Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఆశ్రమ పాఠశాలల్లో 314 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
* ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి
ఈనాడు, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఆశ్రమ పాఠశాలల్లో (నాన్ షెడ్యూల్డు ఏరియా) 314 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. వీటిని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఏప్రిల్ 4న ఇక్కడ మీడియాకు తెలిపారు.
402 పోస్టుల (షెడ్యూల్డు ఏరియా)ను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు సంబంధించిన దస్త్రం పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు.




Published on 2/5/2015