పత్రిని ఇంకా ప్రారంభించనప్పటికీ ఈ ఏడాది బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆగస్టు 27న కార్యరూపం దాల్చనుంది. బీబీనగర్‌లోని అసంపూర్తి నిమ్స్‌ భవన సముదాయాల్లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయడానికి గతేడాది కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. అందులో భాగంగా ఈ ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీట్ల భర్తీకి ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 32 మంది సీట్లు పొందారని, మూడో విడత కౌన్సెలింగ్‌లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కానున్నాయని అధికారులు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో మూడు వైద్య కళాశాలలు
ఒకే ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట, నల్గొండ జిల్లా కేంద్రాల్లో 150 సీట్ల చొప్పున ఆగస్టు మొదటి వారంలో తరగతులను ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరులో 50 సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ వైద్య కళాశాల అందుబాటులోకి తీసుకురానుంది. ఉమ్మడి జిల్లాలో వైద్య విద్య అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తమవుతోంది.
భోపాల్‌ ఎయిమ్స్‌ డెరెక్టర్‌ ఆధ్వర్యంలో..
బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను రూ.1,028 కోట్ల అంచనాతో చేపట్టేందుకు ప్రధానమంత్రి స్వాస్థ్‌ సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద నిధులు మంజూరు చేస్తూ 2018 డిసెంబర్‌ 17న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 750 పడకలతో 15 సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో సేవలు, 100 ఎంబీబీఎస్‌ సీట్లు, 60 నర్సింగ్‌ సీట్ల భర్తీకి అనుమతులు ఇచ్చారు. వసతుల దృష్ట్యా అధికారులు ప్రస్తుతం 50 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు సరిపడా బోధన, బోధనేతర సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తిచేసినట్లు సమాచారం.
ముమ్మరంగా ఏర్పాట్లు
వసతులు దృష్ట్యా వైద్య విద్య తరగతులు మొదట భువనగిరి శివారులోని శారదా ఇంజినీరింగ్‌ కళాశాలలో, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలోనే ఓ భవనంలో ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. చివరకు బీబీనగర్‌ నిమ్స్‌ భవన సముదాయాల్లోనే ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా రెండు నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎ బ్లాక్‌లో ఎయిమ్స్‌ వైద్య విద్య తరగతులు ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదులతో పాటు వీఐపీ లాంజ్‌, డైరెక్టర్స్‌ ఛాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, వైద్యుల గదులు, రికార్డు గదులతో పాటు విద్యార్థులు బస చేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
27న తరగతులు ప్రారంభం - రమేష్‌రెడ్డి, రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు
బీబీనగర్‌లోని నిమ్స్‌ భవన సముదాయాల్లోనే ఆగస్టు 27న ఎయిమ్స్‌ వైద్య విద్య తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు కావాల్సిన ఫ్యాకల్టీ (వైద్యులను), సిబ్బంది నియామకం ఇటీవల పూర్తయింది. తరగతి గదులు, విద్యార్థుల వసతుల ఏర్పాట్ల పరిశీలన, పరికరాల కొనుగోలుకు ఈ వారంలో కేంద్ర బృందం బీబ్కీ నగర్‌కు రానుంది.

ఓవర్‌సీస్‌ విద్యానిధి కింద దరఖాస్తుకు 31 వరకు అవకాశం
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం కింద 2019-20 సంవత్సరానికి వెనకబడిన తరగతుల కులాలకు, ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31వరకు అవకాశం ఉందని జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి విమల తెలిపారు. వెబ్‌సైట్‌ telanganaepass.cgg.gov.in నందు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విదేశాలలో విద్యనభ్యసిస్తున్న బీసీ, ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

20న‌ వికారాబాద్‌లో ఉద్యోగమేళా
వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ పురపాలక సంఘం, మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆగ‌స్టు 20న‌ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్టు కమిషనర్‌ భోగేశ్వర్లు తెలిపారు. అసిస్టెంట్‌ సేల్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తిచేసిన 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ ఉద్యోగానికి అర్హులన్నారు. ఎంపికయిన వారికి నెలకు రూ.11,190 వేతనం, టీఏ, డీఏ అదనంగా ఇస్తారని, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం ఉంటుందని తెలిపారు. మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ బయోడేటా ఫారం, అర్హత ధ్రువీకరణ పత్రాలు, అధార్‌కార్డు జిరాక్స్‌, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోల‌ను పురపాలక సంఘం కార్యాలయ సమావేశ మందిరానికి వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపిక ప్ర‌క్రియ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఇత‌ర సందేహాల‌కు చరవాణి నంబర్లు 80085 64447, 91007 00227కు సంప్ర‌దించ‌వచ్చ‌ని పేర్కొన్నారు.

