Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

23 వేల మంది డీఎస్సీ దరఖాస్తుల్లో వివరాల్లేవు
* వారికి హాల్‌ టికెట్లు పంపబోమన్న విద్యాశాఖ కమిషనర్‌
ఈనాడు-హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామకాల కోసం ఏపీ టెట్ కమ్ టీఆర్‌టీ -2014కి ఆన్‌లైన్‌ ద్వారా 4,20,038 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా అందులో 23,282 మంది దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు పరిగణనలోనికి తీసుకోలేదు. వీరు నేరుగా విద్యాశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను అందచేయలేదు. దీనివల్ల వీరికి హాల్‌ టిక్కెట్లను పంపేది లేదని ఏపీ విద్యా శాఖ కమిషనర్‌ సంధ్యారాణి మార్చి 20న విలేకర్లతో చెప్పారు. 2500 మంది అభ్యర్థులు అర్హతల పరంగా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారని, వారిని పరీక్షలు రాసేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. మే 9, 10, 11 తేదీల్లో డీఎస్సీ రాత పరీక్షలు 1181 కేంద్రాల్లో జరగనున్నాయి. పాఠశాల కేంద్రంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తర్వాతే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలను చేపడతామని సంధ్యారాణి చెప్పారు.
అవకాశాలు ఇచ్చాం: విద్యాశాఖ
ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపిన వారు నేరుగా నకళ్ల ప్రతులను జిల్లా విద్యా శాఖ కార్యాలయాల్లో అందజేయాలని పలుదఫాలుగా అభ్యర్థులకు తెలియచేసినట్లు విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి భార్గవ్‌ తెలిపారు. అయినప్పటికీ 23 వేల మంది నుంచి వివరాలు అందలేదన్నారు. కొందరు ఆన్‌లైన్‌లో తప్పులతో దరఖాస్తులను పంపినందున నేరుగా కార్యాలయాల్లో నకళ్లను ఇవ్వలేదు. కొంతమంది అర్హతలు, కులాలను ఆన్‌లైన్‌లో నిర్థారించినప్పటికీ నకళ్లను సమర్పించలేదు. స్థానిక, స్థానికేతర ధ్రువపత్రాల నకళ్ల సమర్పణలోనూ సమస్యలొచ్చాయి. రావాల్సిన నకళ్ల గురించి పలుచోట్ల సంబంధిత అభ్యర్థులకు చరవాణి ద్వారా తెలియచేశారు. చివరికి 23 వేల మంది అభ్యర్థుల నుంచి వివరాలు రాలేదని, వీరికి హాల్‌టిక్కెట్లను పంపడం లేదని చెప్పారు. ఈ అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు.
http://apdsc.cgg.gov.in/

Published on 23/3/2015