Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి
* ఏపీ పాఠశాల విద్య కార్యదర్శి సిసోడియా వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులను అనుమతించే విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఏపీ పాఠశాల విద్య కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించే విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లు వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. ఏపీ, పశ్చిమ్‌బంగ ప్రభుత్వాల ప్రతిపాదలు వేరుగా ఉన్నాయని వివరించారు. పశ్చిమ్‌బంగ ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ఉపాధ్యాయ అర్హతల్లో మినహాయింపు కొంత కాలం పొడిగించాలని అభ్యర్థించిందన్నారు. ఆ రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ విద్యాలయాల కొరతతో పాటు అర్హత కలిగిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో అక్కడ ఆయా ఉపాధ్యాయ అర్హతలు లేకున్నా, డిగ్రీ చదివిన వారికి ఉపాధ్యాయ పోస్టుల్లో నియమించింది. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హతలు సాధించుకునేందుకు అనుమతిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఈడీ అర్హత కలిగిన వారిని నియమించేందుకు 2016 జనవరి 1 వరకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిందన్నారు.




Published on 2/5/2015