Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

డీఎస్సీ పాఠ్యాంశాల వెయిటేజీలో మార్పు
* బోధన శాస్త్రానికి 4 మార్కుల పెంపు
* కంటెంట్‌ 40 మార్కులకు కుదింపు

ఈనాడు - అమరావతి: డీఎస్సీ పాఠ్యాంశాల(సిలబస్‌) వెయిటేజీలో మార్పు చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త వెయిటేజీని రూపొందించారు. అక్టోబ‌రు 23న‌ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న సమీక్షలో ఆమోదం అనంతరం దాన్ని పరీక్షల నిర్వహణ విభాగానికి అప్పగించనున్నారు. స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులకు గతంలో విషయం(కంటెంట్‌)కు 44 మార్కులు ఉండగా ఇకపై 40 మార్కులకు కుదిస్తున్నారు. ఈ నాలుగు మార్కుల వెయిటేజీని బోధన శాస్త్రం(మెథడాలజీ)కి ఇవ్వనున్నారు. దీంతో బోధన శాస్త్రం నుంచి 20 మార్కులకు ప్రశ్నలు రానున్నాయి. మొత్తం 80 మార్కులకు 160 ప్రశ్నలు ఇవ్వనున్నారు.
కొత్త విధానం ప్రకారం..
* జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు-10.
* విద్య దృక్కోణాలు (ప్రాస్పెటివ్స్‌)-5.
* తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వ శాస్త్రం (సైకాలజీ)-5.
* విషయం (కంటెంట్‌)-40.
* బోధనశాస్త్రం (మెథడాలజీ)-20
ఎస్జీటీలోనూ మార్పు..!
ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష కలిపి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఉంటుంది.
* జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు - 5.
* విద్య దృక్కోణాలు(ప్రాస్పెటివ్స్‌) - 5.
* తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వశాస్త్రం(సైకాలజీ)-10.
* లాంగ్వేజ్‌-1-16.
* లాంగ్వేజ్‌2-16.
* గణితం-16.
* సామాన్యశాస్త్రం-16.
* సాంఘిక శాస్త్రం-16
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల పెంపు..!
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను పెంచనున్నారు. ఉత్తర్వులు అక్టోబ‌రు 23న‌ పాఠశాల విద్యాశాఖకు అందే అవకాశం ఉంది. జడ్పీ, ఎంపీపీ, పురపాలిక పాఠశాలల్లో కలిపి ఇటీవల 47 పోస్టులు ప్రకటించగా.. వీటిని 350కు పెంచనున్నారు. ఇవికాక గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీ పోస్టులు కలవనున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఆర్‌ఈఐ రిజర్వేషన్‌ రోస్టర్‌ను పూర్తిచేశాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల-350 పోస్టులకు డీఎస్సీ నిర్వహణకు ఆశాఖ ఆమోదం తెలిపినా ఇంతవరకు పూర్తి వివరాలు అందించలేదు.

Published on 23-10-2018