సార్వత్రిక సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు 26
వికారాబాద్‌ టౌన్‌: అక్టోబరులో నిర్వహించే తెలంగాణ సార్వత్రిక విద్య సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఎలాంటి ఆపరాధ రుసుము లేకుండా ఆగ‌స్టు 26 వరకు చెల్లించే అవకాశం ఉందని డీఈఓ రేణుకాదేవి తెలిపారు. రూ.25 అపరాధ రుసుముతో 27 నుంచి సెప్టెంబరు 3 వరకు, రూ.50తో సెప్టెంబరు 4 నుంచి 11 వరకు చెల్లించేందుకు గడువు ఉందని తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు రూ.150, ప్రాక్టికల్స్‌కు రూ.100, పదో తరగతి పరీక్ష ఫీజు రూ.100 చెల్లించాలని తెలిపారు. మీసేవ కేంద్రాలలో మాత్రమే ఫీజు చెల్లించాలన్నారు.

తపాలాలో ప్రతిభకు ప్రోత్సాహం
* ఆగస్టు 23 వరకు దరఖాస్తుకు అవకాశం
పెద్దకొత్తపల్లి: విద్యార్థుల్లో పరిశోధన, పరిశీలన సంగ్రహశక్తిని పెంపొందించేందుకు భారత తపాలాశాఖ ప్రతిభకు ప్రోత్సాహకం అందించేందుకు ఏటా అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులు దీనిలో పాల్గొనే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగ‌స్టు 23వ తేదీ వరకు గడువు ఉంది.
* దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి తపాలా శాఖ 2017 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఈ ఏడాది కూడా ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువులోపు తపాలా డివిజనల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
పోటీలకు అర్హత ఇలా.. : తపాలా స్టాంపుల సేకరణ అభిరుచి గల విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు సులువు. గుర్తింపు పొందిన పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
పాఠశాలలో స్టాంపుల సేకరణ క్లబ్‌ ఉంటే అందులో సభ్యుడై ఉండాలి. స్టాంపుల సేకరణ క్లబ్‌ లేకుంటే పోటీలో పాల్గొనే విద్యార్థి సొంతంగా స్టాంపుల సేకరణ అభిరుచితో రూ.200 విలువ గల తపాలా స్టాంపులు సేకరించి ఉండాలి. గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ఇలా.. : ప్రతి తపాలా సర్కిల్‌కు 40 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 920 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు అర్హులను ఎంపిక చేస్తారు. దీని కోసం ఏటా రెండు స్థాయిల్లో ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి స్థాయిలో చరిత్ర, క్రీడలు, సైన్స్‌, జియోగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌, ఫిలాటరి (తపాలాస్టాంపుల సేకరణ)కి చెందిన అంశాలతో 50 మార్కులకు సెప్టెంబరు 15న పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులు అయినవారికి రెండో స్థాయి పరీక్ష ఉంటుంది. దీనిలో స్టాంపుల సేకరణ ప్రాజెక్టు అనే అంశంమీద పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం..
ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత దరఖాస్తులను నిర్ణీత పద్ధతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆయా జిల్లాల ప్రధాన తపాలా కార్యాలయాలకు ఆగ‌స్టు 23లోపు రిజిస్టర్‌ పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అందించనున్నాం.

వృత్తివిద్య కోర్సుల అభ్యర్థులకు ఉపాధి, ఉద్యోగమేళా
వనపర్తి పట్టణం : వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సింహయ్య తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగ‌స్టు 22న మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియరు కళాశాల మైదానంలో మెగా ఉద్యోగ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వృత్తివిద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులంతా హాజరు కావాలని ఆయన కోరారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రదానాచార్యులు, అధ్యాపకులు, వృత్తివిద్యను పూర్తి చేసిన విద్యార్థులు హాజరు కావాలని ఆయన తెలిపారు.

8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇస్రో క్విజ్‌ పోటీలు
సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఇస్రో.. మైగవ్‌లు ‘ఆన్‌లైన్‌ స్పేస్‌ క్విజ్‌’ పేరిట ఆగస్టు 10వ తేదీ నుంచి 20 వరకు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు అ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. 20 ప్రశ్నలకు సమాధానాల్ని 10 నిమిషాల్లో (600 సెకన్లలో) చెప్పాల్సి ఉంటుంది. ఒక విద్యార్థికి ఒకసారే ఆన్‌లైన్‌లో పోటీలో పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది. క్విజ్‌లో పాల్గొనే విద్యార్థులు quiz.mygov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల సైన్సు అధికారులు మధుకుమార్‌, హుసేన్‌ పేర్కొన్నారు.

