Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

విజయనగరంలో డీఎస్సీకి మరో 23 కొత్త పోస్టులు
* పురపాలక పోస్టులు మంజూరు
* ఆన్‌లైన్‌ ప్రకటనతో వెల్లడి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: డీఎస్సీకి పోస్టుల సంఖ్య కొంత పెరిగింది. పురపాలక యాజమాన్యంలో పోస్టులు కలపడంతో ఈ సంఖ్యలో మార్పు చోటుచేసుకుంది. ప్రకటనతో సంబంధం లేకుండా నేరుగా ప్రకటించారు. జిల్లాలవారీగా పోస్టులు డిసెంబ‌ర్‌ 4న వెబ్ సైట్లో అందుబాటులోకి వచ్చాయి. గడిచిన ఏడాదితో పోల్చితే పోస్టుల సంఖ్య భారీగా తగ్గింది. గత డీఎస్సీకి జిల్లాకు 116 పోస్టులు పురపాలక యాజమాన్యంలో కేటాయించగా, ఈసారి 23 మాత్రమే కేటాయించారు. ఇందులో 11 ఎస్జీటీ, 04 పాఠశాల సహాయకులు, 08 భాషాపండిట్ పోస్టులున్నాయి. దీంతో డీఎస్సీకి భర్తీ చేసే పోస్టుల సంఖ్య 339కి చేరినట్లయింది. ఒక విధంగా డీఎస్సీ పోస్టులు కోతపడటంతో అభ్యర్థులు పురపాలక పోస్టులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోస్టుల సంఖ్య ఆశించినమేర లేకపోవడంతో ఖంగుతిన్నారు. విద్యాశాఖకు ఈ విషయమై సమాచారం రావాల్సి ఉంది.

Published on 05/12/2014