Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

తీర్పు ప్రకారమే టీఆర్‌టీ
* ఉప ముఖ్యమంత్రి కడియం
ఈనాడు, హైదరాబాద్‌: న్యాయస్థాన తీర్పునకు అనుగుణంగా తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నవంబరు 17న ఆయన శాసనసభ ప్రాంగణంలో మాట్లాడారు. ‘విద్యా వ్యవస్థ మేలు కోసమే ప్రభుత్వం 31 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది. 10జిల్లాల ప్రాతిపదికన చేపడితే జిల్లా కేంద్రాల్లో పనిచేయడానికే ఆసక్తి చూపుతారు. వచ్చేవారం న్యాయస్థానంలో టీఆర్‌టీపై తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. దానికనుగుణంగా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లుపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

Published on 18-11-2017