Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టెట్ క‌మ్ టీఆర్‌టీకి ప్రత్యేక సిలబస్
* ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోయే ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షలకు (టెట్ కమ్ టీఆర్‌టీ) ప్రత్యేక సిలబస్‌ను పెడుతున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పేర్కొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండింటినీ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక సిలబస్‌ను అనుసరిస్తామని ఆమె వివరించారు. ఈ సిలబస్ అంశాలను త్వరలోనే తమ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ప్రకటిస్తామన్నారు. ఈసారి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారిలో వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణలోని మెలకువలను కూడా అంచనా వేస్తామని చెప్పారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి వచ్చిన మేరకు 9,061 పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఆ సంఖ్య మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రోస్టర్ పద్ధతిలో తెప్పిస్తున్నామన్నారు. మునిసిపల్ పాఠశాలల్లోని 1,250 టీచర్ల పోస్టులను ఈ డీఎస్సీలోనే కలిపి భర్తీచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో టెట్ లో అర్హులైన వారికి ఈసారి పరీక్షలో 20 శాతం మార్కులు వెయిటేజీగా ఇవ్వనున్నామని ఉషారాణి స్పష్టం చేశారు. ఈ 20 శాతం వెయిటేజీని గతంలో టెట్‌లో వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్నే కలుపుతామన్నారు.

Published on 27/11/2014 01:16:29 PM