యువతకు ఉచిత శిక్షణ
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకారం అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు పలు అంశాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంఘం కార్యనిర్వాహక సంచాలకులు కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బీకాం, ఎంకాం, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని ఆయన తెలిపారు. ట్యాలీ, ఈఆర్‌పీ, జీఎస్‌టీ కోర్సుల్లో ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పూర్తి విద్యార్హతలతో సెప్టెంబరు 30లోపు పాత మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్‌ నెంబర్‌: 98499 00722కు సంప్రదించాలని ఆయన చెప్పారు.

ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: మహాత్మాజ్యోతిరావుపూలే ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం లబ్ధి కోసం ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖాధికారి విమల కోరారు.. బీసీ, ఈబీసీ కులాలకు చెంది విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సోషల్‌సైన్స్‌, హ్యుమానిటీస్‌ తదితర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 31లోపు 35 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు ఈ పథకంకు అర్హులని తెలిపారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
https://telanganaepass.cgg.gov.in/

6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: చలకుర్తిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబరు 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
www.navodaya.gov.in

సెప్టెంబ‌రు 16న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష
కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష సెప్టెంబ‌రు 16న నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌ రెడ్డి, అదనపు అధికారులు డాక్టర్‌ పి.సదానందం, డాక్టర్‌ వై.వెంకయ్య ఆగ‌స్టు 26న‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 1,226 మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

నిరుద్యోగ యువతులకు ఉచిత శిక్షణ
మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతుల (బాలిక)కు వృత్తి నైపుణ్యాభివృద్ధిపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి సూర్యనారాయణ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యయోజన (డీడీయూజీకేవై) పథకంలో భాగంగా ఆసక్తి కలిగిన యువతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సెస్టెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ కార్యక్రమంలో 19 నుంచి 26 ఏళ్ల వయస్సులోపు ఉన్న యువతులు పదో తరగతి ఉత్తీర్ణులై చదువు మానేసిన వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థినులకు కేసముద్రం శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లం, కంప్యూటర్స్‌, పని సంసిద్ధత కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన యువతులు ఆగస్టు 22 నుంచి 25 వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబితా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు ఒరిజినల్‌ పత్రాలను తీసుకురావాలని తెలిపారు.

నిరుద్యోగ యువతులకు ఉచిత శిక్షణ
మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతుల(బాలిక)కు వృత్తి నైపుణ్యాభివృద్ధిపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి సూర్యనారాయణ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యయోజన(డీడీయూజీకేవై) పథకంలో భాగంగా ఆసక్తి కలిగిన యువతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సెస్టెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ కార్యక్రమంలో 19 నుంచి 26 ఏళ్ల వయస్సులోపు ఉన్న యువతులు పదో తరగతి ఉత్తీర్ణులై చదువు మానేసిన వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థినులకు కేసముద్రం శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లం, కంప్యూటర్స్‌, పని సంసిద్ధత కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన యువతులు ఆగస్టు 22 నుంచి 25 వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబితా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు ఒరిజినల్‌ పత్రాలను తీసుకురావాలని తెలిపారు.

ఎన్‌టీఎస్‌ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి
నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: నవంబర్‌లో నిర్వహించనున్న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ) ప్రథమ స్థాయి పరీక్షకు జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఆగ‌స్టు 10న‌ తెలిపారు. అన్ని గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ గుర్తింపు పొందిన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పరీక్ష రుసుముగా రూ.100 చెల్లించాలన్నారు. ఆగ‌స్టు 28 వరకు పరీక్ష రుసుము చెల్లించాలని, దరఖాస్తులు 29 వరకు నమోదు చేయాలన్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

విద్యా నిధి పథకానికి దరఖాస్తు
నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిభాఫులే విదేశీ విద్యానిధికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి లక్ష్మణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 2019-20 విద్యా సంవత్సరానికిగాను బీసీ, ఈబీసీకి చెందిన విద్యార్థులకు ఆగస్టు 31 లోపు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంజినీరింగ్‌, వైద్యం, సైన్స్‌, మేనేజిమెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజికశాస్త్రంలో డిగ్రీలో 60 శాతం మార్కులు, టోఫెల్‌ -60, ఐఈఎల్‌టీఎస్‌-60, జీఆర్‌ఇ 260, జిఆమ్‌ఎటీ-500, పీటి-50 మార్కులు సాధించినవారు అర్హులన్నారు. 2019 జులై ఒకటో తేదీ వరకు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షలకు మించి ఉండకూడదన్నారు. మొదటి సంవత్సరం దరఖాస్తు చేసుకోని విద్యార్థులు రెండో సంవత్సరం చేసుకోవాలని, దరఖాస్తులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు రెండు విడతల్లో రూ.20 లక్షలు మంజూరు చేస్తుందన్నారు.