Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఏపీ బీఎడ్‌ అభ్యర్థులకూ ఆ వెసులుబాటు వర్తిస్తుందా?
ఈనాడు, హైదరాబాద్‌: సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టుల నియామకాలకు బీఎడ్‌ పూర్తిచేసిన వారు కూడా అర్హులేనని పశ్చిమబంగ ప్రభుత్వానికి కేంద్రం తెలియజేయడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ వెసులుబాటును 2016 మార్చి 31 వరకు మాత్రమే ఇచ్చినట్టు కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. ఈ అంశంపై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పుడు.. ఇలాగే కోరిన పశ్చిమబంగకు అనుమతి ఇవ్వలేదని, అదే పద్ధతి ఇక్కడా వర్తిస్తుందంటూ చెప్పింది. ప్రస్తుతం పశ్చిమబంగకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే డీఎస్సీ-2014 ప్రకటనను జారీచేసినందున నిబంధనలు మార్చడం సాధ్యం కాదని ప్రభుత్వవర్గాలు భావిన్నాయి. ఏ పరిస్థితుల్లో పశ్చిమబంగకు అనుమతి లభించిందో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి.

Published on 20/4/2015