Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టెట్ క‌మ్ టీఆర్‌టీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
* పరీక్షలు నిర్వహించండి.. జూన్‌ 3వరకు నియామకాల ఖరారు వద్దు
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయుల నియామక పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 2014 నవంబరు 19న జారీచేసిన ఉత్తర్వు 38ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎం.వేణుగోపాల్‌కృష్ణంరాజుతో పాటు మరో ఎనిమిది మంది హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, ప్రమాణపత్రం దాఖలు చేయాలని మే 2న ఆదేశించారు. పరీక్షలు యథాతథంగా జరపవచ్చని స్పష్టంచేశారు. జూన్‌ 3 వరకు నియామకాలను ఖరారు చేయొద్దని అధికారులను ఆదేశించారు.




Published on 03/05/2015