Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

సుప్రీంకోర్టులో డీఎస్సీ-1998 కేసు విచారణ
* హాజరైన తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ
* తదుపరి విచారణ ఫిబ్రవరి 1కి వాయిదా

దిల్లీ: డీఎస్సీ-1998 కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ డిసెంబరు 8న సుప్రీంకోర్టులో హాజరయ్యారు. గతంలో సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వాల తీరును న్యాయస్థానం కోర్టు ధిక్కరణగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. 1998 డీఎస్సీలో అన్యాయం జరిగిందని ఆరుగురు అభ్యర్థులు పిటిషన్‌ దాఖలుచేశారు. ఆరుగురికి ఉద్యోగం ఇస్తే మరో 600 మందికి ఇవ్వాల్సివస్తుందని సీఎస్‌ తెలిపారు. కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

Published on 08/12/2014