Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఏపీకి 860 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు
ఈనాడు-హైదరాబాద్‌: విద్యాశాఖలో 860 స్కూల్‌ అసిస్టెంట్‌ (స్పెషల్‌ టీచర్స్‌-ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వినికిడి, కంటిచూపు లోపం, మానసిక ఎదుగుదలలేని వారికి బోధించేందుకు ఈ పోస్టులను 2012లో 1476 పోస్టులు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసింది. రాష్ట్ర విభజన దృష్ట్యా ఇందులో 860 పోస్టులు ఏపీ పరిధిలోకి వచ్చాయి. కోర్టు ఆదేశాలతో ఈ విషయమై ఉత్తర్వులు ఏప్రిల్ 7న వెలువడ్డాయి. ఈ వివరాలు జి.ఒ.39లో ఉన్నాయి.




Published on 2/5/2015