Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

డీఎస్సీ రాతపరీక్షలు యథాతథం
* 25 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లు
ఈనాడు-హైదరాబాద్: డీఎస్సీ-2014 (ఉపాధ్యాయ నియామక) రాతపరీక్షలు ప్రకటించిన తేదీల్లో (మే నెలలో)నే యథాతథంగా జరుగుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నియామక ప్రకటన జారీచేసి... పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగి, హాల్‌టిక్కెట్ల పంపిణీ జరగబోతున్న తరుణంలో వాయిదా అన్నది ఉండదని పేర్కొన్నారు. పశ్చిమబంగలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి కేంద్రం అవకాశం కల్పించిన విషయమై మాట్లాడుతూ..తాము ఈ అంశంపై కేంద్రంతో రెండునెలలు సంప్రదింపులు జరిపినా ఫలితం కనిపించలేదని, కేంద్ర సానుకూల నిర్ణయం కోసం ప్రకటన జారీ చేయకుండా వేచి చూశామని తెలిపారు. ప్రకటన జారీచేసిన అనంతరం నిబంధనల్లో మార్పులు తీసుకురావడం అన్నది కష్టమని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. నిబంధన్లను మార్చాల్సి వస్తే..నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దుచేయాల్సి ఉంటుందన్నాయి. మరోవైపు..డీఎస్సీ అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్ లో ఏప్రిల్ 25 నుంచి డౌన్‌లోడు చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు ఏపీ విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు.




Published on 1/5/2015