Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఏపీలో 7,729 ఉపాధ్యాయ పోస్టులు (చివ‌రితేది: 16.11.18)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ, పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల పోస్టులు మొత్తం కలిపి 7,729 భర్తీ చేయనున్నారు.
వివ‌రాలు...
పోస్టు-ఖాళీలు: స్కూల్ అసిస్టెంట్ (గ‌ణితం, భౌతిక‌శాస్త్రం, జీవ‌శాస్త్రం, సాంఘిక‌శాస్త్రం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, ఉర్దు, కన్న‌డ‌, త‌మిళం, ఒరియా, సంస్కృతం, వ్యాయామ‌విద్య‌), భాషా పండితులు (తెలుగు, హిందీ, ఉర్దు, ఒరియా, త‌మిళం, సంస్కృతం), ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్ అండ్ డ్రాయింగ్‌, సెకండరీ గ్రేడ్ టీచ‌ర్‌, ప్రిన్సిప‌ల్‌, టీజీటీ, పీజీటీ.
అర్హ‌త‌లు: పోస్టుల‌ను బ‌ట్టి ఇంట‌ర్‌, బ్యాచిల‌ర్ డిగ్రీ, పీజీ, డీఈడీ/ డీఈఎల్ఈడీ, బీఈడీ/ బీఈఎల్ఈడీ, బీపీఈడీ/ ఎంపీఈడీ, పండిట్ ట్రెయినింగ్, టెట్‌ త‌దిత‌రాల్లో ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 44 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.
ఫీజు చెల్లింపు తేదీలు: 2018 నవంబరు 1 నుంచి 15 వరకు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 01.11.2018.
చివ‌రితేది: 16.11.2018.
ప‌రీక్షా కేంద్రాలకు ఐచ్ఛికాలు: నవంబరు 19 నుంచి 24 వరకు ఇచ్చుకోవచ్చు.
ఆన్‌లైన్‌ పరీక్షాల తేదీలు:
స్కూల్ అసిస్టెంట్లు భాషేతర: 2018 డిసెంబరు 6, 10.
స్కూల్‌ అసిస్టెంట్లు భాషలు: 2018 డిసెంబరు 11.
పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు: 2018 డిసెంబరు 12, 13.
ట్రెయినింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, ప్రిన్సిపల్‌: 2018 డిసెంబరు 14, 26.
పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయిండ్‌: 2018 డిసెంబరు 17.
భాషాపండితులు: 2018 డిసెంబరు 27.
ఎస్జీటీ: 2018 డిసెంబరు 28 నుంచి 2019 జనవరి 2 వరకు.

Published on 27-10-2018