Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టీఆర్‌టీ దరఖాస్తు సవరణల గడువు పొడిగింపు
* 15 వరకు అవకాశమిచ్చిన టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణ, పూర్వ జిల్లాల ప్రాతిపదికన ఆప్షన్లను మార్పు చేసేందుకు ఇచ్చిన గడువును టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. జనవరి 15 వరకు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 7న దరఖాస్తు గడువు ముగిసిన తరువాత... అందులోని వ్యక్తిగత వివరాలు, అర్హతలు, ఇతరత్రా తప్పులను సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ జనవరి 9 నుంచి 11 వరకు అభ్యర్థులకు మార్పుల (ఎడిట్) అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మార్పులు చేయడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. బుధ, గురువారాల్లో ప్రయత్నించిన అభ్యర్థులు.. విఫలమై కమిషన్ అధికారులు, సీజీజీ నిపుణులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొందరు అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు సమస్యను వివరించారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా టీఆర్‌టీకి సంబంధించినవే ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెప్పాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని గడువు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.

Published on 12-01-2018